Paneer: ప్రస్తుతం చాలా మంది పనీర్ తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. పాలతో తయారుచేసే దీనిని శాకాహారులు మాంసానికి బదులుగా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అనేక మంది వివిధ రకాల ఆహార పదార్థాలను వీటితో తయారు చేసి తినడం మనం చూస్తూనే ఉంటాం. ఇదిలా ఉంటే.. రుచితో పాటు పనీర్‌లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ పన్నీర్ అతిగా తినడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. పన్నీర్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ యొక్క ప్రయోజనాలు:
ప్రోటీన్ పవర్ హౌస్: పనీర్‌లో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల నిర్మాణానికి, కండరాల మరమ్మత్తుకు, అంతే కాకుండా శరీరంలోని కణజాలాల ఆరోగ్యానికి ప్రోటీన్ చాలా అవసరం. శాకాహారులకు ఇది ఒక అద్భుతమైన ప్రోటీన్ మూలం.
ఎముకల ఆరోగ్యానికి: పనీర్‌లో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు ఖనిజాలు ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఇవి ఎముకల సాంద్రతను పెంచి, బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
బరువు తగ్గడానికి సహాయం: పనీర్‌లో ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల త్వరగా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది అతిగా తినడాన్ని నిరోధించి.. బరువు తగ్గడానికి లేదా బరువును అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది.
జీర్ణక్రియకు మంచిది: పనీర్‌లో మంచి బ్యాక్టీరియాను పెంచే లక్షణాలున్నాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
మధుమేహ నియంత్రణ: పనీర్‌లో ప్రోటీన్, ఫైబర్ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి చాలా బాగా ఉపయోగపడుతుంది.
శక్తిని అందిస్తుంది: పనీర్‌లోని పోషకాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. వ్యాయామం చేసేవారికి లేదా శారీరక శ్రమ చేసేవారికి ఇది ఒక మంచి ఆహారం.
పనీర్ సైడ్ ఎఫెక్ట్స్:
కొవ్వు అధికంగా ఉంటుంది: పనీర్ పాలతో తయారవుతుంది కాబట్టి.. ఇందులో కొవ్వు శాతం ఎక్కువగానే ఉంటుంది. అతిగా పనీర్ తీసుకోవడం వల్ల బరువు పెరగడం, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా కొవ్వు తగ్గించిన పనీర్‌ను తినడం మంచిది.
అజీర్ణం: కొంతమందికి పనీర్ జీర్ణం కావడానికి కష్టంగా ఉంటుంది. ఇది అజీర్ణం, ఉబ్బరం లేదా కడుపు నొప్పికి దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది.
Also Read: డైలీ ఈ సీడ్స్ తింటే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది
అలెర్జీలు: పాల ఉత్పత్తులకు అలెర్జీ ఉన్నవారు పనీర్‌కు కూడా అలెర్జీని కలిగి ఉండవచ్చు. ఇది దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఇతర అలెర్జీ ప్రతిచర్యలకు కారణం కావచ్చు.
కిడ్నీ సమస్యలు: కిడ్నీ సమస్యలు ఉన్నవారు పనీర్‌ను పరిమితంగా తీసుకోవాలి. పనీర్‌లో అధిక మొత్తంలో ప్రోటీన్ , ఫాస్పరస్ ఉండటం వల్ల మూత్రపిండాలపై భారం పడుతుంది.
నాణ్యత: మార్కెట్లో లభించే కొన్ని పనీర్ తో తయారు చేసిన ఆహార పదార్థాలు తేడాలు కలిగి ఉంటాయి. పనీర్ తయారుచేయడానికి ఉపయోగించే పాల నాణ్యత, తయారీ పద్ధతులు, నిల్వ చేసే విధానం ముఖ్యం. పరిశుభ్రంగా, నాణ్యమైన పనీర్‌ను మాత్రమే కొనడం మంచిది.