E-Paper
Advertisement

పిల్లలు పుట్టాక మీ భార్యలను వదిలేస్తారా? మాధవీలత ఘాటు వ్యాఖ్యలు

పిల్లలు పుట్టాక మీ భార్యలను వదిలేస్తారా? మాధవీలత ఘాటు వ్యాఖ్యలు
Advertisement

Maadhavi Latha: దశాబ్దాల పాటు సినీ పరిశ్రమను ఏలిన ఎంతో మంది హీరోయిన్లు సడన్గా బరువు పెరిగిపోవడం లేదా బక్క చిక్కి పోవడం లేదా వారి శరీరంలో ఏదైనా మార్పులు సంభవిస్తే మాత్రం వారిని, వారి గత తాలూకా విషయాలను ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. వారి స్టార్ స్టేటస్ తో పని లేకుండా ప్రస్తుతం వారి బాడీ స్ట్రక్చర్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకొని ట్రోల్స్ చేయడం ఎంతవరకు సమంజసం. ఎన్నో చిత్రాలలో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన హీరోయిన్స్ శరీరంలో మార్పులు వస్తే ఇటువంటి సోషల్ మీడియా దాడులు ఎదుటి ఆడవారిని కూడా ఆగ్రహానికి గురిచేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరోయిన్ పై బాడీ షేమింగ్ ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో మాధవీ లత (Madhavi Latha) తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో విడుదల చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్లలు పుట్టాక మీ భార్యను కూడా వదిలేస్తారా? అనే రేంజ్ లో మండిపడింది. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

ట్రోలర్స్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాధవీ లత..

సోషల్ మీడియాలో రెండు రోజుల నుంచి ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) పై భారీగా బాడీ షేమింగ్ ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో తనదైన శైలిలో స్పందించింది మాధవీ లత . తాజాగా తన ఇంస్టాగ్రామ్ అధికారిక ఖాతా ద్వారా ఒక వీడియో విడుదల చేస్తూ.. “రీసెంట్ గా ఒక వీడియో చూశాను. అందులో కత్రినా కైఫ్ కాస్త చబ్బీగా కనిపించారు. కానీ కింద కామెంట్స్ మాత్రం చాలా అసహ్యంగా ఉన్నాయి. అందులో మగవారే ఎక్కువగా ఆమెపై బాడీ షేమింగ్ ట్రోల్స్ చేస్తున్నారు. మగవాళ్ళు వాళ్ళ ఇంట్లో అమ్మ, చెల్లి ,అక్క లేదా వాళ్ళ చుట్టాల ఇళ్లల్లో ఆడవారు పాపం ఎవరిని కనలేదనుకుంటాను.. ఎప్పుడూ వారి ఇళ్లలో ఆడవాళ్లు సన్నగా , జీరో సైజ్ లోనే ఉంటారనుకుంటా.. వాళ్ళు ఎవరు తల్లులు కాలేదనుకుంటాను..

బిడ్డలు పుడితే మీ భార్యలను వదిలేస్తారా?

Advertisement

లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్లకు బిడ్డలు పుట్టాక.. వాళ్ళని వదిలేసి.. ఇంకొకరిని భార్యగా తెచ్చుకుంటారు అనుకుంటా.. మహిళను ఒక ఆట వస్తువుగా మాత్రమే వాడుకుంటారనుకుంటా.. అందుకే ఇలా ఒక అమ్మాయిలో వచ్చిన మాతృత్వపు మార్పులను గౌరవించకుండా ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఇలాంటి వారి మొహం చూస్తే తినడానికి కూడా ఇంట్రెస్ట్ రాదు..

మగవారిలో ఏ మార్పులు ఉండవు.. బిడ్డను మోయాల్సిన పనిలేదు.. కనాల్సిన పనిలేదు.. హార్మోనల్ చేంజెస్ అసలుకే ఉండవు. వారిలో వచ్చేది రెండే మార్పులు.. ఒకటి తినడం, తాగడం లేదా అనారోగ్య సమస్యలు.. అంతకుమించి ఏముంటాయి. మాతృత్వంలో ఉన్న అమ్మాయిని అంత అసహ్యంగా మాట్లాడటం .. ఆమె తల్లి కాకపోయినా హార్మోనల్ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటుంది.. ఆరోగ్య సమస్యల వల్ల ఉపయోగించిన మెడిసిన్స్ వల్ల కూడా వారిలో మార్పు వచ్చి ఉండవచ్చు.. ఇలాంటి వాళ్లలో పాపం జీవితాంతం ఎలాంటి మార్పులు రాకుండా జీరో సైజ్ మెయింటైన్ చేస్తూ.. బాడీ ఫిట్గా ఉంచుకుంటారు. వీళ్ళ మొహాలు చూస్తే తినడానికి కూడా ఇంట్రెస్ట్ రాదు” అంటూ ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది మాధవీ లత.

Advertisement

also read:ఆ హీరోలకు, బాలయ్యకు మధ్య ఉన్న తేడా అదే – ఉదయభాను

కత్రినా కైఫ్ పై బాడీ షేమింగ్ ట్రోల్స్..

ఒకప్పుడు అద్భుతమైన అందం, మెరుపులాంటి డ్యాన్స్ లతో దశాబ్దాల పాటు హిందీ పరిశ్రమను ఏలిన కత్రినా కైఫ్ ఈ మధ్యకాలంలో విపరీతమైన బాడీ షేమింగ్ ట్రోల్స్ ఎదుర్కొంటోంది. ప్రసవం తర్వాత ఆమె శరీరంలో వచ్చిన సహజమైన మార్పులను లక్ష్యంగా చేసుకొని కొంతమంది ఆకతాయిలు దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు కూడా ఆ నెగెటివిటీని గట్టిగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

అసలేం జరిగింది?

విషయంలోకి వెళ్తే.. ప్రముఖ వ్యాపారవేత్త అంబానీ ఇంట్లో జరిగిన వినాయక చవితి వేడుకలకు కత్రినా తన భర్త విక్కీ కౌశల్ తో కలిసి హాజరైంది . ప్రసవం తర్వాత చాలా అరుదుగా బయట కనిపించడంతో ఆమె ఫోటోలు, వీడియోలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. అయితే ఆమె రూపంలో వచ్చిన మార్పును కొంతమంది గమనించి సోషల్ మీడియా వేదికగా “బిఫోర్ ఆఫ్టర్” ఫోటోలను షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

 

?stkn=M3N2ajVkZGNleGVx

 

Related News

సంక్రాంతి రేసులోనే ‘కాకా’ మేకర్స్ క్లారిటీ.. ‘విశ్వంభర’ వెనక్కి తగ్గాల్సిందేనా!

బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన ‘గబ్బర్ సింగ్’ రమేష్.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే?

40ల్లోనూ తగ్గని అందం.. అనసూయ గ్లామర్ లుక్స్ వైరల్!

సెన్సార్ పూర్తి చేసుకున్న సెప్టెంబర్ 18 రిలీజ్ చిత్రాలు.. ఏ మూవీ రన్ టైమ్ ఎంతంటే?

బీచ్ లో డాన్స్ చేస్తూ..కిక్కెక్కిస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్ .. వీడియో వైరల్!

‘కాకా’ చిత్రంలో అలనాటి హీరోయిన్ స్నేహ.. నిజమెంత?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ఇప్పటిల్లో లేనట్లే..?

Big Stories

Advertisement
×