BigTV English

Lokesh Kanagaraj: నేను కూలీ సినిమా కథను మొదట ఆ దర్శకుడు కి చెప్పాను

Lokesh Kanagaraj: నేను కూలీ సినిమా కథను మొదట ఆ దర్శకుడు కి చెప్పాను

Lokesh Kanagaraj: ప్రతి ఇండస్ట్రీలోనూ కొంతమంది వ్యక్తులు మధ్య ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది. అలానే ఫిలిం ఇండస్ట్రీలో కూడా చాలామంది స్నేహితులు ఉన్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక దర్శకుడు సినిమా చేస్తే మిగతా దర్శకులు ఆ సినిమా ఫంక్షన్ కు హాజరై, ఆయా దర్శకుడు ప్రతిభను మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి.


పూరి జగన్నాథ్ బిజినెస్ మెన్ సినిమా ఆడియో లాంచ్ కు రాజమౌళి హాజరయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ జులాయి ఆడియో లంచ్ కూడా రాజమౌళి హాజరయ్యారు. అలానే లైగర్ సినిమా విడుదల అవ్వడానికంటే ముందు దర్శకుడు పూరి జగన్నాథ్ ను సుకుమార్ ఇంటర్వ్యూ చేశారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. యంగ్ డైరెక్టర్స్ అంతా కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కలిసిమెలిసి ఉంటారు. ఇదే మాదిరిగా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో కూడా మంచి ఫ్రెండ్షిప్ కొంతమంది దర్శకుల మధ్య ఉంది.

నేను కథ నెల్సన్ కి చెప్తాను 


సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే మంచి దర్శకుడుగా పేరు సాధించుకున్నాడు లోకేష్ కనగరాజ్. లోకేష్ ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా కూలీ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అయితే ఈ కథను తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కు చెప్పాడట లోకేష్ కనగరాజ్. అలానే లోకేష్ కనకరాజ్ కు ప్రస్తుతం రజనీకాంత్ తో చేస్తున్న జైలర్ కథను కూడా చెప్పాడు నెల్సన్. వీళ్ళిద్దరి మధ్య ఎప్పటినుంచో మంచి ఫ్రెండ్షిప్ ఉంది అని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. గతంలో లోకేష్ కనకరాజ్ ఒకసారి మాట్లాడుతూ… తను ఎప్పుడైనా డిప్రెషన్ లో ఉంటే నెల్సన్ దిలీప్ కుమార్ ని కలిస్తే హ్యాపీగా నవ్వుకోవచ్చు అంటూ చెప్పాడు.

మల్టీ టాలెంటెడ్ నెల్సన్ 

కొలమావు కోకిల సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు నెల్సన్. నెల్సన్ కు ఈ సినిమా కంటే ముందు శింబు హీరోగా ఒక సినిమా మొదలై అదే ఆగిపోయింది. ఆ తర్వాత దాదాపు ఆరు సంవత్సరాల వరకు సినిమా పట్టాలెక్కలేదు. మొత్తానికి నయనతార లీడ్ లో చేసిన ఈ సినిమాతో దర్శకుడుగా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత శివ కార్తికేయన్ హీరోగా చేసిన వరుణ్ డాక్టర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. సినిమా దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన బీస్ట్ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు. బీస్ట్ సినిమా ఫెయిల్యూర్ ని జైలర్ సినిమా సక్సెస్ తో అధిగమించాడు నెల్సన్ దిలీప్ కుమార్.

Also Read: Actor Prithivi : సినిమాలు వదిలేద్దాం అనుకునే టైంలో సందీప్ రెడ్డి నిలబెట్టాడు

Related News

Lokesh Kanagaraj: డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన నటుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు

Kapil Sharma -Kap’s Cafe: కపిల్ శర్మ కేఫ్ పై మరోసారి ఉగ్రదాడి… ఈసారి ముంబైలో అంటూ హెచ్చరిక!

Paradise: నాని ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా, శ్రీకాంత్ అదిరిపోయే ప్లానింగ్

Actor Prithivi : సినిమాలు వదిలేద్దాం అనుకునే టైంలో సందీప్ రెడ్డి నిలబెట్టాడు

Rajinikanth: రజినీ కాంత్ 50 ఏళ్ల సినీ కెరియర్ పూర్తి.. 5,500 ఫోటోలతో అభిమాని వింత పని!

Big Stories

×