BigTV English

OG – Pawankalyan: అసలు పండుగ రేపు మొదలుకానుంది, పవన్ ఫ్యాన్స్ కు పూనకాలే

OG – Pawankalyan: అసలు పండుగ రేపు మొదలుకానుంది, పవన్ ఫ్యాన్స్ కు పూనకాలే

OG – Pawankalyan: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఓ జి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీని కారణం పవన్ కళ్యాణ్ చేస్తున్న స్ట్రైట్ ఫిలిం. అంతేకాకుండా ఈ సినిమా దర్శకుడు స్వతహాగా పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తీసి రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సుజిత్. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది.


రన్ రాజా రన్ సినిమా తర్వాత సుజిత్ చేసిన సినిమా సాహో. ప్రభాస్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన రేంజ్ లో కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. కానీ సుజిత్ మాత్రం ఈ సినిమాను చాలా బ్రిలియంట్ గా తెరకెక్కించాడు. బాహుబలి లాంటి సినిమా తర్వాత ప్రభాస్ ను డీల్ చేయడమంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా తెలుగులో సక్సెస్ కాకపోయినా కూడా నార్త్ లో విపరీతంగా ఆడింది. ఆ సినిమా తర్వాత సుజిత్ చేస్తున్న సినిమా ఓ జి.

అసలు పండగ రేపు 


సెప్టెంబర్ 2 కి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు విపరీతంగా ఆరోజు ఎంజాయ్ చేస్తారు. అయితే పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటారు. అలానే ఓ జి సినిమా నుంచి కూడా బిగ్గెస్ట్ ట్రీట్ రేపు నాలుగు గంటల ఐదు నిమిషాలకు రానుంది. ఒకరకంగా ఇది ఫాన్స్ కు మంచి ట్రీట్ అని చెప్పాలి. దీనిని అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆ పోస్టర్లో ఒక హ్యాండ్ కనిపిస్తుంది, లోడింగ్ అవుతున్నట్టు సింబాలిక్ గా ఒక థింగ్ అక్కడ పెట్టారు. అలానే స్మోక్ తో బ్యాక్ గ్రౌండ్ లో ఓ జి అనే వచ్చినట్లు డిజైన్ చేశారు. మొత్తానికి పోస్టర్ చూస్తుంటే సుజిత్ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు అని అర్థమవుతుంది.

ఫ్యాన్స్ ఎలివేషన్స్ 

మరోవైపు ఫ్యాన్స్ ఈ పోస్టర్ చూసే బీభత్సమైన ఎలివేషన్లు ఇస్తున్నారు. OG సీన్స్ లో ప్రతి ఫ్రేమ్‌కి గూస్‌బంప్స్, పవర్ స్టార్ స్వాగ్ అదిరిపోయింది. OG మూవీలో ప్రతి సీన్ మాస్ ఫీస్ట్. ఫ్యాన్స్‌కి సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యింది. ఓజి మ్యానియా (OGMania) సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అంటే ఇదే, OG సీన్స్ = గూస్‌బంప్స్ అన్‌లిమిటెడ్. OG స్వాగ్ – అన్నిటికీ డెఫినిషన్. పవర్ స్టార్ పవర్ ఫుల్ ప్రెజెన్స్. OG సీన్స్ = ఫ్యాన్స్ హార్ట్‌బీట్,ప్రతి ఫ్రేమ్ పవర్ ప్యాక్డ్. అంటూ కామెంట్స్ తో సినిమా రిలీజ్ కాకముందే బీభత్సమైన ఎలివేషన్లు ఇస్తున్నారు.

Also Read: Peddi: పెద్ది ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్

Related News

Bollywood: సినీ నటి కారు ధ్వంసం.. పోలీసులు పట్టించుకోలేదంటూ నటి ఆవేదన!

Allu Arjun: పవన్ కి బర్త్ డే విషెస్ చెప్పిన బన్నీ.. చాలా మార్పు వచ్చినట్టుందే

Pawan Kalyan : రెమ్యూనరేషన్ లో పవన్ కళ్యాణ్ నయా రికార్డ్.. ఏ మూవీకి ఎంతంటే..?

HBD Pawan Kalyan: అయిష్టంతో ఇండస్ట్రీలోకి.. ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్!

Megastar Chiranjeevi : ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలి..తమ్ముడికి చిరు ఎమోషనల్ విషెస్..

Tollywood Heros: స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ చిత్రాలు.. ఏ హీరో ఏ సినిమా అంటే..?

Big Stories

×