E-Paper
Advertisement

స్టేజ్‌పై ర్యాప్ షో… తెరవెనుక ఊహించని ట్విస్ట్… గెలవడానికి ఏం చేశారో తెలిస్తే షాక్

స్టేజ్‌పై ర్యాప్ షో… తెరవెనుక ఊహించని ట్విస్ట్… గెలవడానికి ఏం చేశారో తెలిస్తే షాక్
Advertisement

Malayalam Reality Show: సింగింగ్ షోలు చాలానే చూశాం… డ్యాన్స్ కాంపిటీషన్స్ కూడా చూశాం. కానీ ర్యాప్‌ను ప్రధానంగా పెట్టుకుని, కేరళలోని కొత్త టాలెంట్‌ను ఒకే వేదికపైకి తీసుకొచ్చి పోటీ పెడితే ఎలా ఉంటుంది? స్టేజ్‌పై కనిపించేది కేవలం మ్యూజిక్ కాంపిటీషన్‌లా అనిపించినా, ప్రతి కంటెస్టెంట్ వెనుక ఒక కథ, ఒక స్టైల్, ఒక కల ఉంటుంది. గెలవాలంటే కేవలం మంచి ర్యాప్ చేస్తే సరిపోదు… తన ప్రత్యేకతను నిరూపించుకోవాలి. అలాంటి కొత్త తరహా హిప్‌హాప్ రియాలిటీ షో ‘Kerala Underground’ ఓటీటీలోకి అడుగు పెట్టింది. మరి ఈ షోలో ఎవరెవరు పోటీ పడుతున్నారు? గెలవడానికి ఎలాంటి టాస్కులు ఉంటాయి? ఈ షో ఎందుకు స్పెషల్? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఇది రెగ్యులర్ సింగింగ్ రియాలిటీ షో కాదు. కేరళలోని అండర్‌గ్రౌండ్ హిప్‌హాప్ సీన్ నుంచి వచ్చిన పది మంది కొత్త ర్యాపర్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చి, వారి టాలెంట్‌ను పరీక్షించే మ్యూజిక్ కాంపిటీషన్. ఒక్కొక్కరి స్టైల్ ఒక్కోలా ఉంటుంది. ఒకరి ర్యాప్‌లో లోకల్ కల్చర్ కనిపిస్తే, మరొకరి మాటల్లో వ్యక్తిగత అనుభవాలు, సామాజిక సమస్యలు కనిపిస్తాయి.

Advertisement

ఇక్కడ కేవలం మైక్ పట్టుకుని ర్యాప్ చేయడం మాత్రమే కాదు. కంటెస్టెంట్లు ర్యాప్ బ్యాటిల్స్, ఛాలెంజెస్, ఎలిమినేషన్ రౌండ్స్‌లో తమ సత్తా చూపించాలి. ఒక్కో రౌండ్‌లో ఒత్తిడి పెరుగుతుంది. స్టేజ్‌పై ఒక్క తప్పు చేసినా పోటీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. అందుకే ప్రతి కంటెస్టెంట్ తన వాయిస్, లిరిక్స్, డెలివరీ, ఒరిజినాలిటీతో జడ్జిలను ఆకట్టుకోవాల్సి ఉంటుంది.

అయితే ఈ షో ప్రత్యేకత కేవలం పోటీలోనే లేదు. కేరళలో పుట్టుకొచ్చిన హిప్‌హాప్ కల్చర్, యువత ఆలోచనలు, వాళ్ల జీవిత అనుభవాలను కూడా ఈ షో తెరపైకి తీసుకొస్తుంది. కంటెస్టెంట్లు తమ కథలను తమ పాటల ద్వారా చెప్పే అవకాశం పొందుతారు. మరి ఈ పది మందిలో ఎవరి ర్యాప్ ప్రేక్షకులను మెప్పిస్తుంది? ఎవరు ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటూ ఫైనల్ వరకు వెళ్తారు? చివరికి కేరళ అండర్‌గ్రౌండ్ ఛాంపియన్‌గా ఎవరు నిలుస్తారు? అనేదే ఈ షోలో చూడాల్సిన అసలు గేమ్.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ?

Advertisement

‘కేరళ అండర్ గ్రౌండ్’ను లెండ్రిక్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆతిరా రాజీవ్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, డబ్జీ, ది ఇంబాచి, MC కూపర్, పరిమళ్ షైస్ మెంటర్లుగా ఉన్నారు. పది మంది ఎమర్జింగ్ ర్యాపర్లు ఈ పోటీలో పాల్గొంటున్నారు. 2026 ఆగస్టు 28 నుంచి ZEE5లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళ హిప్‌హాప్, ర్యాప్ బ్యాటిల్స్, కొత్త టాలెంట్, మ్యూజిక్ కాంపిటీషన్స్ ఇష్టపడేవారికి ఇదొక డిఫరెంట్ రియాలిటీ షో అనుభూతిని ఇస్తుంది.

Read Also: ఓటీటీలోకి షాకింగ్ మర్డర్ మిస్టరీ… భర్తను చంపిందని భార్య అరెస్ట్… క్లైమాక్స్ లో పిచ్చెక్కించే ట్విస్ట్

Tags

Related News

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

లవర్ కి బ్రేకప్… కట్ చేస్తే మాజీ ప్రియుడితో మళ్లీ కనెక్షన్… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ లవ్ ట్రయాంగిల్

రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 2 సినిమాలు, 1 వెబ్‌సిరీస్, మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో… అన్నీ తెలుగులోనే

ప్రెగ్నెన్సీ లోనూ తగ్గేదేలే.. సమంత కొత్త అవతారం అదుర్స్!

కారు వద్దు బాబోయ్.. ముందు నా చలాన్లు కట్టండి! దర్శకుడు బాబు కామెంట్స్ వైరల్

కూరగాయల కోసం కొంటె కుందేలు పోరాటం… పిల్లలతో కలిసి ఎంచక్కా చూడదగ్గ యానిమేషన్ కామెడీ

పెళ్ళైనట్టు నటిస్తూ ఇవేం మెంటల్ మాస్ పనులు భయ్యా… యాక్షన్, రొమాన్స్‌తో అదరగొట్టే కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×