Madhavan: సాధారణ సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లకు కొంత వయస్సు వరకు హీరోయిన్లుగా చేసే అవకాశాలు ఉంటాయి. అనంతరం వారికి తల్లి పాత్రలు లేదా వదిన అక్క పాత్ర ఇస్తూ ఉంటారు కానీ హీరోలు మాత్రం 6 పదుల వయసులో అడుగుపెట్టిన ఇప్పటికీ కొంతమంది హీరోలు రొమాంటిక్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే కొన్నిసార్లు ఇలాంటి సినిమాలలో నటించడం వల్ల విమర్శలు పాలు అవుతూ ఉంటారు. తాజాగా నటుడు మాధవన్ (Madhavan)కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈయన”ఆప్ జైసా కోయి” (Aap Jaisa Koi)అనే రొమాంటిక్ కామెడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
రొమాంటిక్ సినిమాలు చేయలేను..
బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్(Fathina Sana Shaikh) తో కలిసి నటించిన ఈ సినిమా థియేటర్లో కాకుండా నెట్ ఫ్లిక్స్ (Net Flix)వేదికగా ప్రసారమవుతుంది. సుమారు 55 సంవత్సరాల వయసు కలిగిన మాధవన్ తనకంటే వయసులో చాలా చిన్నదైన నటి పాతిమతో కలిసి రొమాంటిక్ సన్నివేశాలలో నటించడం వల్ల ఈయన మరోసారి వార్తలలో నిలిచారు. ఇలా రొమాంటిక్ సన్నివేశాలలో నటించడం గురించి తాజాగా మాధవన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు కమిట్ అయినప్పుడు నేను రొమాంటిక్ సన్నివేశాలలో నటించగలను అనే ఉద్దేశంతోనే సినిమాకు కమిట్ అయ్యానని తెలిపారు.
వయసుకు తగ్గ సినిమాలు..
ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత తాను ఒక నిర్ణయానికి వచ్చానని ఇకపై ఎలాంటి రొమాంటిక్ సినిమాలలో(Romantic Movies) నటించకూడదు అనే నిర్ణయాన్ని తీసుకున్నానని మాధవన్ తెలిపారు. నా వయసుకు తగ్గ పాత్రలలో మాత్రమే నటించాలని నిర్ణయించుకున్నాను. ఇకపై రొమాంటిక్ సినిమాలను పూర్తిగా వదిలేస్తానేమో… చివరి అవకాశంగా ఇలాంటి సినిమాలో నటించాను అంటూ ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో రొమాంటిక్ హీరోగా ఎన్నో రొమాంటిక్ సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న మాధవన్ రొమాంటిక్ సినిమాల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారింది.
మహేష్ తండ్రిగా మాధవన్..
కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించిన ఆప్ జైసా కోయి సినిమా జులై 11 తేది నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. ఇక మాధవన్ సినీ కెరియర్ విషయానికి వస్తే భాషతో సంబంధం లేకుండా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్న ఈయన ఇప్పటికీ వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఈయన రాజమౌళి మహేష్ బాబు కాంబోలో రాబోతున్న సినిమాలో కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబుకి తండ్రి పాత్రలో కనిపించబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.