Pooja Hegde Monica Song: ప్రముఖ స్టార్ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది పూజా హెగ్డే (Pooja Hegde). నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించిన ఈమె.. అల్లు అర్జున్ (Allu Arjun) ‘అల వైకుంఠపురం లో’ సినిమాతో మరింత పాపులారిటీ అందుకుంది. ఈ సినిమాలో బుట్టబొమ్మ పాటతో బుట్ట బొమ్మగానే పాపులారిటీ సంపాదించుకుంది. ఇక తర్వాత వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా కూడా ఈమెకు మంచి విజయాన్ని అందించింది. ఇకపోతే ఆ తర్వాత కాలంలో పూజా హెగ్డే నటించిన సినిమాలు ఏవి కూడా పెద్దగా విజయాన్ని అందించలేదు. దీనికి తోడు ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది.
ప్రస్తుతం తెలుగులో ఆఫర్లు అందుకోలేకపోతున్న ఈమె.. తమిళ్ సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది. అందులో భాగంగానే సూర్యతో ‘రెట్రో’ మూవీ చేసి ఫ్లాప్ ను మూటగట్టుకుంది. దీంతో ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా సిద్ధమైంది. అందులో భాగంగానే రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో “మోనిక” అనే స్పెషల్ సాంగ్ చేసి సోషల్ మీడియాను ఊపేసింది. అన్ని సామాజిక మాధ్యమాలలో కూడా ఈ పాట ట్రెండ్ అవుతోంది. లోకేష్ కనకరాజు (Lokesh kanagaraj)దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రజనీకాంత్ హీరోగా.. శృతిహాసన్ (Shruti Haasan), అమీర్ ఖాన్ (Aamir Khan), ఉపేంద్ర(Upendra ) , నాగార్జున (Nagarjuna) కీలక పాత్రలు పోషిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా నుండి మోనిక అనే పాటను విడుదల చేయగా.. ఇందులో పూజా హెగ్డే స్పెషల్ గా స్టెప్పులేసింది. పోర్ట్ ఏరియాలో గ్రూప్ డాన్స్ గా సాగిన ఈ పాటలో అటు మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా పూజా హెగ్డే మాస్ స్టెప్పులకు అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఇక అంతా బాగానే ఉన్నా ఇప్పుడు ఈ గ్రూపు డాన్స్ లో.. చివర్లో మలయాళం డాన్సర్ వేసిన స్టెప్స్ పూజా హెగ్డేనే డామినేట్ చేస్తున్నాయని పలువురు నెటిజన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. మలయాళం డాన్సర్ సౌబిన్ షాహిర్ (Soubin Sahir) ఈ గ్రూప్ సాంగులో పూజా హెగ్డే తో కలిసి మాస్ స్టెప్పులతో ఇరగదీసేశారు. ఇక ఈ పాట చూసిన నెటిజన్స్ రకరకాలుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఒక అభిమాని సౌబిన్ ప్రదర్శన పై స్పందిస్తూ.. “ఆ సిగ్గుపడే వ్యక్తి చివరకు డాన్స్ ఫ్లోర్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు.. పాటే మరింత హైలెట్ గా నిలిచింది” అని కామెంట్ చేశారు.
When that shy guy finally decides to hit the dance floor 🔥 #SoubinShahir #Monica pic.twitter.com/IgbkIe0NRq
— స్థితప్రజ్ఞుడు (@hellochaitu) July 11, 2025
మరొక వ్యక్తి సౌబిన్ ప్రదర్శన ఊహించనిది.. ఇతడు ఆడియన్స్ మనసును దొంగలించాడు.. త్వరలో సౌబిన్ ప్రదర్శన ఐజీ రీల్స్ లో ట్రెండ్ అవుతుంది అంటూ ట్వీట్ చేశాడు.
Soubin dance asala unexpected
Pooja is good but Soubin rocked it.#Monica pic.twitter.com/sEwTtbIkPH— Prudhvi (@PrudhviV12) July 11, 2025
మరొక నెటిజన్ సౌబిన్ ఇరగదీసేశాడు.. ఇలాంటి పర్ఫామెన్స్ ఇతడి నుంచి నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ తెలిపారు. అలా ఇప్పుడు ఈ మలయాళ డాన్సర్ పై ప్రశంసలు వెళ్లి వెత్తుతున్నాయి. మొత్తానికైతే ఈ పాటతో సౌబిన్ పేరు కూడా భారీగా పాపులారిటీ సొంతం చేసుకుంటుందని చెప్పవచ్చు.
Soubin Shahir's dance stunned me. Definitely out of the syllabus. Never seen him dancing with this much energy. 🔥#Monica #Coolie pic.twitter.com/ByptYB0Ezp
— George 🍿🎥 (@georgeviews) July 11, 2025
also read:DON 3: డాన్3లో విలన్ గా రౌడీ హీరో.. తప్పుకున్నారా లేక తప్పించారా?