E-Paper
Advertisement

AAA ఓపెనింగ్.. ఆ సిటీపై బన్నీ మమకారం.. మరో దుబాయ్ కానుందా?

AAA ఓపెనింగ్.. ఆ సిటీపై బన్నీ మమకారం.. మరో దుబాయ్ కానుందా?
Advertisement

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఒకవైపు సినిమాలతో తన పేరును అంతర్జాతీయ స్థాయిలో వినిపించడానికి ప్రయత్నం చేస్తూనే.. మరొకవైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విస్తరిస్తున్నారు. అందులో భాగంగానే విశాఖపట్నం వేదికగా సినీ ప్రియులకు ఊహించని వినోద కానుకను అందించారు అల్లు అర్జున్. ప్రముఖ వ్యాపారవేత్త ఏసియన్ సునీల్ కాంబినేషన్లో అత్యాధునిక సాంకేతికతో నిర్మించిన “AAA సినిమాస్” మల్టీప్లెక్స్ ను అల్లు అర్జున్ స్వయంగా ప్రారంభించారు. విశాఖపట్నంలోని ఇన్ ఆర్బిట్ మాల్ ప్రాంగణంలో కొలువుదీరిన ఈ మల్టీప్లెక్స్ గ్రాండ్ లాంచ్ వేడుకకు అభిమానుల కోలాహాలాలు , హర్షద్వానాల మధ్య అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

వైజాగ్ సిటీపై మమకారం చాటుకున్న అల్లు అర్జున్..

అల్లు అర్జున్ మాట్లాడుతూ..” విశాఖపట్నం నాకు ఎంతో ఇష్టమైన నగరం. నా సినీ ప్రస్థానంతో నగరానికి విడదీయరాని బంధం ఉంది. నా తొలి చిత్రం గంగోత్రి షూటింగ్ సమయంలో ఈ వీధుల్లో నడిచినప్పుడు నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు. కానీ ఈరోజు ఇక్కడ అడుగు పెడితే అభిమానుల ఆప్యాయతతో నడవలేనంత ప్రేమ నాకు లభిస్తోంది. ఆ రోజుల్లో ఈ నగరంలో ఒక భారీ మాల్ వస్తుందని, అందులో నా సొంత ప్రెస్టేజియస్ మల్టీప్లెక్స్ అందుబాటులోకి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఇదొక డ్రీమ్ కం ట్రూ మోమెంట్..

మరో దుబాయ్ లాగా పెరగాలి – అల్లు అర్జున్

Advertisement

ప్రస్తుతం విశాఖపట్నం రోజురోజుకు పెరుగుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. నాకు ఇష్టమైన ఊరు ఇది. ఇంటర్నేషనల్ లెవెల్ లో పెరగాలి. ఒక దుబాయ్ లాగా.. ఒక బిగ్ సిటీ లాగా పెరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైజాగ్ ప్రజలు ఎప్పుడూ నన్ను దీవించారు .. దీవిస్తారు కూడా” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్.

భారతదేశంలో ఎక్కడా లేని కొత్త టెక్నాలజీతో ఈ మాల్ ప్రారంభించాం – అల్లు అర్జున్

ఇకపోతే ఇదే వేదికపై బన్నీ మాట్లాడుతూ మాల్ ప్రాధాన్యత గురించి ఆయన ఈ విధంగా చెప్పుకొచ్చారు.” కేవలం వాణిజ్య సముదాయం మాత్రమే కాదు నగర సంస్కృతిలో భాగం.. చెన్నైలో నేను పెరిగిన రోజుల్లో మాల్స్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వైజాగ్ ప్రజలకు, కుటుంబాలకు, యువతకు ఈ ఇన్ ఆర్బిట్ మాల్ ఎన్నో మంచి జ్ఞాపకాలను అందిస్తుందని భావిస్తున్నాను. ఈ ప్రాజెక్టు భారత దేశంలో ఎక్కడా లేని వినోద టెక్నాలజీని వైజాగ్ ప్రేక్షకుల కోసం తీసుకొచ్చామని చాలా గర్వంగా చెబుతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

also read:కొరియన్ కనకరాజు వెనుక వరుణ్ కష్టం.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్!

వైల్డ్ ఫైర్ అంటూ నామకరణం..

ఇకపోతే ప్రత్యేకంగా రూపొందించిన స్క్రీన్ కి “వైల్డ్ ఫైర్” అని నామకరణం చేసినట్లు అల్లు అర్జున్ తెలిపారు. ఈ మల్టీప్లెక్స్ కేవలం సినిమాలు చూసే థియేటర్ లాగా కాకుండా ప్రతి ఒక్కరికి జీవితాంతం గుర్తుండిపోయే అద్భుతమైన అనుభూతులను అందించే వేదికగా నిలుస్తుందని, అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని కోరుకుంటున్నాను అంటూ వైజాగ్ ప్రజలకు, తనను ఆదరించే అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు అల్లు అర్జున్.

Related News

కొరియన్ కనకరాజు వెనుక వరుణ్ కష్టం.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్!

స్టేజ్ పైనే ప్రముఖ నటికి లిప్ కిస్ ఇచ్చిన అభిమాని.. వీడియో వైరల్!

ఆస్తులతోపాటు దానధర్మాలు కూడా.. మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామాలివే!

4K లేజర్, డాల్బీ అట్మాస్.. వైజాగ్‌ AAA సినిమాస్ ప్రత్యేకతలు చూస్తే మతిపోవాల్సిందే!

తప్పు ఒప్పుకున్న అజయ్ భూపతి.. జయకృష్ణ విషయంలో అన్యాయం!

ఇండియన్ సినిమా అంటే నేనే కాదు.. యశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

అందరికీ నో చెప్పే నయన్.. యశ్ అడగ్గానే అందుకు ఓకే చెప్పిందట.. ‘టాక్సిక్’ ఈవెంట్‌ లో సర్‌ప్రైజ్!

Big Stories

Advertisement
×