Shivsena Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై సాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి రూపంలో కల్వకుంట్ల కుటుంబానికి కొత్త కుక్క దొరికిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి అనే కుక్కతో ఎట్లపడితే అట్లా మోరిగిస్తున్నారని శివసేనా రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
కేసీఆర్ ఫాహౌజ్ లో పడుకొని కొన్ని కుక్కలను పంపిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే అయి మతి భ్రమించి ఏమి మాట్లాడుతుండో అర్థం కావట్లేదని ఫైరయ్యారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే సన్నబియ్యం తింటున్న ప్రజలు బట్టలూడదీసి కొడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేస్తున్నమహిళలు బట్టలూడదీసి ఉరికిచ్చి కొడతారు. తెలంగాణ యువత ఏకమై కౌశిక్ రెడ్డి లాంటి వెదవలను దొరకబట్టి తాటా తీస్తాం. ఇలాంటి వెదవలు బయట కనబడితే ప్రజలు, మహిళలు ఉతకడం ఖాయం’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి, మంత్రులు ఆపినా ప్రజలు అయితే ఆగరు. స్పెషల్ హాకర్స్ ను పెట్టి పోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. 16 మంది పేర్లతో రుజువు చేస్తా అని కౌశిక్ రెడ్డి అంటున్నారు. రుజువు చేసి మాట్లాడాలి. కేటిఆర్ బయట పెడతారో.. ఎవరు బయట పడతారో.. తెలుస్తది. నీలాంటి సన్నాసుల గురించి హ్యాకింగ్ చేస్తామా..? మీకే గతి లేదు.. మీ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన ఖర్మ మాకేం పట్టింది…? హాకర్స్ ను పెట్టి దుకాణం పెట్టింది.. నీకు బిస్కెట్స్ వేస్తున్న కేటిఆర్. కౌశిక్ రెడ్డి బతుకేందో తెలంగాణ ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి, మంత్రులు ఏ విధంగా పని చేస్తున్నారో అందరికి తెలుసు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోజుకు 18 గంటలు పని చేస్తుంది’ అని ఆయన అన్నారు.
ALSO READ: Balakrishna: గొప్ప మనసు చాటుకున్న బాలయ్య.. అభిమాని కోసం ఏం చేశారో తెలిస్తే షాక్!
ALSO READ: ESIC Recruitment: ఈఎస్ఐసీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. 2లక్షల వేతనం, పూర్తి వివరాలివే..