E-Paper
Advertisement

ఇది కదా అసలు మజా.. అగ్నిపరీక్షలో ఏకంగా జపాన్ వ్యక్తి!

ఇది కదా అసలు మజా.. అగ్నిపరీక్షలో ఏకంగా జపాన్ వ్యక్తి!
Advertisement

Agni Pariksha 2: వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్.. ఇండియాలో తొలిసారి హిందీలో మొదలై.. నేడు పాన్ ఇండియా భాషలలో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతోంది.. ముఖ్యంగా ఒకరితో ఒకరికి సంబంధం లేకపోయినా ఎవరికి ఎవరు పరిచయం కాకపోయినా గుర్తు తెలియని వ్యక్తుల మధ్య ఒకే ఇంట్లో 100 రోజులపాటు ఉండాల్సి ఉంటుంది. ఇక అలాంటి క్లిష్టతరమైన ఈ షో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతోంది . మిగతా భాషల బిగ్ బాస్ షోలతో పోల్చుకుంటే తెలుగులో సామాన్యులకు పెద్దపీట వేస్తున్నారు. అలా ఇప్పటికే బిగ్ బాస్ పలు సీజన్లలో సందడి చేయగా.. గత సీజన్ నుంచి అగ్నిపరీక్ష అంటూ ఒక కొత్త షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాలన్న ఎంతోమంది సామాన్యుల కలలను సహకారం చేయడానికి అగ్ని పరీక్ష వేదికగా మారింది. బిగ్ బాస్ సీజన్ 9 కి అగ్నిపరీక్ష ఎంతగానో దోహదపడింది. పైగా ఈ అగ్నిపరీక్ష ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన కామన్ మ్యాన్ ఏకంగా టైటిల్ కొట్టి అందరిని ఆశ్చర్యపరిచారు.

బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 లో జపాన్ వ్యక్తి..

అందులో భాగంగానే బిగ్ బాస్ సీజన్ 10కి కూడా అగ్నిపరీక్షలు సీజన్ 2 కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ అగ్ని పరీక్ష సీజన్ 2 కోసం 25 వేలకు పైగా దరఖాస్తులు రాగా, అందులో 70 మందిని ఎంపిక చేశారు. ఆ 70 మందిలో 15 మందిని ఎంపిక చేసి.. ఆ 15 మందిని స్టేజ్ పైకి తీసుకొస్తారు. అందులో ఆరుగురిని మాత్రమే హౌస్ లోకి పంపిస్తారు. ఇకపోతే కామన్ క్యాటగిరిలో దరఖాస్తు చేసుకున్న వారిలో యూట్యూబర్స్, కంటెంట్ క్రియేటర్స్, సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. అయితే ఈసారి అగ్నిపరీక్ష సీజన్ 2 లో కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా ఒక జపాన్ వ్యక్తి తెలుగు నేర్చుకొని మరి బిగ్బాస్ అగ్ని పరీక్షలో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా ఆయన ఎంట్రీ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Advertisement

ALSO READ:ఈడీ అధికారుల ఎదుట నిధి అగర్వాల్.. ఆ ప్రశ్నలు అడగనున్నారా?

15 మందిలో స్థానం సంపాదించుకుంటారా?

లేటెస్ట్ ప్రోమో విడుదల చేయగా.. అందులో జపాన్, సిజౌకా నుంచి ఫూట అనే ఒక జపాన్ వ్యక్తి స్టేజ్ పై దర్శనం ఇచ్చారు. నా పేరు ఫూటా.. నేను జపాన్ ,టోక్యో నుంచి వచ్చాను అని అతను తనను తాను పరిచయం చేసుకున్నారు. ఇక జ్యూరీ మెంబర్ బిందు మాధవి మాట్లాడుతూ.. మీ ప్రొఫెషన్ ఏంటి అని అడగగా.. నేను మ్యూజిషియన్ అంటూ అక్కడే తన టాలెంట్ను ప్రదర్శించాడు. ఇకపోతే ప్రస్తుతం 15 మంది జాబితాలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇతను సిద్ధంగా ఉన్నారు. మరి ఆ 15 మందిలో ఇతడిని ఎంపిక చేస్తారా? లేదా తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే.

Advertisement

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×