KVN Productions: KVN ప్రొడక్షన్స్..ఈ పేరు ఇపుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్.చిన్న సినిమాలు నాకసలు ఆనవు అంటూ వరుస బడా ప్రాజెక్ట్స్ ని పట్టాలెక్కిస్తున్న KVN ప్రొడక్షన్స్ అధినేత పేరు వెంకట్ కే నారాయణ.
కర్నాటక కి చెందిన ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రొడక్షన్ హౌస్ గా మారి ఇప్పుడంటే బడా సినిమాలని నిర్మిస్తుంది కాని ఇదీ ఒకప్పుడు ఇదీ ‘ సకత్’అనే చిన్న సినిమాతో ప్రొడక్షన్ లోకి ఎంటర్ అయిందే.సింపుల్ సునీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2021నవంబర్ లో రిలీజ్ అయింది.
ఇక దీని తర్వాత 2022లో ‘బైటూ లవ్’అనే సినిమాని నిర్మించిన KVN ప్రొడక్షన్స్ మూడో సినిమాగా ‘కల్ట్’ అనే సినిమాని తెరకెక్కించింది. జనవరి 2026లో రిలీజ్ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది.
ఇక నాలుగో సినిమాగా చేసిన ‘KD: ది డెవిల్’ 30 ఏప్రిల్ 2026న వచ్చిబాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.అయితే అదే ఏడాది మలయాళంలో తొలిసారిగా నిర్మించిన బాలన్:ది బాయ్ అనే సినిమా అటు విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా కమర్షియల్ గానూ మంచి వసూళ్ళనే రాబట్టింది.
ఇక మెల్లిగా ట్రాక్ మార్చిన KVN ప్రొడక్షన్స్ దళపతి విజయ్ చివరి సినిమా జననాయగన్ ని పట్టాలెక్కించింది.ఇక సినిమా దాదపు ఆర్నెల్ల పాటు సెన్సార్ ఆఫీస్ ల చుట్టూ చక్కర్లు కొట్టి ఎట్టకేలకి 3 జూలై 2026న థియేటర్ లలోకి వచ్చింది.కానీ ఈ సినిమా KVN ప్రొడక్షన్స్ కి పెద్ద షాకే ఇచ్చింది.ఊహించని వసూల్లని రాబట్టలేక సగంలోనే చేతులెత్తేశాడు దళపతి.
ఆ సినిమా సంగతి అలా ఉంటె భారీ బడ్జెట్ తో యష్ హీరోగా తెరకెక్కించిన టాక్సిక్ కూడా బాక్సాఫీస్ వద్ద డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో KVN ప్రొడక్షన్స్ పని అయిపోయిందా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.కంటెంట్ కన్నా అడల్ట్ సీన్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని, ఎలివేషన్ లపై పెట్టిన శ్రద్ధ స్క్రీన్ ప్లే పై పెట్టలేదని చెడుగుడు ఆడేస్తున్నారు నెటిజన్లు.
ఇలా వరుసగా రెండు భారీ ప్రాజెక్ట్స్ బోల్తా కొట్టడంతో KVN ప్రొడక్షన్స్ తర్వాత చేసే సినిమాలపై కూడా వీటి ప్రభావం ఏమైనా పడుతుందా అని ఆరాలు తీస్తున్నారు అంతా.
ప్రస్తుతం KVN ప్రొడక్షన్స్ బ్యానర్ పైప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హైవాన్’తో పాటు శివరాజ్‌కుమార్‌తో ‘బెయిల్’, అలాగే తెలుగులో మెగాస్టార్ చిరు,బాబీ కొల్లి కాంబోలో వస్తున్న కాకా సినిమాని కూడా వీళ్ళే నిర్మిస్తున్నారు. మరి టాక్సిక్ దెబ్బకి ఈ సినిమాల షూటింగ్ లలో ఏమైనా అవాంతరాలు ఎదురైతాయా చూడాలి.
ఏది ఏమైనా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ చూడాలంటే కాంబినేషన్లు ఒక్కటే సరిపోవు అని టాక్సిక్ తో అయినా KVN ప్రొడక్షన్స్‌కి అర్థం అయిందో లేదో !