E-Paper
Advertisement

Sruthi Hassan: ఆ విషయంలో తమన్నా గ్రేట్.. ప్రశంసలు కురిపించిన శృతిహాసన్!

Sruthi Hassan: ఆ విషయంలో తమన్నా గ్రేట్.. ప్రశంసలు కురిపించిన శృతిహాసన్!

Sruthi hassan: సినీనటి శృతిహాసన్(Sruthi Hassan) ప్రస్తుతం కూలీ సినిమా(Coolie Movie) ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ లోకేష్ కనగ రాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రేమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇక ఈ సినిమాలో నాగార్జున అమీర్ ఖాన్ వంటి తదితరులు భాగమైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శృతిహాసన్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

తమన్నా చాలా గ్రేట్…

ఈ సందర్భంగా ఈమె ఒక ఇంటర్వ్యూలో నటి తమన్నా గురించి ప్రశంసలు కురిపించారు. తమన్నా దాదాపు దశాబ్దన్నర కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఇటీవల తమన్నా అన్ని భాషలలోనూ ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. తెలుగు కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే శృతిహాసన్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తమన్నా సింధీ కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారని ఈ విషయంలో తాను చాలా గ్రేట్ అంటూ తమన్నా పై ప్రశంసలు కురిపించారు.

సొంతంగా డబ్బింగ్…

తన వాయిస్ కాస్త డిఫరెంట్ గా ఉండటం వల్ల తమిళ్ లో నా వాయిస్ పట్ల ఎంతోమంది నన్ను ట్రోల్ చేశారని ఈ సందర్భంగా శృతిహాసన్ గుర్తు చేసుకున్నారు. హిందీలో నా వాయిస్ పట్ల ఎలాంటి ట్రోల్స్ లేకపోయినా తమిళంలో మాత్రం చాలామంది విమర్శలు చేశారని తెలిపారు. ఇక నా చేత ఎవరూ కూడా డబ్బింగ్ చెప్పించేవారు కాదని, మొదటిసారి డైరెక్టర్ నాగ్ అశ్విన్ పిట్ట కథలు కోసం నన్ను డబ్బింగ్ చెప్పమన్నారని శృతిహాసన్ వెల్లడించారు అప్పటి నుంచి తెలుగులో తాను తన పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెబుతున్నానని వెల్లడించారు. ఇక ఇటీవల సలార్ సినిమాలోను అలాగే కూలీ సినిమాకు కూడా తన పాత్రకు ఈమె డబ్బింగ్ చెప్పినట్లు తెలియజేశారు.

కూలీతో పోటీకి దిగిన వార్ 2..

ఇక శృతిహాసన్ తెలుగులో చివరిగా సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక త్వరలోనే సలార్ 2 కూడా షూటింగ్ పనులను జరుపుకోనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత శృతిహాసన్ కూలీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది. అయితే ఇదే రోజు ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్ 2(War 2) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడిందని తెలుస్తోంది. మరి ఈ బాక్సాఫీస్ వార్ లో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి. ఇక వార్ నుంచి కూడా విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి అంచనాలనే పెంచేసాయి. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Also Read: OTT Ban: అశ్లీల ఓటీటీల బ్యాన్‌పై స్పందించిన ఏక్తా కపూర్.. భలే తప్పించుకుందే!

Related News

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

Big Stories

×