E-Paper
Advertisement

ప్రకాష్ రాజ్ వర్సెస్ బండ్ల గణేష్ సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్!

ప్రకాష్ రాజ్ వర్సెస్ బండ్ల గణేష్ సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్!
Advertisement

Prakash Raj vs Bandla Ganesh:సినిమాల్లో ఏముంది గురూ ..అంతకు మించిన రియల్ డ్రామా ఇక్కడుంది అంటూ ట్వీట్లతో చెడుగుడు ఆడేసుకుంటున్నారు ఈ ఇద్దరు సినీ సెలెబ్రిటీస్.  అవును ….ఎన్నో సినిమాల్లో నటించి 5 నేషనల్ అవార్డ్స్ దక్కించుకున్న ప్రకాష్ రాష్, భారీ సినిమాలు తీసి ప్రస్తుతం రిలాక్స్ అవుతున్న బండ్ల గణేష్ మధ్య ట్వీట్ల యుద్ధం పీక్స్ స్టేజ్ కి చేరింది.

అసలు విషయానికి వస్తే  పవర్ స్టార్ ap డిప్యూటీ సీయం అయిన పవన్ కళ్యాణ్ పై యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’ అలియాస్ జోసెఫ్ బచ్చలకూరి ఓ రేంజ్ లో రెచ్చిపోవడం , దానికి రియాక్ట్ అయిన జనసైనికులు కేసులు పెట్టడం, కోర్టులు బెయిల్ ఇవ్వడం,పోలీసులు మళ్ళీ కేసులు పెట్టడం ,మళ్ళీ కోర్టులు బెయిల్ ఇవ్వడం గత కొన్ని రోజులుగా apలో హాట్ టాపిక్ గా మారింది.ఇక ఇదే విషయం పై అసలు ప్రశ్నించడానికి పుట్టిన పార్టే ఇలా ప్రశ్నిస్తే అరెస్ట్ లు చేయడం ఏంటి అంటూ ప్రకాష్ రాజ్ ట్విట్టర్ లో క్వశ్చన్ చేయడమే ఇపుడు బండ్లన్న  మంటలకి కారణం అయింది.

Advertisement

also read:టాలీవుడ్ వీకెండ్ వార్ .. బాక్సాఫీస్ విన్నర్ ఎవరో ?

కాస్త బయటగా వచ్చి చూస్తె ..ప్రకాష్ రాజ్ వాలకం చూస్తుంటే ఇష్యూ ఏదైనా నా మార్క్ స్టేట్ మెంట్ ఏదైనా ఉంది తీరాల్సిందే అన్నట్టుగా ఉంది.మొన్నటికి మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావ్ – పవన్  వ్యవహారంలో ప్రకాష్ రాజ్ ‘నేనిక్కడ మీకు సపోర్ట్ గా ఉన్నాను’ అంటూ ప్రొఫెసర్ కి సపోర్ట్ గా వీడియో సంగతి తెల్సిందే. ఇక తాజాగా ప్రశ్న రావణ్‌కు గన్నవరం కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంపై నటుడు ప్రకాశ్‌ రాజ్ మండి పడుతూ ‘మీరు ఆట మొదలు పెట్టారు… ప్రజలు దాన్ని ముగింపు చేస్తారు’ అంటూ మరో వీడియోని వదిలాడు.ఇక ఇదే వీడియోలో  “గేమ్ ఆన్” అని అనౌన్స్ చేశాడు కూడా.అంటే సినిమాల్లో వేసే రోల్స్ కన్నా సొసైటీని ప్రశ్నించే రోల్ బాగా వంటబట్టినట్టు ఉంది.

బండ్లన్న కౌంటర్ 

Advertisement

కాని ఎదురుగా ఉంది బండ్ల గణేష్.పవన్ కళ్యాన్ కి అభిమానులు ఉండరు, భక్తులు ఉంటారు, అందులో నేనూ ఒకన్ని అంటూ ఎన్నో సార్లు  ఓపెన్ గానే చెప్పాడు కూడా.అలాంటి బండ్లన్న ప్రకాష్ పెడుతున్న  వరుస ట్వీట్స్ కి రియాక్ట్ కాకుండా ఎలా ఉంటాడు.ఇంతకు ముందే నీ పని నువ్వు చేసుకుంటే మంచిది అంటూ కౌంటర్ ఇచ్చిన బండ్ల ఈ సారి మరింత వైల్డ్ గా రియాక్ట్ అయ్యాడు.రాత్రి తాగుతావు… పొద్దున్నే వాగుతావు… అంతే తప్ప నీ జీవితంలో ఒక్క పని కూడా లేదు. ఒక వ్యాపారం లేదు, ఒక సినిమా లేదు, ఒక షూటింగ్ లేదు. పనికిరాని మాటలు, పనికిరాని పోస్టులు, పనికిరాని గొడవలు… ఇదే నీ దినచర్య. హాయిగా నీ పని నువ్వు చూసుకుని, సంతోషంగా బతుకు. అనవసరంగా ఇతరుల గురించి నోరు పారేసుకుని నీ విలువను నువ్వే తగ్గించుకోకు అంటూ ప్రకాష్ రాజ్ కి ఒక రేంజ్ లో కౌంటర్ ఇచ్చాడు.

ఆగుతుందా లేక సా..గుతుందా !

నిజానికి వీరి మధ్య ఈ మాటల యుద్ధం కొత్తేమీ కాదు.గతంలో  ‘మా’ (MAA) ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు మాటల తూటాలు వదులుకున్న వారే.అది కాస్త ఇపుడు మరింత ముదురుతుందన్న మాట.నిజంగా వీరి మధ్య జరుగుతున్న ఈ డిజిటల్ వార్ చూస్తుంటే ఒకరికికి ఒకరు కౌంటర్ ఇవ్వడానికే ఇద్దరు ఉన్నారా అనిపిస్తుంది.బయటి నుంచి ఆడియన్స్ పాప కార్న్ తింటూ  సినిమా చూస్తున్నట్టు ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది.  ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారం ఎటు వెళ్తుందో తెలీదు కాని ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ “హై వోల్టేజ్ ట్విట్టర్  డ్రామా”మాత్రం సోషల్ మీడియాలో మహా రంజుగా సాగుతుంది.ఇక బండ్లన్న వార్నింగ్ చూస్తుంటే ఇది ఎండ్ కార్డ్ లేని డైలీ సీరియల్ గా సాగిపోతుందా అన్న డౌట్ కూడా వస్తుంది.చూడాలి మరి ప్రకాష్ రాజ్ వర్సెస్ బండ్ల గణేష్ ల ఈ సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్ ఎక్కడి దాకా వెళ్తుందో !

Related News

60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న సల్మాన్ ఖాన్‌..వధువు ఎవరంటే? వీడియో వైరల్

తలైవా మాస్ జాతర మొదలైంది.. ‘జైలర్ 2’ ఫస్ట్ సాంగ్ ‘అల బొలెలో’ కుమ్మిపడేసిందిగా!

బండ్ల గణేష్ ‘మాస్ రాంపేజ్’.. మెగాస్టార్ బర్త్‌డే వేడుకల్లో ట్రోలర్స్‌కు సాలిడ్ కౌంటర్!

తండ్రీ కూతుళ్ల కథతో చిరంజీవి మాస్ మూవీ? ‘Mega 158’ పోస్టర్ వైరల్!

ఇరుముడి కోసం ఒక్కటైన హీరోల ఫ్యాన్స్.. అసలు కారణం ఇదే!

జ్వరం.. భుజంలో వాపు.. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై బిగ్ అప్‌డేట్

టాలీవుడ్‌కు తెలంగాణ సర్కార్ ఫుల్ సపోర్ట్.. గిల్డ్ ప్రొడ్యూసర్స్ ఫుల్ హ్యాపీ

షావుకారు జానకి తొలి సంపాదన ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×