E-Paper
Advertisement

నవరాత్రి స్పెషల్.. అమ్మవారిలా మారిపోయిన కృతి కర్బందా!

నవరాత్రి స్పెషల్.. అమ్మవారిలా మారిపోయిన కృతి కర్బందా!
Advertisement

Kriti Kharbanda:కృతి కర్బందా..నెట్టింట్లో ఎప్పుడూ ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ భామ తాజాగా పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.నవరాత్రుల సందర్భంగా అమ్మవారి గెటప్ లో కృతి కర్బందా షేర్ చేసిన ఫొటో,దానికి పెట్టిన క్యాప్షన్ ఫాలోవర్స్ ని ఫిదా చేస్తుంది ముఖ్యంగా మా చంద్రఘంటా అమ్మవారిని స్మరించుకుంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ చేస్తూ

Advertisement

కృతి కర్బందా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ చేస్తూ.. “ఈ రోజు యోధురాలైన మా చంద్రఘంటా అమ్మవారి ధైర్యాన్ని నాలో నింపుకుంటున్నాను. మీలో ఉన్న వెలుగును ప్రకాశింపజేయండి” అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టడంతో అభిమానులు ఈ గెటప్ సరిగ్గా సరిపోయిందని, అదిరిపోయిందని ,జోదా అక్బర్ లా ఉందని ఇలా ఎవరికి నచ్చినట్టుగా వారు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

సాధారణంగా సెలబ్రిటీలు తమ సినిమా అప్‌డేట్స్, ఫొటో షూట్స్, వెకేషన్స్ అలాగే పర్సనల్ విషయాలని షేర్ చేస్తారన్న సంగతి తెల్సిందే కానీ కృతి మాత్రం వారందరికీ భిన్నంగా ఇలా అమ్మవారి శక్తి, ధైర్యం గురించి పోస్ట్ పెట్టడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Advertisement

మా చంద్రఘంటా అమ్మవారు దుర్గాదేవి తొమ్మిది రూపాల్లో మూడో రూపంగా పూజలందుకుంటారని, ధైర్యానికి, శక్తికి, చెడుపై మంచి సాధించే విజయానికి అమ్మవారి రూపం ప్రతీకగా భావిస్తారన్న సంగతి తెల్సిందే.

సినిమాల విషయానికి వస్తే..

ఇక సినిమాల విషయానికి వస్తే.. కృతి కర్బందా బోణీ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ బోణీ కొట్టలేకపోయిన ఈ భామ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘తీన్ మార్’ సినిమాలో పవన్ కి జోడీగా మంచి చాన్సే కొట్టేసింది.ఆ తర్వాత రామ్ పోతినేని సరసన ‘ఒంగోలు గిత్త’లో నటించిన కృతి రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ: ది ఫైటర్’ సినిమాలోనూ చెల్లిగా నటించి మెప్పించింది.

ఇక ఇటు తెలుగుతో పాటు కన్నడ, హిందీ సినిమాల్లోనూ నటించినకృతి . ‘షాదీ మే జరూర్ ఆనా’ సినిమాతో హిందీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించడం విశేషం అలాగే ‘హౌస్‌ఫుల్ 4’, ‘యమ్లా పగ్లా దీవానా.. ఫిర్ సే’ వంటి సినిమాల్లోనూ నటించి సత్తా చాటింది కూడా.అలా ఒకవైపు గ్లామర్ పాత్రలతో పాటు నటనకి ఇంపార్టెన్స్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించడం విశేషం.

నెట్టింట్లో వైరల్ అవుతుంది ఈ పవన్ భామ !

అలా సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ కృతి తన అభిమానులతో టచ్‌లో ఉంటూ తనకి సంబంధించిన పోస్టులు షేర్ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ.మొత్తంగా
ఇప్పుడు మా చంద్రఘంటా అమ్మవారిని స్మరించుకుంటూ పెట్టిన పోస్ట్ తో మరోసారి నెట్టింట్లో వైరల్ అవుతుంది ఈ పవన్ భామ !

ALSO READ :భార్యతో గొడవలకు కారణం అదేనా? హర్ష చెముడు ఓపెన్ కామెంట్స్!

Tags

Related News

కారు వద్దు బాబోయ్.. ముందు నా చలాన్లు కట్టండి! దర్శకుడు బాబు కామెంట్స్ వైరల్

భార్యతో గొడవలకు కారణం అదేనా? హర్ష చెముడు ఓపెన్ కామెంట్స్!

సుమతిగా సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. కల్కి 2 షూటింగ్ పై బిగ్ అప్డేట్!

నితిన్ రుక్మిణిగా బాలీవుడ్ బ్యూటీ ఆఫియా సయ్యద్… ఆమె పాత్ర ఇదేనా?

రాజాసాబ్ డిజాస్టర్‌పై తొలిసారి నోరు విప్పిన నిర్మాత.. ఏమన్నాడో తెలుసా?

ఆ సైజులు పెంచుతూ ఫోటోలు మార్ఫింగ్…AI ఫోటోల పై శ్రియ ఫైర్

కార్తికేయ ‘పర్ణశాల’ నుంచి జిమ్ జిమ్ తారా.. పాట అదిరిందిగా!

Big Stories

Advertisement
×