Udaya Bhanu: ఉదయభాను టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈమె కెరియర్ మొదట్లో టెలివిజన్ యాంకర్ గా ఎన్నో అద్భుతమైన షోలను విజయవంతంగా ముందుకు నడిపించారు. అప్పట్లో ఏ కార్యక్రమం అయినా యాంకర్ గా ఉదయభాను (Udayabhanu)ఉండాల్సిందే. ఇలా ఒక అనుక సమయంలో యాంకర్ గా ఓ వెలుగు వెలిగిన ఈమె ఇటీవల యాంకర్ గా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు. ఇలా ఉదయభాను ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి కొంతమంది చేసిన కుట్రలే కారణమని ఈమె పలు సందర్భాలలో తెలియచేశారు. ఇలా ఉదయభాను ఉద్దేశపూర్వకంగానే అవకాశాలు లేకుండా ఇండస్ట్రీకి దూరం చేశారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా తాజాగా ఉదయభాను పంచనామా అనే వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఉదయభాను ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరియర్ మొదట్లో ఎవరైనా చేదు సంఘటనల గురించి అభిమానులతో పంచుకున్నారు. ఉదయభాను అంటే కేవలం యాంకర్ అని మాత్రమే కాదు అందంలోనూ, ఈమె వస్త్రధారణ విషయంలో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరని చెప్పాలి. ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ ఉదయభాను వస్త్రధారణ ఉండేది. అయితే యాంకర్ గా కొనసాగుతున్న సమయంలో ఉదయభాను స్లీవ్ లెస్ డ్రస్సులు వేసిన, జీన్స్ వేసిన తన గురించి ఎన్నో రకాల విమర్శలు వచ్చాయని ఈమె గుర్తు చేసుకున్నారు.
ఇలా తన వస్త్రధారణ విషయంలో ఈ విధమైనటువంటి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఉదయభాను స్పందిస్తూ నాకు చిన్నప్పటినుంచి కూడా మా అమ్మ ప్రత్యేకంగా దుస్తులు డిజైన్ చేసేదని తెలిపారు. చిన్నప్పటి నుంచి నేను జీన్స్ లు వేసుకోవడం, స్లీవ్ లెస్ డ్రస్సులు వేసుకోవడం అలవాటుగా ఉండేది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా తాను అలాంటి దుస్తులు వేసుకోవడంతో చాలామంది తనని విమర్శించారని, కొన్నిసార్లు బాగా ఏడ్చానని కూడా ఉదయభాను తెలిపారు. నేను చేసే షో బట్టి తన వస్త్రధారణ ఉంటుంది. నేను మాట్లాడే విధానం, నిలబడే విధానంపై కూడా విమర్శించారు. భుజం మీద చేతులు వేసుకొని మాట్లాడుతుందంటూ కూడా నన్ను తప్పు పట్టారని ఉదయభాను తెలిపారు.
ఈ విధంగా నన్ను అప్పుడు చాలామంది విమర్శిస్తూ నేను చేసేది తప్పు అన్నారు కానీ ఇప్పుడు మీరందరూ చేస్తుంది ఏంటి? భుజాలపై చేతులు వేసి మాట్లాడటం ,మోకాళ్ల దగ్గర కూర్చొని మాట్లాడటం చేస్తున్నారు .అప్పుడు నన్ను వెక్కిరించిన వారందరూ కూడా ఇప్పుడు అదే చేస్తున్నారని, కానీ ఉదయభాను చేస్తే మాత్రమే తప్పు అంటూ తన వస్త్రధారణ విషయంలో విమర్శలు చేసిన వారి గురించి మాట్లాడుతూ ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read: యాంకర్ సుమతో గొడవలు.. అసలు విషయం చెప్పిన ఉదయభాను