BigTV English

Vaishnavi Chaitanya:  మెదక్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభించిన వైష్ణవి చైతన్య!

Vaishnavi Chaitanya:  మెదక్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభించిన వైష్ణవి చైతన్య!

Vaishnavi Chaitanya: వస్త్ర దుకాణాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలుగాంచిన వాటిలో చందన బ్రదర్స్ (Chandana Brothers)ఒకటి. ఎన్నో రకాల వెరైటీతో ప్రస్తుతం ట్రెండ్ కు అనుగుణంగా, వివిధ రకాల డిజైన్లతో కూడిన వస్త్రాలకు నిలయంగా చందన బ్రదర్స్ (Chandana Brothers)గత కొన్ని దశాబ్దాలుగా పేరు ప్రఖ్యాతలుగాంచినదని చెప్పాలి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నో బ్రాంచ్ లు ఉన్నాయి. అయితే తాజాగా మెదక్ లో మరొక బ్రాంచ్ ప్రారంభించారు. తాజాగా ఈ నూతన షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ షో రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నటి వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) పాల్గొన్నారు.


షోరూం ప్రారంభించిన వైష్ణవి చైతన్య..

వైష్ణవి చైతన్య చేతుల మీదుగా షోరూం ప్రారంభమైంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు(Hanumantha Rao) పాల్గొని సందడి చేశారు. బేబీ వైష్ణవి చైతన్య చేతులమీదుగా రిబ్బన్ కట్ చేసి షోరూం ప్రారంభించారు. షోరూం మేనేజింగ్ డైరెక్టరు శ్రీ జానా సురేష్(Janaa Suresh) గారు మాట్లాడుతూ 40 సంవత్సరాల అనుబంద సంస్థ తెలుగు రాష్ట్రాలలో ప్రారంభించిన ప్రతి చోటా అతి తక్కువ కాలంలోనే అక్కడి ప్రజల మన్ననలతో నెం.1 షోరూంగా నిలుస్తుండడం తమకు ఎంతో సంతోషంగా ఉందని, ఇలాంటి షోరూమ్ లు మరిన్ని ప్రారంభించడానికి ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు.


ఆషాడం, శ్రావణం ప్రత్యేక ఆఫర్..

ప్రజల అభిరుచికి సరిపడే వస్త్రాలు ఎంపిక చేయడంలోగాని ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల కస్టమర్ల అభిమానాన్ని పొందుతామని ఈయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అందరికీ అందుబాటులో ఉండే విధంగా సరసమైన ధరలకు నాణ్యమైన సాంప్రదాయ వస్త్రాలను, మోడ్రన్ దుస్తులను అందించడంలో చందన బ్రదర్స్ ముందుంటుందని ఇదే తమ విజయ రహస్యమని తెలియజేశారు. ఇక ఆషాడం, శ్రావణమాసం మొదలుకొని ప్రత్యేకమైన ఆఫర్లు కూడా ఉన్నట్టు ఈ సందర్భంగా సురేష్ తెలియజేశారు.

మా ఫస్ట్ చాయిస్ చందన బ్రదర్స్..

ఈ కార్యక్రమంలో భాగంగా వైష్ణవి చైతన్య మాట్లాడుతూ… చందన బ్రదర్స్ ప్రారంభోత్సవంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మెదక్ లో ప్రతి చిన్న అవసరానికి, ఏదైనా ఫంక్షన్ జరిగినా షూటింగ్ కాస్టమ్స్ కైనా మేము మొదటగా వచ్చేది చందన బ్రదర్స్ కే అంటూ వైష్ణవి తెలియజేశారు.ఇక్కడ లభించే డిజైన్లూ – వెరైటీలూ వేరెక్కడా లభించవని, అందుకే ఇది హైదరాబాదీల ఫేవరెట్ షోరూంగా మారిందని అన్నారు. నేడు ప్రారంభోత్సవ ఆఫర్లతో అతి తక్కువ ధరలతో ఉన్న చీరలను చూసి మురిసిపోతూ షాపింగ్ బుట్టలలో చీరలను నింపేయడం ప్రతి ఫ్లోర్లోనూ
కనిపించిందని వైష్ణవి చైతన్య వెల్లడించారు. ఇక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైష్ణవి చైతన్య వస్తున్నారనే విషయం తెలియగానే అభిమానులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన అభిమానులతో ఈమె సెల్ఫీలు దిగడమే కాకుండా షో రూమ్ లో ఉన్న పలు వస్త్రాలను కూడా చూపించారు.

Also Read: Singer Kankavva: కష్టాల కడలిలో సింగర్ కనకవ్వ.. ఇన్ని ఇబ్బందులు పడిందా?

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×