Sohel – Prashanth: బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సోహెల్(Sohel), పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) వంటి వారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీరిద్దరూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. నటుడిగా, మోడల్ గా గుర్తింపు పొందిన సోహెల్ బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని ఫైనల్ లిస్ట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇకపోతే ఈ కార్యక్రమం అనంతరం మంచి గుర్తింపు పొందిన ఈయన వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఏ ఒక్క సినిమా కూడా సోహెల్ కు అనుకున్న స్థాయిలో సక్సెస్ అందించలేకపోయింది.
రైతుబిడ్డగా మారిన సోహెల్..
ఇక సోషల్ మీడియాలో రైతుబిడ్డ(Raithu Bidda) అంటూ ఎన్నో వ్యవసాయ పనులకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ మంచి సక్సెస్ అందుకున్న పల్లవి ప్రశాంత్ తనకు బిగ్ బాస్ అవకాశం కల్పించాలని కోరారు. అనుకున్న విధంగానే ఈయన కూడా సీజన్ సెవెన్ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఏకంగా విన్నర్(Winner) గా హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా ఒక సామాన్యుడు హౌస్ లోకి వెళ్లి విజేతగా బయటకు రావడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఇక బిగ్ బాస్ తర్వాత పల్లవి ప్రశాంత్ క్రేజ్ మారిపోయింది.
రైతు బిడ్డల పవర్…
ఇకపోతే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే పల్లవి ప్రశాంత్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఆసక్తికరమైన ఫోటోలను షేర్ చేశారు . మరొక బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ తో కలిసి పల్లవి ప్రశాంత్ పొలంలో పనులు చేస్తూ దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. బిగ్ బాస్ తర్వాత కూడా పల్లవి ప్రశాంత్ పొలం పనులు చేసుకుంటూ ఉండగా పలువురు సెలబ్రిటీలు ఆయనని తరచూ కలుస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే సోహైల్ కూడా పల్లవి ప్రశాంత్ ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులతో ఫోటోలు దిగారు. అలాగే పొలంలోకి వెళ్లి పొలం పనులు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ ఫోటోలను పల్లవి ప్రశాంత్ షేర్ చేస్తూ..”ఇది రైతుబిడ్డల పవర్”అని క్యాప్షన్ ఇచ్చారు. త్వరలోనే సోహెల్ తో కలిసి చేసిన వీడియో కూడా రాబోతుందని తెలిపారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొంతమంది అభిమానులు సూపర్ అంటూ కామెంట్లు చేయగా, మరి కొందరు మాత్రం యధావిధిగా విమర్శలు చేస్తున్నారు. పొలం పనులు చేసి వీరి బట్టలకు బురద కొట్టుకున్న నేపథ్యంలో మీరు నిజంగానే పని చేశారా? లేకుంటే ఫోటోలు కోసం బురద కొట్టుకున్నారా? అంటూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ మాత్రం ప్రైజ్ మనీ పంచకపోవడంతో తరచూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే తాను చెప్పిన విధంగానే తనకొచ్చిన ప్రైజ్ మనీ అందరికీ హెల్ప్ చేశానని కాకపోతే వారి విన్నపం మేరకు నేను వీడియోలు తీసుకోలేకపోయాను అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
Also Read: Shivaji: డైరెక్టర్లకు శివాజీ కండీషన్… అది ఉంటేనే సినిమా చేస్తారట