BigTV English

Paruchuri : కోట శ్రీనివాస్ రావు గురించి కన్నీళ్లు తెప్పించే పరుచూరి మాటలు

Paruchuri : కోట శ్రీనివాస్ రావు గురించి కన్నీళ్లు తెప్పించే పరుచూరి మాటలు

Paruchuri : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మాటల రచయితల్లో దిగ్గజాలు పరుచూరి బ్రదర్స్. వాళ్లు సినిమాకి మాటలు రాస్తున్నారు అంటేనే అంచనాలు వేరే రేంజ్ లో ఉంటాయి. రీసెంట్ టైమ్స్ లో పరుచూరి తన అనుభవాలను, సినిమాలను గురించి అనేక విశేషాలను పరుచూరి పలుకులు అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు చెబుతున్న విషయం తెలిసిందే.


కోట శ్రీనివాసరావు మరణించిన సందర్భంగా ఆయనను మరోసారి స్మరించుకుంటూ అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఆయన విశిష్టతను తెలిపారు. మామూలుగా గొప్ప నటుడు అని అందరికీ తెలిసిన విషయమే అలా కాకుండా ఎంత లోతైన మనిషి, ఎంత గొప్ప మనిషి అని పరుచూరి పలుకుల్లో పలికారు.

ఏ రోజు వేషం అడగలేదు


నాకు ఆయనకు మధ్య దూరం సరిగ్గా ఆ ఇల్లులు. ఈ చివరి నేనుంటాను ఆ చివర ఆయన అంటారు. ఏ రోజు కూడా మా దగ్గరికి వచ్చి వేషం అడగలేదు. కనీసం ఫోన్ కూడా చేయరు. రాజనాల, రావు గోపాలరావు, కోట శ్రీనివాసరావు వీళ్లు పేరుకు ప్రతినాయకులు అయినా కూడా, కానీ నిజ జీవితంలో వాళ్ళు హీరోలు. ఒకరిని వేషం అడక్కుండానే కోటా శ్రీనివాసరావు గారు 750 సినిమాలు పూర్తి చేశారు. ఒక మనిషి ఎప్పుడు గొప్పవాడు అవుతాడు అంటే, అతను వెయ్యి చంద్రోదయాలను చూస్తే గొప్పవాడు అవుతాడు. అతనికి స్వర్గం లభిస్తుంది అని మన పెద్దవాళ్ళు చెబుతుంటారు. మొన్న పౌర్ణమితో ఆయన 1000 చంద్రోదయాలను చూశాడు. అది చూసిన తర్వాతే మొన్న సెలవు హితులారా అని ఆయన వెళ్లిపోయారు.

ఆయనను మనం మళ్లీ చూస్తాం 

ఆయన ఆరోగ్యం బాగోకపోయినా కూడా అలానే వెళ్లి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాలో నటించారు. ఆయనను మళ్ళీ మనం ఆ సినిమాలో చూస్తాం. అలానే తొమ్మిది నంది అవార్డులు రావడం అనేది మాటలు కాదు. కేవలం ప్రతినాయకుడుగానే కాకుండా అన్ని రకాల పాత్రలు వేశారు. ముఖ్యంగా ఆయన అహనా పెళ్ళంట సినిమాలో నటించిన తీరు అద్భుతం. ఇప్పటికే తలుచుకున్న నవ్వు తెప్పిస్తుంది. ఆయన ఒకేరోజు ఆరు సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆయన నటనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. అలానే రాజకీయ నాయకుడిగా కూడా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఆయనకు మాత్రమే సాధ్యమైంది. అసెంబ్లీకి వెళ్లాలని మేమందరం ప్రయత్నించాం కానీ ఎవరు వళ్లలేకపోయాం. ఎన్టీఆర్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వెళ్లాలి ఎందుకంటే వాళ్ళు అనేక పాత్రలు వేస్తారు కాబట్టి వాళ్లకు బాగా తెలుసు. అంటూ ఎన్నో ఆసక్తికర విషయాలు తెలియజేశారు.

Also Read : Vettuvam : దర్శకుడు పై కేసు నమోదు, జైలుకు వెళ్ళడం తప్పదా.?

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×