Lokesh Kanagaraj: మానగరం సినిమాతో ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు లోకేష్ కనగరాజ్. సందీప్ కిషన్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్ సాధించింది. మొదటి సినిమాతోనే అందరిని విపరీతంగా ఆశ్చర్యపరిచాడు దర్శకుడు లోకేష్. నగరం సినిమా ఎంత అద్భుతంగా ఉంటుంది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
సందీప్ కిషన్ తో పాటు నటుడు శ్రీ నగరం సినిమాలో నటించాడు. ఆ తర్వాత తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసి మంచి సక్సెస్ కూడా అందుకున్నాడు. కొన్ని రోజుల క్రితం శ్రీ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. తనను చూస్తుంటే తనకేదో వ్యాధి ఉంది అని చాలామంది పోస్టులు కూడా పెట్టారు. ఆ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో శ్రీ ప్రవర్తించే తీరు చాలామందికి ఆశ్చర్యం కలిగించింది.
డిప్రెషన్ లో నటుడు కోలుకుంటున్నాడు
శ్రీ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఒక ప్రొడక్షన్ హౌస్ తను నటించిన తర్వాత తనకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి తన ఆర్థిక పరిస్థితి అలా తయారైంది అంటూ అప్పట్లో తమిళ్ మీడియాలో కథనాలు కూడా వినిపించాయి. అయితే శ్రీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో పాల్గొన్నారు. నగరం సినిమాతో శ్రీ మంచి గుర్తింపు సాధించుకున్నాడు కాబట్టి, ఆ రోజుల్లో లోకేష్ ను ట్యాగ్ చేసి చాలామంది తనకు హెల్ప్ చేయమని కోరారు. అప్పట్లో లోకేష్ దానికి రెస్పాండ్ కూడా అయ్యారు. ఇప్పుడు శ్రీ డిప్రెషన్ నుంచి కోరుకుంటున్నట్లు లోకేష్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
నేనే అవకాశం ఇస్తాను
శ్రీ ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నాడు. ఒకవేళ ఆయనకు నటించే ఉద్దేశం ఉంటే మళ్ళీ నేనే మంచి అవకాశం ఇస్తాను. లేదంటే నేను నిర్మించే సినిమాల్లో ఆయన తనకి మంచి కం బ్యాక్ వచ్చేలా చూస్తాను అంటూ శ్రీ గురించి క్లారిటీ ఇచ్చాడు లోకేష్ కనగరాజ్. ఒక టాలెంటెడ్ యంగ్ నటుడు అలా అయిపోవడం చాలా మందిని అప్పట్లో కలిసి వేసింది. మొత్తానికి ఏదైనా కొన్ని రోజులు మాత్రమే పట్టించుకుంటారు అని చెప్పినట్లు, ఆ తర్వాత కాలంలో అతని గురించి పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఇక కూలి సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఒక ఇంటర్వ్యూలో లోకేష్ శ్రీ గురించి ఈ మాటలను చెప్పాడు.
Also Read: Lokesh Kanagaraj: నేను కూలీ సినిమా కథను మొదట ఆ దర్శకుడు కి చెప్పాను