Harbhajan Singh On Pakistan Team: పాకిస్తాన్ క్రికెటర్ల రహస్యలను టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ బయట పెట్టారు. డ్రగ్స్ తీసుకోనిదే పాకిస్తాన్ బౌలర్లు రాణించలేరంటూ బాంబ్ పేల్చారు. పాకిస్తాన్ బౌలర్లు దాదాపు 150 కిలో మీటర్ల వేగంతో బంతులు వేయడానికి కారణం డ్రగ్సే అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇలాంటి దరిద్రులు టీమిండియాకు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ తీసుకోనేదే బౌలింగ్ చేయలేని దద్దమ్మలు.. 160 కిలో మీటర్ల స్పీడ్ తో బంతులు వేసి భయపెట్టిస్తామని పోస్టులు పెడుతూంటారని ఆగ్రహించారు. దీంతో టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
2004 సమయంలో పాకిస్తాన్ పర్యటనకు టీమిండియా వెళ్లిన సందర్భంగా చోటు చేసుకున్న అంశాలను హర్భజన్ సింగ్ తాజాగా బయట పెట్టారు. ఆ టూర్ సందర్భంగా పాకిస్తాన్ క్రికెటర్లు కొందరు కొన్ని ప్యాకెట్లు పట్టుకుని డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లడం తాను చూసినట్టు భజ్జీ పేర్కొన్నారు. అది అచ్చం డ్రగ్స్ తరహాలోనే తనకు కనిపించిందని వెల్లడించారు. పెషావర్ వేదికగా జరిగిన 3వ వన్డే సందర్భంగా ఈ విషయాన్ని తాను పసిగట్టినట్టు తెలిపారు. అదే మ్యాచ్ లో ప్రతీ పాకిస్తాన్ క్రికెటర్ దుమ్ములేపాడని గుర్తు చేశారు.
ఈ తరుణంలోనే టీమిండియాపై 4 వికెట్ల తేడాతో పాకిస్తాన్ గెలిచిన విషయాన్ని స్పష్టం చేశారు. దాంతో వాళ్లు డ్రగ్స్ తీసుకున్నట్టు తనకు క్లారిటీ వచ్చిందని వెల్లడించారు. ఇలా ప్రతీ మ్యాచ్ లో పాకిస్తాన్ క్రికెటర్లు చేసినట్టు తనకు అనుమానం ఉందన్నారు. పాకిస్తాన్ వెధవలు డ్రగ్స్ తీసుకోనిది అసలు బౌలింగ్ చేయలేరంటూ బాంబ్ పేల్చారు. అందుకే షోయబ్ అక్తర్, ఆసిఫ్, సోహెల్ తన్వీర్, అబ్దుల్ రజాక్ లాంటి వాళ్లు ఎందరో డ్రగ్స్ తీసుకునే బౌలింగ్ వేస్తారని తనకు అర్థమైందని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. దీంతో పాకిస్తాన్ ప్లేయర్లపై భజ్జీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
2027 వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ను కచ్చితంగా ఓడిస్తామని హర్భజన్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. 2017 నుంచి టీమిండియాలో చేతిలో ఓడిపోతూ వస్తోన్న పాకిస్తాన్, మళ్లీ ఓటమికి సిద్ధం కావాలంటూ తెలిపారు. పాకిస్తాన్ ఏకమై వచ్చినా, టీమిండియాను ఏం పీకలేదంటూ స్పష్టం చేశారు. తమ జట్టులో భయంకరమైన ప్లేయర్లు ఉన్నారని, బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ బలంగా ఉందని పేర్కొన్నారు. ఏ లెక్కన చూసినా, పాకిస్తాన్ కంటే టీమిండియానే పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు. అందుకే పాక్ ను మరోసారి చిత్తు చేయడం గ్యారెంటీ అంటూ వ్యాఖ్యానించారు.