OTT Movie : ఓటీటీలో ఒక సరికొత్త థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ అమెరికన్ సినిమా మతిపోయే ట్విస్టులు, ఊహకందని క్లైమాక్స్ తో చూపు తిప్పుకోకుండా చేస్తోంది. ఈ సినిమా స్టోరీ ఒక దొంగ చుట్టూ తిరుగుతుంది. ఈ దొంగ ఒక కారులో ఇరుక్కుపోవడంతో అసలు స్టోరీ మొదలవుతుంది. థ్రిల్లర్ అభిమానులకు ఇదొక బెస్ట్ సజెషన్ మూవీగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
కథలోకి వెళ్తే
ఎడ్డీ బారిష్ అనే ఒక చిన్న దొంగ, తన కూతురు సారా జీవితాన్ని సరిచేయాలనుకుంటాడు. కానీ ఆర్థిక ఇబ్బందులతో, తన వ్యాన్ రిపేర్ చేయడానికి 500 కూడా సమకూర్చలేకపోతాడు. ఒక రోజు అన్‌లాక్ చేయబడిన డోలస్ లగ్జరీ SUVని చూసి, అందులో ఉన్న విలువైన వస్తువుల కోసం దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తాడు. అతను లోపలికి వెళ్ళగానే, కారు ఆటోమేటిక్‌గా లాక్ అవుతుంది. బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్, సౌండ్‌ప్రూఫింగ్‌తో అందులో చిక్కుకుపోతాడు. ఎడ్డీ ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోతాడు. ఇదంతా గమనిస్తున్న కారు ఓనర్ విలియం స్క్రీన్‌పై కాల్‌లో మాట్లాడతాడు. తన కూతురిని గతంలో దొంగలు చంపారని, అందుకు నీలాంటి వాళ్ళకు శిక్ష పడాలని చెప్తాడు. విలియం ఎడ్డీని టేజర్‌తో షాక్ చేస్తూ, కారు ఉష్ణోగ్రతను ఫ్రీజింగ్ నుండి హీటింగ్‌కు మారుస్తూ టార్చర్ చేస్తాడు. ఇక ఎడ్డీ తన కూతురి గురించి ఆలోచిస్తూ విలియంతో పోరాడుతాడు.
కారు ఒక పార్కింగ్ గ్యారేజ్ రూఫ్‌పైకి రిమోట్ తో నడపబడుతుంది. ఇప్పుడు ఎడ్డీ జీవితం ప్రమాదంలో పడుతుంది. అతను తన మనస్సాక్షిని ప్రశ్నిస్తూ విలియంని ఎదుర్కొంటాడు. క్లైమాక్స్‌లో ఎడ్డీ తన తెలివిని ఉపయోగించి కారు నుండి తప్పించుకోవడానికి, తన ప్రాణాలను రిస్క్ చేస్తాడు. అయితే క్లైమాక్స్ ఒక షాకింగ్ ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. ఎడ్డీ కారులో నుంచి తప్పించుకుంటాడా ? విలియం చేతిలో బలవుతాడా ? అనే విషయాలను, ఈ అమెరికన్ హారర్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే
‘లాక్డ్’ (Locked) 2025లో విడుదలైన అమెరికన్ హారర్ థ్రిల్లర్ చిత్రం. డేవిడ్ యారోవెస్కీ దర్శకత్వంలో 2019 ఆర్జెంటీనా చిత్రం 4×4 రీమేక్‌గా రూపొందింది. ఇందులో బిల్ స్కార్స్‌గార్డ్ (ఎడ్డీ బారిష్), ఆంథోనీ హాప్కిన్స్ (విలియం) ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2025 మార్చి 21 థియేట్రికల్ రిలీజ్ అయింది. 95 నిమిషాల రన్‌టైమ్‌తో ఆగస్టు 26 నుంచి హులు, అమెజాన్ వీడియో, ఆపిల్ టీవీ, గూగుల్ ప్లే లో అందుబాటులో ఉంది.
Read Also : భర్త పట్టించుకోవట్లేదని మరొకడితో… డైరెక్ట్ గా మొగుడికే చెప్పే ఇల్లాలు… అతనిచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్