BigTV English

Kota Srinivas Rao: 700 లకు పైగా సినిమాలు.. చివరికి అవకాశాలను అడుక్కున్న కోటా?

Kota Srinivas Rao: 700 లకు పైగా సినిమాలు.. చివరికి అవకాశాలను అడుక్కున్న కోటా?

Kota Srinivas Rao: టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్రవిషాదం చోటుచేసుకుంది. ఇండస్ట్రీలో నటుడిగా కమెడీయన్ గా ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు నటుడు కోటా శ్రీనివాసరావు(Kota Srinivas Rao). ఇలా ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాల పాటు కొనసాగుతూ ఏకంగా 700కు పైగా సినిమాలలో నటించి ఎన్నో పురస్కారాలను అందుకున్న కోటా శ్రీనివాసరావు మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. ఈయన గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే నేడు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు కోటా శ్రీనివాసరావు అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు.


కోటా మరణం తీరని లోటు..

న అభిమానులు సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఆయన చివరి చూపు కోసం తరలివస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా ఈయన మృతి పట్ల నివాళులు అర్పించగా మరి కొంతమంది నటీనటులు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కోటా శ్రీనివాసరావుకి తుది వీడ్కోలు చెబుతున్నారు. ఇక కోట శ్రీనివాసరావు గారి మరణ వార్త తెలియడంతో ఆయన సినీ జీవితం గురించి ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే నటుడిగా ఎప్పటికీ మర్చిపోలేని పాత్రలలో నటించిన కోట శ్రీనివాసరావు చివరి రోజుల్లో సినిమాలను అడుక్కునే స్థితికి వచ్చారని చెప్పాలి.


ఆఖరి శ్వాస..

ఒకప్పుడు ఏదైనా సినిమాలో విలన్ పాత్ర అంటే దర్శక నిర్మాతలకు కోటా శ్రీనివాసరావు గారు గుర్తుకు వచ్చేవారు. ఒకే రోజు రెండు మూడు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీగా ఉన్న ఈయన చివరి రోజుల్లో మాత్రం చిన్న అవకాశం ఇవ్వండి అంటూ ఎంతో మంది దర్శకులను బ్రతిమాలుకున్నట్లు పలు సందర్భాలలో తెలిపారు. సాధారణంగా ప్రతి ఒక్క నటుడు కూడా తమ ఆఖరి శ్వాస వరకు సినిమాలలో నటించాలని కోరుకుంటారు. కోట శ్రీనివాసరావు గారు కూడా అలాగే కోరుకున్నారు కానీ ఈయన వయసు పైబడిన నేపథ్యంలో దర్శకులు ఎవరు కూడా ఆయనకు అనువైన పాత్రలను ఇవ్వలేకపోయారు.

వయో భారంతో అవకాశాలు లేవు..

త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులను అవకాశాలు కల్పించాలని ఈయన వేడుకున్నారట. తనుకు డబ్బులు ఇవ్వద్దని, ఊరికనే సినిమాలలో చేయటానికి కూడా సిద్ధమే అని చెప్పినప్పటికీ దర్శకులు మాత్రం వయోభారంతో బాధపడుతున్న కోట గారిని రెండు రోజుల షూటింగ్ కోసం పిలిచి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తనకు అవకాశాలు కల్పించలేకపోయారని చెప్పాలి.. అవకాశాలు లేకపోవడంతో ఈయన ఇంటికే పరిమితం అయ్యారు. ఇలా ఇంటి దగ్గరే ఉంటూ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతూ సినిమా ఇండస్ట్రీ గురించి అలాగే సెలబ్రిటీల గురించి మాట్లాడారు. అయితే ఒకానొక సమయంలో ఈయన మెగా కుటుంబం గురించి చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్రదుమారం రేపాయి. ఇలా నిత్యం కోటా శ్రీనివాసరావు తన మాటతీరుతో వివాదాలలో కూడా నిలిచారని చెప్పాలి.

Also Read: Kota Srinivas Rao: ఎమ్మెల్యేగా గెలిచిన కోటా… రాజకీయాలకు అందుకే దూరమయ్యారా?

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×