E-Paper
Advertisement

కన్న తల్లిదండ్రులని చంపేసే లేడీ సైకో.. ఒళ్ళు గగుర్పొడిచే రియల్ స్టోరీ తెలుగులో!

కన్న తల్లిదండ్రులని చంపేసే లేడీ సైకో.. ఒళ్ళు గగుర్పొడిచే రియల్ స్టోరీ తెలుగులో!
Advertisement

True Crime Series: సంపన్న కుటుంబానికి చెందిన యువతి ఓ ఉదయం నిద్రలేచేసరికి ఇంట్లోనే తండ్రి, సవతి తల్లి దారుణంగా హత్యకు గురై ఉంటే ? ఆధారాలన్నీ ఇంట్లోనే ఉన్న ఆమె వైపే చూపిస్తే ? ఆ హత్యలు నిజంగా ఆమె చేసిందా ? లేక ఆమెను ఇరికించేలా ఎవరో కథ నడిపించారా ? అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది ? అమెరికా చరిత్రలో సంచలనం సృష్టించిన వాస్తవ ఘటన ఆధారంగా రూపొందిన ట్రూ క్రైమ్ సిరీస్ ‘మాన్‌స్టర్ ది లిజ్జీ బోర్డెన్ స్టోరీ’ (Monster: The Lizzie Borden Story) ఈ ప్రశ్నల చుట్టూనే సాగుతుంది. మరి ఈ సిరీస్ తెలుగులో ఉందా లేదా ? ఉంటే ఎక్కడ చూడాలి ? అంటే…

కథలోకి వెళ్తే…

కథ 1892లో అమెరికాలోని మసాచుసెట్స్‌లో మొదలవుతుంది. లిజ్జీ బోర్డెన్ ఓ సంపన్న కుటుంబంలో పెరిగిన యువతి. బయట ప్రపంచానికి ఆ కుటుంబం గౌరవప్రదంగా కనిపించినా… ఇంట్లో మాత్రం పరిస్థితులు అంత సంతోషంగా ఉండవు. తండ్రి ఆండ్రూ బోర్డెన్ విధించే ఆంక్షలు, సవతి తల్లి అబ్బీ బోర్డెన్ తో ఉండే విభేదాలు లిజ్జీ జీవితాన్ని నరకంగా మారుస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఓ ఉదయం బోర్డెన్ కుటుంబంలో భయంకరమైన ఘటన జరుగుతుంది. ఆండ్రూ, అబ్బీ ఇద్దరూ తమ ఇంట్లోనే గొడ్డలితో దారుణంగా హత్యకు గురవుతారు. ఈ ఘటన బయటకు రావడంతో మసాచుసెట్స్ మాత్రమే కాదు… దేశవ్యాప్తంగా సంచలనం రేగుతుంది.

Advertisement

అసలు హత్యలు చేసింది ఎవరు? ఎందుకు చేశారు? అనే ప్రశ్నలకు సమాధానం కోసం పోలీసులు దర్యాప్తు మొదలు పెడతారు. కేసులో అనుమానాలు ఒక్కొక్కటిగా లిజ్జీ వైపు మళ్లుతాయి. ఇంట్లో జరిగిన హత్యలు కావడంతో ఆమెకు ఈ నేరంతో సంబంధం ఉందా ? అనే అనుమానం బలపడుతుంది. చివరకు పోలీసులు ఆమెను ప్రధాన నిందితురాలిగా అరెస్ట్ చేస్తారు. అప్పటి నుంచి ఆమె వ్యక్తిగత జీవితం, కుటుంబ సంబంధాలు, గతంలో జరిగిన సంఘటనలు అన్నీ విచారణలో భాగమవుతాయి.

అయితే కేసు ముందుకు వెళ్లే కొద్దీ మరిన్ని ప్రశ్నలు ఎదురవుతాయి. లిజ్జీకి నిజంగా హత్యలు చేసేంత బలమైన కారణం ఉందా ? ఆమెపై ఉన్న అనుమానాలకు సరైన ఆధారాలు ఉన్నాయా ? ఆ ఇంట్లో పని చేసే బ్రిడ్జెట్ కు ఈ వ్యవహారంతో ఏమైనా సంబంధం ఉందా ? కుటుంబంలో బయటకు కనిపించని మరో కోణం ఏమైనా ఉందా ? అనే ప్రశ్నలతో కోర్టు విచారణ సాగుతుంది. ఈ కేసు కేవలం ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌గా మాత్రమే కాకుండా… ఆ కాలంలో మహిళలపై ఉన్న సామాజిక ఒత్తిడి, కుటుంబ వ్యవస్థ, మానసిక సంఘర్షణ, సమాజం ఒక వ్యక్తికి ముద్ర వేసే విధానాన్ని కూడా చూపిస్తుంది. కోర్టు లిజ్జీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది ? తీర్పు తర్వాత కూడా ఆమె చుట్టూ అనుమానాలు ఎందుకు కొనసాగాయి ? నిజంగా ఆ ఉదయం బోర్డెన్ ఇంట్లో ఏం జరిగింది ? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం సిరీస్ చూడాల్సిందే.

తెలుగులో ఉందా ?

Advertisement

‘మాన్‌స్టర్ ది లిజ్జీ బోర్డెన్ స్టోరీ’ (Monster The Lizzie Borden Story) నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియోతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లోనూ అందుబాటులో ఉంది. ఎల్లా బీటీ (Ella Beatty), చార్లీ హన్నమ్ (Charlie Hunnam), రెబెక్కా హాల్ (Rebecca Hall), విక్కీ క్రియేప్స్ (Vicky Krieps) కీలక పాత్రల్లో కనిపిస్తారు. రైన్ మర్ఫీ (Ryan Murphy), ఇయాన్ బ్రెన్నాన్ (Ian Brennan) రూపొందించిన ఈ సీజన్‌ లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. నిజ జీవిత క్రైమ్ కేసులు, కోర్టు డ్రామా, సైకలాజికల్ సస్పెన్స్ నచ్చేవారికి ఈ సిరీస్ తప్పకుండా నచ్చుతుంది.

Read Also: మునిగిపోయిన ఓడలో వేల కోట్ల నిధి.. ట్విస్టులతో పిచ్చెక్కించే యాక్షన్-అడ్వెంచర్ మిస్టరీ టీన్ సిరీస్

Tags

Related News

పచ్చని సంసారంలో నిప్పులు పోసే కేర్‌టేకర్.. డార్క్ సీక్రెట్స్ తో దడ పుట్టించే థ్రిల్లర్

గ్యాంగ్‌స్టర్లకు చుక్కలు చూపించే అండర్‌కవర్ టీమ్.. హై-వోల్టేజ్ యాక్షన్-కామెడీ డ్రామా సిరీస్

మిత్రుడి మరణం.. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌ ఎంట్రీతో మతిపోగొట్టే ట్విస్ట్

లాటరీలో వందల కోట్లు.. ఉద్యోగానికి రాజీనామా చేయకుండా ఆఫీస్‌‌లో అరాచకం, తెలుగులోనూ ఉంది

సైబర్ క్రైమ్ స్కామ్ తో సర్వం కోల్పోయే అమ్మాయి.. క్లైమాక్స్ అదుర్స్, తెలుగులో మలయాళ థ్రిల్లర్

ఎడారిలో విమానం క్రాష్.. లేడీ సైంటిస్ట్ కిడ్నాప్.. గ్రిప్పింగ్ సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్

చిన్నారికి ఇచ్చిన మాట తప్పే దేవుడు.. శక్తులు కోల్పోయి భూమి మీదకు… తెలుగులో క్రేజీ ఫాంటసీ ధమాకా

Big Stories

Advertisement
×