BigTV English

SYG Shooting: హమ్మయ్యా.. షూట్ స్టార్ట్ అయింది… బాలీవుడ్ స్టార్‌ని ఢీ కొడుతున్న సుప్రీం హీరో

SYG Shooting: హమ్మయ్యా.. షూట్ స్టార్ట్ అయింది… బాలీవుడ్ స్టార్‌ని ఢీ కొడుతున్న సుప్రీం హీరో

Sambarala Yetigattu Shooting Update: సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ హీరోగా కొత్త డైరెక్టర్ రోహిత్ కేపీ దర్శకత్వంలో పాన్ ఇండియ ప్రాజెక్ట్ రూపొందుతోన్న చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’(ఎస్‌వైజీ).  విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని సాయి దుర్గా తేజ్ సింగిల్ గా వస్తున్న చిత్రమిది. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఇందులో ఈ మెగా హీరో లుక్, మేకోవర్ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తోంది. ఈ సినిమా కోసం సాయి దుర్గా తేజ్.. బీస్ట్ మోడ్ లోకి వచ్చాడు. దీంతో ఈ సినిమా ఈ సుప్రీం హీరో పూర్తి స్థాయి యాక్షన్ తో ప్రేక్షకులను అలరించబోతున్నాడని తెలుస్తోంది.


ఒక్క పోస్ట్ తో పుకార్లకు చెక్

అయితే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఈనెల సెప్టెంబర్ 25న ఫిక్స్ చేసి ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. కనీసం షూటింగ్ పై కూడా క్లారిటీ లేదు. దీంతో సంబరాల ఏటిగట్టు మూవీ షూటింగ్ ఆగిపోయిందని, ఈ సినిమా బడ్జెట్ మించిపోయిందని, నిర్మాతలు చేతులెత్తాశారంటూ ప్రచారం జరిగింది. బడ్జెట్ మించడంతో షూటింగ్ ని హోల్డ్ లో పెట్టారట. దీంతో ఇక మూవీ ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. ముందుగా రూ.120 కోట్లు అనుకున్న బడ్జెట్.. ఆ తర్వాత రూ. 180 కోట్లకు పైగా అవుతుందట. దీంతో సినిమా చేయాలా వద్దా డైలామాలో ఉన్నారు. కానీ మెగా హీరో సినిమా కావడంతో రిస్క్ చేసి సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. దీంతో ఇప్పుడు షూటింగ్ మళ్లీ స్టార్ట్ చేశారు. ఈ మేరకు మూవీ టీం ప్రకటన ఇచ్చింది.

చివరి దశకు షూటింగ్..

‘ప్రస్తుతం ఎస్ వైసీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ముందుకు వెళ్తుంది అంటూ మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు. ‘సంబరాల ఏటిగట్టి షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ నెల మధ్యలో యాక్షన్స్ సీక్వెన్స్ కి సంబంధించిన కీలక సన్నివేశాల షూటింగ్ జరగనుంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హైన్ డిజైన్ చేసిన ఈ యాక్షన్ సీక్వెన్స్ ఈ సుప్రీం హీరో ప్రముఖ బాలీవుడ్ స్టార్ తో తలపడున్నాడు’ అంటూ క్రేజీ అప్డేట్ వదిలింది మూవీ టీం. అంతేకాదు ఈ సందర్భంగా రిలీజ్ చేసిన సాయి దుర్గా తేజ్ పోస్టర్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది.


ఇందులో ఫుల్ బీస్ట్ మోడ్ లో కనిపించాడు సుప్రీం హీరో. వెనకాల మంటలు.. కింద దెబ్బలు తిని పడిపోయిన విలన్స్ కనిపించారు. ఈ సినిమాలో యాక్షన్స్ సీక్వెన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో ఈ పోస్టర్ చూస్తే అర్థమైపోతుంది. ప్రస్తుతం సాయిదుర్గా తేజ్ లేటెస్ట్ లుక్ మూవీ పై విపరీతమైన బజ్ పెంచుతోంది.ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం కారణంగా సెప్టెంబర్ 25 నుంచి వాయిదా పడనుందట. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.

Also Read: Teja Sajja: మరోసారి మహేష్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసిన తేజ సజ్జా.. మిరాయ్ పై ప్రభావం పడనుందా?

Related News

Telugu Film Industry: ఒంటరైన ఆడియో సంస్థ అధినేత… ఆ ఇద్దరు బడా ప్రొడ్యూసర్లతో పూర్తిగా చెడిందా ?

Mouli: నీ లైఫ్ లో ఏమి అచీవ్మెంట్స్ రా బాబు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డు కొట్టావు, ఇప్పుడు సక్సెస్ మీట్ కి ఫేవరెట్ హీరో

Megastar Chiranjeevi : ఏంటి బాసు ఇప్పటికీ నీ గ్రేసు, కొంపదీసి టైం ట్రావెల్ మిషన్ దొరికిందా?

The Conjuring-Last Rites: హర్రర్ సీన్స్ వస్తుంటే జోకులు.. ‘కంజూరింగ్’ మూవీ థియేటర్‌లో కొట్టుకున్న జంటలు!

Sree Vishnu : శ్రీ విష్ణు కామ్రేడ్ అవతారం… కామెడీ చేసుకోకుండా ఇవన్నీ ఎందుకో?

Sharwanand : చేసినవి కొన్ని.. చేయాల్సినవి మరిన్ని… దిక్కుతోచని స్థితిలో శర్వా

×