China Roads Technology: రోడ్లు వేసినా రెండేళ్లు కూడా గట్టిగా నిలబడక, మళ్లీ గుంతలు పడిపోతున్న దృశ్యాలు మన కంట కనిపిస్తుంటాయి. కానీ చైనా మాత్రం రహదారి నిర్మాణాన్ని ఒక శాస్త్రీయ ప్రక్రియలా తీసుకొని, తక్కువ ఖర్చుతో, ఎక్కువ కాలం నిలబడే రోడ్లను నిర్మిస్తున్నదట. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సమాచారం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే ఈ రహదారులు 100 ఏళ్ల పాటు నిలబడతాయట. ఇంతకు చైనా ఉపయోగించే ఆ టెక్నిక్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చైనా నిర్మాణ శైలిలో ఒక కీలక అంశం.. రహదారికి ఉపయోగించే రీఇన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్. సాధారణంగా మనం కాంక్రీట్ అంటే సిమెంట్, నీళ్లు అని అనుకుంటాం. కానీ చైనా ఇందులో స్టీల్ మెష్ కలిపి, కాంక్రీటును మరింత బలమైనదిగా తయారు చేస్తుంది. దీని వలన ఏ ఒక్క ప్రెషర్ వచ్చినా, క్లైమేట్ మారినా రహదారి పగుళ్లు పడకుండా చాలా కాలం నిలబడుతుంది.
మల్టీ లేయర్ ప్రొటెక్షన్
ఈ రహదారులు అధిక కాలం ఉంటాయట. ఎన్నో పొరల నిర్మాణ విధానంతో ఇక్కడి రోడ్లు చాలా నాణ్యతగా ఉంటాయట. మొదటి పొరగా సన్నగా ఫౌండేషన్ లేయర్ వేసి, దాని మీద స్టీల్ మెష్ ను, అగ్ర కాంక్రీట్ లేయర్ తో కప్పేస్తారు. ఇలా 3 నుండి 5 పొరల మధ్య స్టీల్ నెట్‌ను వేసే విధానం వలన, బరువైన వాహనాలు తిరిగినా కూడా రహదారి పగుళ్లు పడని పరిస్థితి ఉందట.
Also Read: Ice cream scam: ఐస్‌క్రీమ్ తింటున్నారా? వెలుగులోకి బిగ్ స్కామ్.. తస్మాత్ జాగ్రత్త!
స్మార్ట్ మెయింటైన్స్ టెక్నాలజీ
ఇంకో ఆసక్తికర విషయం.. చైనా రహదారులు స్మార్ట్ మైంటెనెన్స్ సిస్టమ్ కలిగి ఉంటాయి. అంటే వీటి నిర్మాణంలో సెన్సార్లు అమర్చినట్లుగా సమాచారం. వర్షం వచ్చినా, బరువు ఎక్కువైనా, ఉష్ణోగ్రత మారినా రహదారి పరిస్థితిని అంచనా వేసే టెక్నాలజీ ఇందులో భాగం. రహదారి ఏ చిన్న డామేజ్ అయినా ముందే కనిపెట్టగలిగే స్మార్ట్ టెక్నాలజీ వలన, మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువ అవుతుంది.
ఇలాంటి నిర్మాణ శైలితో చైనా రహదారులు 100 సంవత్సరాలు పాటు రిపేర్ అవసరం లేకుండా నిలబడతాయట. ఈ విషయం చైనాలో నిర్మించిన కొన్ని రహదారులతో నిరూపితమవుతోంది. జాతీయ హైవేలు, స్పెషల్ ఇండస్ట్రియల్ కారిడార్లు ఇలా ఏ రహదారిని చూసినా.. ఇవన్నీ అదే టెక్నాలజీతో తయారవుతున్నాయి.
చైనా ఉపయోగిస్తున్న స్టీల్ మెష్, మల్టీ లేయర్ టెక్నిక్, స్మార్ట్ సెన్సింగ్ టెక్నాలజీ మనకూ మోడల్‌గా నిలవవచ్చు. అలాంటి శాస్త్రీయమైన దృష్టితో ప్రాజెక్టులను చూస్తే, మన దేశంలో కూడా శాశ్వత రహదారుల కల నిజమవుతుందని నిపుణుల అభిప్రాయమని చెప్పవచ్చు. చైనా రహదారులు మామూలు కాదు.. ఇవి భవిష్యత్ రోడ్డుల రూపమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ కాలం పనిచేసే ఇంజినీరింగ్ మున్ముందు మార్గాన్ని నిర్దేశిస్తుందని చెప్పవచ్చు.