కవితక్క అప్ డేట్స్ పేరుతో ఓ ట్విట్టర్ పేజ్ ఫుల్ ట్రెండింగ్ లోకి వచ్చింది. హరీష్ రావుని టార్గెట్ చేసినా, గతంలో అలా జరిగింది, ఇలా జరిగిందంటూ కొన్ని విషయాలను ఆ పేజ్ లో పోస్ట్ చేస్తున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ, ఈ పేజ్ మాత్రం సంచలనంగా మారింది. అగ్గిపెట్టె మచ్చ అనే పేరుతో పరోక్షంగా హరీష్ రావుని టార్గెట్ చేస్తూ రాసిన ఓ కథనం ఆసక్తికరంగా సాగింది.
హంపిలో విందు పార్టీ..
తెలంగాణలో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ ఆసక్తికర సంఘటన జరిగిందని కవితక్క అప్ డేట్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. అప్పట్లో నల్గొండకు చెందిన ఒక ముఖ్య నాయకుడు హంపీలో పార్టీ ఇచ్చారట. ఆ పార్టీకి చాలామంది వెళ్లారని, అక్కడ కేసీఆర్ తర్వాత సీఎం ఎవరు అనే చర్చ మొదలైందని చెప్పుకొచ్చారు. కొందరు కేటీఆర్ పేరు ప్రస్తావించగా, చాలామంది కుదరదని తేల్చి చెప్పారట. కేటీఆర్ కొడుకు కాబట్టి అతడిని సీఎం చేయాలా? అని లాజిక్ తీశారట. అంతే కాదు బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కి కూడా వ్యతిరేకంగా పాటలు పాడారని అంటున్నారు. ఇక హరీష్ రావు, సదరు విందు పార్టీ ఇచ్చిన నాయకుడు కలసి కొత్త పార్టీ పెట్టాలనుకున్నారట. అది కుదరకపోతే బీజేపీలోకి వెళ్లాలని కూడా ప్రత్యామ్నాయం ప్లాన్ చేశారట. అయితే ఈ విషయం సీఎం కేసీఆర్ కి తెలియడంతో, కేటీఆర్ స్థాయిలో హరీష్ రావు ఏవో మంతనాలు నడిపి అడ్జస్ట్ మెంట్లు చేసుకున్నారని ఆ కథనం సారాంశం. చివరిగా హంపిలో పార్టీ ఇచ్చిన నాయకుడిని బలిచేశారట.
కేసీఆర్ కి వెన్నుపోటు పొడవాలి అని, కార్ ఓనర్‌ను బలిచ్చిన మచ్చ.
రెండోసారి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో, నల్గొండకు చెందిన ఒక ముఖ్య కారు నాయకుడి పార్టీ అని చెప్పి, కొంతమంది గులాబీ నాయకులు హంపీకి వెళ్లారు. అక్కడికి వెళ్లిన సందర్భం వేరే అయినా,
కేసీఆర్ తరువాత కేటీఆర్‌ను సీఎం… pic.twitter.com/YLIov2WaOG
— 𝐊𝐚𝐯𝐢𝐭𝐡𝐚𝐤𝐤𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 (@KavithakkaUpdts) September 5, 2025
హరీష్ ని సీఎం చేస్తారా?
ఇక హరీష్ రావుని ఆకాశానికెత్తేస్తూ ఓ యువతి సోషల్ మీడియాలో పెట్టిన వీడియోని కవితక్క అప్ డేట్స్ పేజీ బాగా హైలైట్ చేస్తోంది. పనిలో పనిగా ఆమె హరీష్ రావుని సీఎం చేయాలని కూడా కోరుతుంది. అంటే ఉద్దేశపూర్వకంగానే హరీష్ రావు ఇలాంటి వీడియోలు బయటకు వదులుతున్నారని, కేటీఆర్, కేసీఆర్ ని టార్గెట్ చేయడమే ఆయన వ్యూహం అని అంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కవితను టార్గెట్ చేసింది హరీష్ రావు టీమ్ అనేది వారి అభిప్రాయం.
హరీష్ రావు తన ప్రణాలికను అమలు చేస్తున్నాడా?
మొన్న ఒక మేధావి హరీష్ లేకుంటే కెసిఆర్ లేడు అన్నాడు, కార్యకర్తలతోని కెసిఆర్ కంటే ఎక్కువ పని చేస్తాడు అని చెప్పించుకున్నాడు ఇప్పుడు ఇలా దూరపు బంధువు అయిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుఎంసెర్ తో తాను సీఎం అవుతే చూడాలి, ఒక్కడే పార్టీ మొత్తం… pic.twitter.com/I9SGKptv90
— 𝐊𝐚𝐯𝐢𝐭𝐡𝐚𝐤𝐤𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 (@KavithakkaUpdts) September 6, 2025
సోషల్ మీడియా వార్..
కవిత కూడా పలుమార్లు తనపై సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం జరిగిందని అన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారానే ఆమె టీమ్ బదులు తీర్చుకోవాలని చూస్తోంది. అటు హరీష్ రావు కూడా మీడియా ముందు సైలెంట్ గా ఉన్నా.. తెర వెనక తాను చేయాల్సింది తాను చేస్తున్నారని అనిపిస్తోంది. తనపై కవిత చేసిన కామెంట్స్ ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు హరీష్ రావు. ఆ మాటతో ఆయన బీఆర్ఎస్ శ్రేణుల్ని మరింతగా మెప్పించాలని చూశారు. అదే సమయంలో తన బాస్ కేసీఆర్ దగ్గర కూడా మంచి మార్కులు కొట్టేశారని అంటున్నారు. కవిత మాత్రం నేరుగా హరీష్ రావు పేరు ప్రస్తావించి టార్గెట్ చేయడం విశేషం. తాజాగా వీరిద్దరి అనుచరులు సోషల్ మీడియా యుద్ధానికి దిగారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. పాత విషయాలన్నీ తవ్వి బయటకు తీస్తున్నారు.