E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

మార్కెట్ లోకి హీరో ప్యాషన్+ డిస్క్ వేరియంట్ ఎంట్రీ.. ధర ఎంతో తెలుసా?

మార్కెట్ లోకి హీరో ప్యాషన్+ డిస్క్ వేరియంట్ ఎంట్రీ.. ధర ఎంతో తెలుసా?
Advertisement

Hero Launches Passion+ Disc: ఇండియన్ టూ వీలర్ మార్కెట్ లోకి హీరో కార్ప్ పాపులర్ కమ్యూటర్ బైక్ ప్యాషన్+కు కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది. ప్యాషన్+ డిస్క్ పేరుతో ఈ కొత్త మోడల్‌ ను తాజాగా విడుదల చేసింది. ఈ బైక్‌ ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌ ను అందించింది. కొత్త వేరియంట్ ధర రూ.84,128 (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ప్యాషన్+ డ్రమ్ వేరియంట్‌ తో పోలిస్తే, కొత్త డిస్క్ వేరియంట్ ధర రూ.3,800 ఎక్కువగా ఉంది. ప్రస్తుతం హీరో సంస్థ విక్రయిస్తున్న 97.2cc ఇంజిన్ కలిగిన బైక్‌ లలో ఇదే అత్యంత ఖరీదైన మోడల్‌ గా కొనసాగుతోంది.

ఇంజిన్ గురించి..

కొత్త ప్యాషన్+ డిస్క్ వేరియంట్‌ లో 97.2cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ ను అందించారు. ఈ ఇంజిన్ 8,000rpm దగ్గర 8 హెచ్‌పీ శక్తిని, 6,000rpm దగ్గర 8.05Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 4-స్పీడ్ గేర్‌ బాక్స్‌ ను యాడ్ చేశారు.  రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉండేలా ఈ ఇంజిన్‌ ను రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది. మైలేజీ విషయంలో కూడా ఈ బైక్ ఆకట్టుకోనుంది. లీటర్ పెట్రోల్‌ కు 71 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని హీరో కంపెనీ వెల్లడించింది. సాధారణ వేగంతో ప్రయాణిస్తే ఈ మైలేజీని అందుకోవడం సాధ్యమవుతుందని ఆటో నిపుణులు చెబుతున్నారు.

i3S స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ

Advertisement

ఈ బైక్‌లో హీరో సంస్థకు చెందిన i3S స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ కూడా ఉంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కొంతసేపు వాహనం ఆగినప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్‌ గా ఆఫ్ అవుతుంది. క్లచ్ నొక్కగానే మళ్లీ స్టార్ట్ అవుతుంది. దీంతో ఇంధన ఆదా మరింత పెరుగుతుంది.

కొత్త డిస్క్ వేరియంట్‌ లో ముందు భాగంలో 240mm డిస్క్ బ్రేక్‌ ను అందించారు. డ్రమ్ వేరియంట్‌ లో ఉండే 130mm డ్రమ్ బ్రేక్‌ తో పోలిస్తే.. మెరుగైన బ్రేకింగ్ పనితీరును అందిస్తుంది. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో తరచూ బ్రేక్ వేయాల్సిన పరిస్థితుల్లో ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. ప్యాషన్+ డిస్క్ వేరియంట్‌ లో మరో ప్రధాన ఆకర్షణ పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. ఇది బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. స్మార్ట్‌ ఫోన్‌ ను కనెక్ట్ చేస్తే కాల్ అలర్ట్స్, ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు లాంటి ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు.

Advertisement

అటు రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, సర్వీస్ రిమైండర్, లో ఫ్యూయల్ వార్నింగ్ లాంటి సమాచారం కూడా డిస్‌ ప్లేలో కనిపిస్తుంది. భద్రత కోసం సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఫీచర్‌ ను కూడా అందించారు. సైడ్ స్టాండ్ కిందకు ఉండగా గేర్ వేస్తే ఇంజిన్ ఆటోమేటిక్‌ గా ఆగిపోతుంది. ఈ బైక్‌ లో చిన్న స్టోరేజ్ కంపార్ట్‌ మెంట్‌ తో పాటు USB ఛార్జింగ్ పోర్ట్‌ ను కూడా ఇచ్చారు. ప్రయాణ సమయంలో మొబైల్ ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కొత్త ప్యాషన్+ డిస్క్ వేరియంట్ ఎరుపు, నీలం, నలుపు, బూడిద రంగుల్లో అందుబాటులో ఉంటుంది. కొత్త గ్రాఫిక్స్‌ తో ఈ బైక్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

Read Also: ఇక నో పెట్రోల్ బైక్స్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!

Related News

కొత్త అవతార్‌ లో యూత్ ఫేవరెట్ స్కూటర్.. కొత్త కలర్స్ తో TVS Ntorq 125 ఎంట్రీ!

భారత ఈవీ మార్కెట్లో ఏథర్ దూకుడు.. 7 లక్షల సేల్ మార్క్ క్రాస్!

టాటా సియెర్రా EV vs సియెర్రా ICE.. రెండింటి మధ్య తేడాలేంటి? ఏది కొంటే బెస్ట్?

జూలై 2న కొత్త రెనాల్ట్ క్విడ్ గ్రాండ్ ఎంట్రీ.. డిజైన్, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

సియెర్రా ఈవీ బేస్ వేరియంట్ డీటైల్స్ లీక్.. వామ్మో.. సింగిల్ ఛార్జ్ తో అంత రేంజా!?

ఇక నో పెట్రోల్ బైక్స్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!

అల్ట్రావయోలెట్ To రివోల్ట్.. జూలైలో లాంచ్ కానున్న టాప్ ఎలక్ట్రిక్ బైక్‌లు ఇవే!

Big Stories

×