Lokesh kanagaraj : సంగీతానికి భాషతో సంబంధం ఉండదు. ఈ విషయం చాలా సార్లు ప్రూవ్ అవుతూ వచ్చింది. తెలుగు ప్రేక్షకులు కేవలం తెలుగు పాటలు మాత్రమే వింటారు అనుకుంటే పొరపాటు. అన్ని రకాల పాటలను, అన్ని భాషల్లో పాటలను వినే ఆడియన్స్ ఈ మధ్యకాలంలో ఉన్నారు. త్రీ సినిమాతో సంగీత దర్శకుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అనిరుద్ రవిచంద్రన్.
త్రీ సినిమాలోని “కొలవరి డి” అనే పాట ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రజనీకాంత్ అల్లుడు ఈ పాటను పాడాడు అని అప్పట్లో చాలామంది విపరీతంగా వినేవాళ్లు. వాస్తవానికి ఈ పాట కోసమే సినిమాకు వెళ్ళిన ఆడియన్స్ కూడా ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. సినిమా నిరుత్సాహపరిచినా కూడా సినిమాలోని పాటలు అద్భుతంగా కంపోజ్ చేశాడు అనిరుధ్.
అనిరుధ్ లేకుండా సినిమా చేయను
కేవలం తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా అనిరుద్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని twitter లో షేర్ చేసి బక్కోడా ఏం తాగి కొట్టావు అంటూ కామెంట్స్ చేస్తుంటారు కొంతమంది. బహుశా ఇది అనిరుద్ దృష్టికి కూడా చేరింది కాబట్టే మీ బక్కోడు అంటూ కింగ్డమ్ ఈవెంట్ లో మాట్లాడాడు.
ఇక రీసెంట్ గా అనిరుద్ సంగీతం వహించిన సినిమా కూలీ. రజినీకాంత్ సినిమా అంటే అనిరుద్ ఏ రేంజ్ లో డ్యూటీ చేస్తాడు ఇప్పటికే పలు సందర్భాలలో ప్రూవ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు కూడా అదే రిపీట్ చేశాడు. కూలి సినిమా మ్యూజిక్ వైస్ మాత్రం ఎటువంటి కంప్లైంట్స్ లేవు.
అనిరుద్ గురించి లోకేష్ కనగరాజ్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అనిరుద్ లేకపోతే ఫ్యూచర్ లో నేను సినిమా చేయను అంటూ చెప్పారు. అనిరుద్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయినప్పుడు నేను ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఆలోచిస్తాను అంటూ చెప్పాడు లోకేష్.
ఖైదీ 2 కు కన్ఫామ్ అయిపోయినట్లే
ఇక లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం ఖైదీ 2 సినిమా చేయాల్సి ఉంది. ఇక లోకేష్ ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి చూస్తుంటే ఖైదీ 2 సినిమాకి కూడా అనిరుద్ సంగీతం అందిస్తాడు. ఏదేమైనా ఖైదీ 2 సినిమా మీద మాత్రం అందరికీ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. పర్ఫామెన్స్ కార్తీ ఏ రేంజ్ లో చేస్తాడు మనం ఆల్రెడీ ఖైదీ సినిమాలో చూసాం. ఇప్పుడు అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి అదే స్థాయిలో ఖైదీ 2 సినిమా కూడా ప్లాన్ చేస్తాడు లోకేష్.
Also Read: OG Movie: అసలు పండుగ రేపు మొదలుకానుంది, పవన్ ఫ్యాన్స్ కు పూనకాలే