Illu Illalu Pillalu Today Episode july 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. రామరాజు కుటుంబం పై సేనాపతి, భద్రావతి గొడవకు దిగుతారు. మాటలతో సేనా రెచ్చగొడతాడు. ఏంట్రా నోటికొచ్చినట్టు వాగుతున్నావ్ అని రామరాజు అంటే.. వాగడం కాదురా.. ముక్కలుగా నరికేయాలన్నంత కోపం వస్తుంది అని అంటాడు సేనాపతి. ‘ఏంట్రా నరుకుతావా? నరుకూ అని ముందుకు వెళ్తాడు రామరాజు. ఒరేయ్ సేనా.. ఎన్నాళ్లురా ఇలా? ఎప్పుడూ ఈ గొడవలేంట్రా.. ఇంత చిన్న విషయానికి అని అంటుంది శారదాంబ. ఏంటీ చిన్న విషయమా? వీళ్లు నా మేనకోడల్ని హింస పెట్టడం చిన్న విషయమా? అని అంటుంది భద్రావతి. ఆ మాటతో వేదవతి కల్పించుకుని.. నీకే కాదు.. నాకూ మేనకోడలే ముందు అది గుర్తుపెట్టుకో.. నీ కన్నా ఎక్కువగా నేనే దాన్ని బాగా చూసుకుంటున్నాను అని వేదవతి అంటుంది. కాలేజ్‌కి వెళ్లి చదువుకుంటున్న పిల్లని పట్టుకుని పని చేస్తుందని అంటావ్ ఏంటీ? అని అంటాడు. ఎహే ఆపరా నీ డ్రామాలు.. నా కూతురు బయటకు వెళ్లి డాన్స్ క్లాస్‌లు చెప్తుంది ఆ విషయం మాకు తెలియదని అనుకుంటున్నావా? కోడలితో పని చేయించుని.. దాని సంపాదనపై బతకడానికి సిగ్గుగా అనిపించడం లేదా? అని అంటాడు సేన… మొత్తానికి ఇంటి దగ్గర ప్రేమ వల్ల మరోసారి గొడవ పెద్దది అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంట్లోకి వెళ్ళగానే రామరాజు ఇలాంటి మాటలు పడాలని రా మీరు దారిలో ఉండాలి మంచిగా బతకాలని నేను కోరుకుంటున్నాను.. కోడలి నగలతో నేను ఇంటిని గడుపుతున్నానా..? అందరి చేత నన్ను ఇన్ని మాటలు అనిపిస్తున్నారే మీకు నేను ఏం ద్రోహం చేశాను అని రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటాడు. బాధపడకండి అని వేదవతి దగ్గరకు వచ్చి అడగ్గానే నన్ను ముట్టుకోవద్దు అని రామారాజు సీరియస్ అవుతాడు. ఈ లోకంలో నా నిన్ను తప్ప నేను ఎవరిని నమ్మలేదు. నాకోసం మీ వాళ్ళందరినీ వదిలేసుకుని వచ్చావని నిన్ను ఎంతో గొప్పగా చూసుకున్నాను. ఇంత మోసం చేస్తావని నేను అస్సలు ఊరు అనుకోలేదు అని రామరాజు వేదవతి తో అంటాడు. నగల విషయం నా దగ్గర ఎందుకు దాచావు అని వేదవతిని అడుగుతాడు. పెద్దోడివి పెళ్లి హడావిడిలో మర్చిపోయాను అండి చెప్పడం అని అంటుంది వేదవతి..
వేదవతిని ఇంకా జన్మలో నువ్వు నాతో మాట్లాడొద్దు అని రామరాజు అరుస్తాడు. ప్రేమ వేదవతి దగ్గరికి వచ్చి నన్ను క్షమించత్తా అని అంటుంది. ఏం ద్రోహం చేశానే నిన్నే నీకేం పాపం చేశాను నేను.. నా మీద ఒట్టేసావు కదా మరి నేనంటే నీకు అంత లెక్క లేకుండా పోయిందా? మీ మావయ్య నన్ను ఎన్ని మాటలు అంటున్నాడు చూసావా అని అడుగుతుంది. ఇదంతా ఎందుకు చేసావ్ చెప్పు అంటే ధీరజ్ కోసం చేశానని ప్రేమ అంటుంది.
మీరు మీ అందరి కోసం ఎలాగైతే ఆలోచిస్తున్నారో నేను నా భర్త కోసం అలా ఆలోచించాను అని ప్రేమ అరుస్తుంది. నన్ను ఎంత వద్దంటున్నా కూడా నేను డబ్బులు సంపాదించాలని అనుకున్నది కేవలం ధీరజ్ కోసమే. నాకోసం సైకిల్ మీద ఫుడ్ డెలివరీ చేస్తూ ఎంత బాధ పడుతున్నాడో ఏ అర్ధరాత్రి ఇంటికి వచ్చి, మళ్లీ తెల్లవారుజామున 5 గంటలకు అలా బయటకు వెళ్ళిపోతున్నాడు. వాడు అంత కష్టపడి పోతుంటే నేను వాడికి సాయంగా ఉండాలని ఈ జాబ్ చేస్తున్నాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు అని ప్రేమ అంటుంది.
వాడి కోసం ఇదంతా చేసావా ఇప్పుడు ఇన్ని మాటలు పడాల్సిన అవసరం నీకేంటి అని వేదవతి అంటుంది. దానికి నర్మదా తప్పేంటి అత్తయ్య.. తన భర్త కష్టపడి పోతున్నాడని సాయంగా ఉండాలని జాబ్ చేయాలని అనుకుంది ప్రేమ అందులో తప్పేముంది. మీరు ప్రతిసారి ప్రేమను అంటున్నారే ధీరజ్ డబ్బులు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నాడో ఆ కష్టాన్ని చూడలకే ప్రేమ ఆ నిర్ణయం తీసుకుని ఉంటుంది. భర్త కష్టాన్ని అర్థం చేసుకునే భార్య దొరికిందని సంతోషించాలి కానీ మీరు ఇలా అంటారేంటి అని నర్మదా అంటుంది.
అయితే ఆ మాటలు విన్న రామరాజు నర్మద పై సీరియస్ అవుతాడు. చాలిక ఆపండి అని గట్టిగా అరుస్తాడు. అందరూ మంచోళ్లే నేనొక్కదాన్నే చెడ్డోడ్ని. నా కుటుంబం బాగుండాలి అని నేను అంత ఆలోచించాను అది ఎవరికి అర్థం కావట్లేదు. చేయొద్దు అని చెప్పినందుకు మావయ్య చెడ్డోడు మొండోడు. అటు నా కొడుకులు కూడా నా మాట వినట్లేదు నేను ఎవరికీ అవసరం లేదు ఈరోజు నుంచి నా దగ్గరికి ఎవరు రావద్దు అని రామరాజు వెళ్లిపోతాడు.
శ్రీవల్లి ఇంట్లో ఇంత పెద్ద మేటర్ జరగడంతో చాలా సంతోషంగా ఎగిరి గంతేస్తుంది. ఇంట్లో ఇద్దరి కోడళ్ల పై అత్తయ్య సీరియస్ అయింది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయాన్ని కచ్చితంగా మా అమ్మతో చెప్పుకోవాలి అని అనుకుంటుంది. అయితే భాగ్యంకి ఎన్ని సార్లు ఫోన్ చేసినా పది లక్షల మేటర్ గురించి ఏమో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేయదు. మళ్లీ మళ్లీ శ్రీవల్లి ఫోన్ చేయడంతో ఏమైందమ్మా అని మాట్లాడుతుంది. ఆ 10 లక్షలు మేటర్ గురించి ఏమో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేయలేదే ఏమైంది చెప్పు అని అడుగుతుంది.
శ్రీవల్లి ఇంట్లో జరిగిన గొడవ గురించి పూసగుచ్చినట్టు వాళ్ళమ్మ చెవిలో ఊదేస్తుంది. నీకు ఇది సరైన సమయం మీ అత్తయ్య ఆ ఇద్దరు కోడలపై కోపంగా ఉంది కాబట్టి మా పెద్ద కోడలు బంగారం అనిపించుకునేలా నువ్వు చేయాలి. ఆ పెత్తనం అంతా నీ చేతుల్లోకి వస్తుంది. నువ్వు మీ అత్తయ్య ని బుట్టలో వేసుకునే పనిలో ఉండు అని సలహా ఇస్తుంది. ఆ తర్వాత శారదాంబ, సేన, భద్రావతితో మనము ప్రేమ గురించి మరిచిపోయాం కదా ఇప్పుడు మళ్లీ ప్రేమ గురించి ఎందుకు తీయడం అని వాళ్ళ అమ్మ అరుస్తుంది. ఇప్పుడు ఆ ఇంటి కోడలు ఆ ఇంట్లో వాళ్లకు ఇష్టమైనట్టు ఉంటుంది లేదా తనకు నచ్చినట్టు ఉంటుంది దాని విషయంలో మనం కలగ చేసుకోవాల్సిన అవసరం లేదు అని అంటుంది.
Also Read:ప్రభావతి కోపంతో మనోజ్, రోహిణికి కడుపు మంట.. బాలు మాస్టర్ ప్లాన్ సక్సెస్..
శారదాంబ ఎంత చెప్పినా కూడా సేన భద్రావతి వినకుండా ప్రేమ కష్టపడడం మాకు నచ్చలేదు అంటూ బాధపడతారు. ఇక ధీరజు వాళ్ళ నాన్న జీవితంలో ఇంకా తన మొహం చూడడని బాధపడుతూ తన అన్నయ్యలతో చెప్పుకుంటూ ఉంటాడు. ఇంట్లో జరిగిన గొడవకి నీకు ఏ సంబంధం లేదు రా.. నిన్నెందుకు నాన్న దూరం పెడతాడు నువ్వేం బాధపడకు అని ఓదారుస్తారు. అ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..