Krithi Shetty: కృతి శెట్టి (Krithi Shetty).. ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) శిష్యుడు బుచ్చిబాబు సన (Bucchibabu Sana) దర్శకుడిగా తొలి ప్రయత్నంలో చేసిన చిత్రం ఉప్పెన(Uppena). ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ బ్యూటీ కృతి శెట్టి. ఈ సినిమాతోనే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) కూడా తన సినీ రంగ ప్రవేశం చేశారు. అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుని.. రూ.100 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది. వరుస అవార్డులతో అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే హ్యాట్రిక్ సక్సెస్..
ఇకపోతే వైష్ణవ్ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది. అలా తన రెండవ సినిమానే నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో నటించి, ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నాగచైతన్య (Naga Chaitanya), నాగార్జున (Nagarjuna) కాంబినేషన్లో వచ్చిన ‘బంగార్రాజు’ సినిమాతో కూడా మరో విజయాన్ని అందుకుంది.
టాలీవుడ్ కి దూరం అయినట్టేనా..
అలా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్న కృతి శెట్టికి తిరుగు లేదని అందరూ అనుకున్నారు. కానీ ఏమైందో తెలియదు కానీ ఆమె కథల ఎంపిక విషయంలో వెనుకబడిపోయింది. ఆ తర్వాత ఈమె నటించిన ప్రతి సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది. దీంతో కృతి శెట్టి పని అయిపోయిందని, ఇక బుట్ట సర్దేయాల్సిందే అని చాలామంది కామెంట్లు చేశారు.
కోలీవుడ్లో రెండు సినిమాలను లైన్లో పెట్టిన కృతి శెట్టి..
కానీ కోలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నం చేసింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే ఈమె ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’, ‘జెనీ’ అనే రెండు సినిమాలను లైన్లో పెట్టింది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు కూడా ఇదే ఏడాది విడుదల కానున్నాయి. వీటిలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథ్ (Pradeep Ranganath) హీరోగా.. విఘ్నేష్ శివన్ (Vighnesh Shivan) దర్శకత్వంలో నయనతార నిర్మించడంతో అంచనాలు పెరిగిపోయాయి.
ముంబైకి మకాం మార్చిన కృతి శెట్టి..
తాజాగా కృతి శెట్టికి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కెరియర్ మొదలైన దగ్గర్నుంచి హైదరాబాదులోనే ఉన్న కృతి శెట్టి కోలీవుడ్లో కెరియర్ మొదలు పెట్టడం కోసం చెన్నైకి మకాం మార్చింది. అక్కడే కొంత కాలం పాటు తండ్రితో కలిసి ఉన్న ఈమె.. ఇప్పుడు చెన్నై నుంచి ముంబైకి షిఫ్ట్ అయినట్లు సమాచారం. ఇక్కడ కూడా పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ముంబైకి మకాం మార్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అక్కడికి షిఫ్ట్ అయిందేమో అని పలువురు కామెంట్ చేస్తున్నారు.
సొంతగూటికి చేరుకున్న బేబమ్మ..
నిజానికి బాలీవుడ్ లో ‘సూపర్ 30’ అనే సినిమాతో ఈమె కెరియర్ మొదలయింది. హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటించిన ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. కానీ ఆ తర్వాత కాలంలో అవకాశాలు మాత్రం పూర్తిగా తగ్గిపోయాయి. దాంతో టాలీవుడ్ లో లాంచ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా అవకాశాలు రాకపోయేసరికి బాలీవుడ్ కే పయనం అయింది ఈ ముద్దుగుమ్మ. మరి ఇక్కడైనా ఈమెకు అవకాశాలు లభిస్తాయేమో చూడాలి.
ALSO READ:Film industry: హీరో ఆర్య మూవీ సెట్ లో విషాదం.. స్టంట్ మ్యాన్ మృతి.. కారణం?