E-Paper
Advertisement

భార్యతో గొడవలకు కారణం అదేనా? హర్ష చెముడు ఓపెన్ కామెంట్స్!

భార్యతో గొడవలకు కారణం అదేనా? హర్ష చెముడు ఓపెన్ కామెంట్స్!
Advertisement

 Viva Harsha :హర్ష చెముడు.. ఈ పేరు చెబితే ఈజీగా గుర్తుపట్టరేమో కాని వైవా హర్ష అనగానే ఈజీగా గుర్తుపట్టేస్తారు,వైవా అనే షార్ట్ ఫిలిమ్ తో ఆయనకొచ్చిన క్రేజ్ అలాంటిది.ఇక అప్పటి నుండి కెరీర్ లో తనదైన పాత్రలతో వరుసగా దూసుకుపోతున్న హర్ష లేటెస్ట్ గా లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనే వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ చేసిన సంగతి తెల్సిందే.

ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా తన భార్యకు తన మీద ఉన్న కంప్లైంట్ గురించి,సినిమాలు, కుటుంబ జీవితం, ఆరోగ్యం, డబ్బు, టైమ్ మేనేజ్‌మెంట్ గురించి మాట్లాడుతూ ఇంటర్వ్యూలో నవ్వులు పూయించాడు.

Advertisement

ఈ సారి కూడా యానివర్సరీ ట్రిప్ లేనట్టే

ముఖ్యంగా తన భార్యకు తాను సరైన సమయం కేటాయించలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు హర్ష. . సినిమాల షూటింగులు, ఇతర పనులతో బిజీగా ఉండటం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నానని తెలిపాడు. ఒకసారి ఏదైనా పని మొదలుపెడితే మధ్యలో ఆపడం కష్టమవుతుందని సరదాగా చెప్పారు. చివరికి పెళ్లిరోజు లాంటి ప్రత్యేక సందర్భాల్లో కూడా షూటింగుల వల్ల ఇబ్బందులు ఎదురవుతుంటాయని,ఇక ఈ సారి కూడా యానివర్సరీ ట్రిప్ లేనట్టే అని కామెడీగా చెప్పుకొచ్చాడు.

Advertisement

మొదటి ఆరు నెలలు అసలు షూటింగ్స్ లేవు

ఇక తన సినిమాలలో అవకాశాల గురించి మాట్లాడుతూ.. ఈ ఏడాది మొదటి ఆరు నెలలు అసలు షూటింగ్స్ లేకుండా ఖాళీగా ఉన్నానని తెలిపాడు. నటుడిగా అవకాశాలు లేని సమయంలో ఎలా ఉంటుందో తన అనుభవాన్ని చెబుతూ ఇండస్ట్రీలో ఎప్పుడు అవకాశాలు వస్తాయో, ఎప్పుడు ఖాళీగా ఉండాల్సి వస్తుందో చెప్పలేమని అందుకే వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలన్న తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు.

ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడుతూ

మరోవైపు, తన ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడుతూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని తెలుసని, అందుకోసం టైం అడ్జెస్ట్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నాని తెలిపాడు.ఇక ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్న తన ఆలోచని పంచుకున్నాడు హర్ష.ఇక డబ్బు గురించి మాట్లాడుతూ ఫ్యూచర్ కోసం ముందే ప్లాన్ చేసుకుకోవాలని,ముఖ్యంగా ఒకటే ఇన్ కమ్ సోర్స్ పై కాకుండా డబ్బు సంపాదించేందుకు మరిన్ని దారులు వెతుక్కోవాలని సలహా ఇచ్చాడు హర్ష.

కెరీర్ విషయానికి వస్తే

ఇక హర్ష కెరీర్ విషయానికి వస్తే .. మొదట్లో వైవా షార్ట్ ఫిలిమ్ తో గుర్తింపు తెచ్చుకున్న హర్ష క్రమంగా తన కామెడీ టైమింగ్‌తో ఆడియన్స్ ని ఆకట్టుకొని తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపే సంపాదించాడు.ముఖ్యంగా పెళ్లి చూపులు, మిడిల్ క్లాస్ మెలోడీస్, కలర్ ఫోటో, గామి, బేబీ వంటి సినిమాలు హర్షకి మంచి పేరు తెచ్చాయి. ఇక కేవలం కామెడీ రోల్స్ మాత్రమే కాకుండా సుందరం మాస్టర్ వంటి సినిమాతో హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు కూడా.

మొత్తానికి ఈ ఇంటర్వ్యూలో పర్సనల్ లైఫ్ గురించి మాత్రమే కాకుండా డబ్బు,హెల్త్ పై హర్ష చేసిన కామెంట్స్ ఇపుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారాయి !

ALSO READ :రాజాసాబ్ డిజాస్టర్‌పై తొలిసారి నోరు విప్పిన నిర్మాత.. ఏమన్నాడో తెలుసా?

Tags

Related News

నవరాత్రి స్పెషల్.. అమ్మవారిలా మారిపోయిన కృతి కర్బందా!

సుమతిగా సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. కల్కి 2 షూటింగ్ పై బిగ్ అప్డేట్!

నితిన్ రుక్మిణిగా బాలీవుడ్ బ్యూటీ ఆఫియా సయ్యద్… ఆమె పాత్ర ఇదేనా?

రాజాసాబ్ డిజాస్టర్‌పై తొలిసారి నోరు విప్పిన నిర్మాత.. ఏమన్నాడో తెలుసా?

ఆ సైజులు పెంచుతూ ఫోటోలు మార్ఫింగ్…AI ఫోటోల పై శ్రియ ఫైర్

కార్తికేయ ‘పర్ణశాల’ నుంచి జిమ్ జిమ్ తారా.. పాట అదిరిందిగా!

తెలుగు సినిమాల్లో దుమ్మురేపిన తెలంగాణ జానపద పాటలు ఇవే!

Big Stories

Advertisement
×