Deepika Rangaraju : దీపికా రంగరాజు అంటే తెలియకపోవచ్చు. కానీ బ్రహ్మముడి సీరియల్ కావ్య అంటే తెలియని వారు ఉండరు. ఆ పాత్రతో చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అయిపోయింది. ఇక రీసెంట్ గా పలు షోస్ లో కూడా కనిపించి విపరీతంగా ఆడియన్స్ ను ఆకట్టుకుంది. దీపికా రంగరాజు విషయానికి వస్తే బిగ్ బాస్ పైన తన అభిప్రాయాన్ని రీసెంట్ గా బిగ్ టీవీ కిసిక్ టాక్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో తెలిపింది. ఫుల్ ఇంటర్వ్యూ వీడియోస్ కి ప్రస్తుతం మంచి రెస్పాన్స్ వస్తుంది.
బిగ్ బాస్ కి వెళ్లట్లేదు
నేను బిగ్ బాస్ కి వెళ్లట్లేదు, ఈ సంవత్సరం అసలు వెళ్లట్లేదు. నాకు చాలామంది మెసేజ్ కూడా చేసి అడుగుతున్నారు. కొంతమంది కాల్ చేసి కూడా బిగ్ బాస్ కి వెళ్తున్నారా అని అడిగారు. నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచి బిగ్ బాస్ కి వెళ్తున్నాను అని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం సీరియల్ జరుగుతుంది కదా, నేను వెళ్తే దానిలో మీనింగ్ ఉండదు. బ్రహ్మముడి సీరియల్ అయిపోయిన తర్వాత వెళ్తే బాగుంటుంది.
నాకు బిగ్ బాస్ నుంచి కాల్ కూడా రాలేదు. నన్ను పిలవలేదు. కానీ నాకు బిగ్ బాస్ కి వెళ్ళాలని చాలా ఇష్టం. నేను బిగ్ బాస్ కి వెళ్తే అన్ని కేవలం నోటితోనే కంట్రోల్ చేస్తాను. నా చిన్నప్పటినుంచి నాతో తిరిగిన ఫ్రెండ్స్ ఎవరు హర్ట్ కాలేదు. అలానే నా వలన ఎవరు హర్ట్ అవ్వరు అని అనుకుంటున్నాను. అలానే నేను కూడా పెద్దగా హర్ట్ అవ్వను. నేను నా ప్రపంచంలో ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది.
ఫేమ్ పాడవుతుందా.?
చాలామంది తెలిసిన నటులు బిగ్ బాస్ కి వెళ్ళారు. అయితే బిగ్ బాస్ కి వెళ్లిన తర్వాత వాళ్ళ రియల్ క్యారెక్టర్స్ బయటపడ్డాయి. దానితో కొంతమందికి వాళ్లకు ఉన్న ఇమేజ్ కూడా డామేజ్ అయింది. అలానే అసలు సెలబ్రిటీ కాని వాళ్లు కూడా బిగ్ బాస్ కి వెళ్లిన తర్వాత సెలబ్రిటీ అయిపోయారు. దీనివలన రెండు రకాలుగా లాభనష్టాలు ఉన్నాయి. ఒక ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ వలన మంచి గుర్తింపు సాధించుకున్న దీపికా రంగరాజు అక్కడికి వెళ్లిన తర్వాత తనకున్న ఫేం డ్యామేజ్ అవుతుందేమో అనేది కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే ఈ సీజన్లో దీపికా రంగరాజు లేదు అనే క్లారిటీ ఇచ్చేసింది.