E-Paper
Advertisement

మహాకాళి నుండి బిగ్ అప్డేట్.. మాస్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్!

మహాకాళి నుండి బిగ్ అప్డేట్.. మాస్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్!
Advertisement

Mahakali Movie:ప్రశాంత్ వర్మ(Prashanth Varma).. అద్భుతమైన సినిమాటిక్ విజన్ తో ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్గా సంచలనం సృష్టించిన ఈయన గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ‘హనుమాన్’ చిత్రంతో దేశవ్యాప్తంగా మంచి పేరు ఘడించిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ ను సరికొత్త కథలతో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నారు. అందులో భాగంగానే ‘జై హనుమాన్’ సినిమాతో పాటు ‘మహాకాళి’ అనే మరో భారీ ప్రాజెక్టును కూడా పట్టాలెక్కిస్తున్నారు.. ఇండియన్ మూవీ హిస్టరీ లోనే తొలిసారి ఫిమేల్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మహాకాళి మూవీ నుండి ఇప్పటివరకు సూపర్ హీరో కేటగిరీలో ఉన్న పురుషుల ఆధిపత్యానికి చెక్ పెడుతూ కాళీ దేవి ప్రేరణతో స్త్రీ శక్తిని చాలా శక్తివంతంగా చూపించబోతున్నారు.

మహాకాళి నుండి బిగ్ అప్డేట్..

ముఖ్యంగా ప్రశాంత్ వర్మ అనగానే ఆయన సినిమాలకు ఒక ప్రత్యేకమైన మార్క్ ఉంది. ఇప్పుడు స్త్రీ శక్తిని అత్యంత శక్తివంతంగా చూపించడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుండగా తాజాగా మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. “అంతం మొదలు కాబోతోంది” అంటూ ఆగస్టు 24వ తేదీన మహాకాళి మూవీ నుండి మాస్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. తాజాగా విడుదల చేసిన ఈ అప్డేట్ అభిమానులలో అంచనాలు పెంచేస్తోంది.

Advertisement

ALSO READ:ఇది కదా అసలు మజా.. అగ్నిపరీక్షలో ఏకంగా జపాన్ వ్యక్తి!

అసురుల గురువుగా అక్షయ్ ఖన్నా..

మరోవైపు ఇందులో శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా (Akshay Khanna) నటిస్తున్నట్లు ఆయన ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు.. కెమెరా ముందు శుక్రాచార్యుడి గెటప్ లో చాలా అద్భుతంగా అక్షయ్ కన్నా ఒదిగిపోయారని చెప్పవచ్చు. ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది.

ప్రేక్షకులకు మైండ్ బ్లాకింగ్ ఎక్స్పీరియన్స్..

Advertisement

ఈ చిత్రానికి పూజ అపర్ణ కొల్లు దర్శకత్వం వహిస్తూ ఉండగా.. ప్రశాంత్ వర్మ సొంతంగా కథను అందిస్తున్నారు. మిస్టరీ సూపర్ హీరో ఎలిమెంట్స్ ఆధ్యాత్మికతతో కలగలిపి ప్రేక్షకులకు ఒక మంచి మైండ్ బ్లాకింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ప్రశాంత్ వర్మ సిద్ధం అయిపోయారు. ఇందులో భూమి శెట్టి, రోహిత్ సెరాఫ్ , అక్షయ్ కన్నా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా వర్సటైల్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అక్షయ్ కన్నా.. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు పాత్రలో సరికొత్త గెటప్ లో కనిపించేసరికి అందరూ ఆయన లేటెస్ట్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఆర్కేడి బ్యానర్ పై రియాజ్ రమేష్ దుగ్గల్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా భాషల్లో విడుదల..

హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఈ మహాకాళి చిత్రాన్ని కూడా పాన్ ఇండియా భాషలలో విడుదల చేయబోతున్నారు. తెలుగు తో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి మహాకాళి నుండి రాబోయే ఫస్ట్ గ్లింప్స్ ఆగస్టు 24న ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

 

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×