Nainisha Rai:ప్రస్తుత కాలంలో అటు హీరోయిన్లు ఇటు బుల్లితెర సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. అందులో భాగంగానే నిన్నటికి నిన్న తమిళ నటి సడన్గా నిశ్చితార్థం చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరచగా.. ఇప్పుడు మరో బుల్లితెర నటి నిశ్చితార్థం చేసుకొని ఫోటోలను షేర్ చేసింది. ముఖ్యంగా ఆమె ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తనకు కాబోయే శ్రీవారి ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలు చూసి అభిమానులు మొదట షాక్ అయినా ఆ తర్వాత తేరుకొని కంగ్రాట్స్ చెబుతున్నారు. మరి ఆమె ఎవరు? ఎవరిని వివాహం చేసుకోబోతోంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
నిశ్చితార్థం చేసుకున్న బ్రహ్మముడి అప్పు..
బుల్లితెరపై గత కొంతకాలంగా ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్ ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది అప్పు అలియాస్ నైనిషా రాయ్ (Nainisha Rai) .ఈ సీరియల్ మొదట్లో బాయ్ కట్ లో రౌడీ బేబీలా కనిపించింది. ఇప్పుడు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రౌడీలలో వణుకు పుట్టిస్తోంది. ఇక ఈమె తాజాగా నిశ్చితార్థం చేసుకొని ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. “మొత్తానికి మేము సాధించాం” అంటూ క్యాప్షన్ కూడా జోడించింది నైనిషా. “చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత మా రోజు వచ్చింది. నాకు సపోర్ట్ సిస్టం గా ఉన్నందుకు థాంక్యూ ఆశిష్ చక్రవర్తి” అంటూ నైనిషా తెలిపింది.
నైనిషాకి కాబోయే భర్త ఎవరంటే?
ఇకపోతే ఫోటోలలో నైనిషాకి కాబోయే భర్తను చూసి.. అదిరిపోయాడు.. జోడి చాలా క్యూట్ గా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. దీంతో అప్పు కాబోయే భర్త ఎవరు? అని అభిమానులు కూడా సోషల్ మీడియాలో వెతికే ప్రయత్నం చేయగా.. నైనిషాకి కాబోయే భర్త పేరు ఆశిష్ చక్రవర్తి (Ashish Chakraborty). అతడు ఒక సీరియల్ హీరో అని తెలిసింది. జీ తెలుగులో ప్రసారమవుతున్న చామంతి సీరియల్ లో హీరోగా నటిస్తున్న ప్రేమ్ తోనే ఇప్పుడు ఈమె ఏడడుగులు వేయబోతోంది. ఇతడు తెలుగు తో పాటు తమిళ్లో కూడా పలు సీరియల్స్ చేస్తున్నారు.
అప్పు కాబోయే భర్తలో ఇంత టాలెంట్ ఉందా?
ఇకపోతే అప్పు కాబోయే భర్త ఆశిష్ చక్రవర్తి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇతడు నటుడు కాకముందు ఒక బాడీ బిల్డర్ కూడా..మిస్టర్ ఇండియా బెస్ట్ స్కిన్ 2017, మిస్టర్ మద్రాస్ 2018, మిస్టర్ ఇండియా చెన్నై 2017, మిస్టర్ చెన్నై ఇంటర్నేషనల్ 2019 టైటిల్స్ ను సొంతం చేసుకున్నారు. అంతే కాదు ఆశిష్ MMA ఫైటర్ కూడా.. ఇతడు తెలుగు ఆడియన్స్ కి కూడా మంచి సుపరిచితుడే. సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ లో టైటిల్ విజేతగా నిలిచి చామంతి సీరియల్ టీం ను గెలిపించాడు. ఇక ఆ సమయంలో తన ఆట తీరుతో అందరిని మెప్పించాడు. ఇక ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.