Nutan Prasad: దివంగత నటులు నూతన ప్రసాద్ (Nutan Prasad) తెలుగు సినీ ఇండస్ట్రీలో సుమారుగా 365కు పైగా చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు. కమెడియన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గానే కాకుండా టీవీ వ్యాఖ్యాతగా కూడా పేరు దక్కించుకున్నారు. అలాంటి ఈయన నేడు మన మధ్య లేకపోయినా ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరో తాజాగా ఆయనను గుర్తు చేసుకుంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మేము నూతన ప్రసాద్ ఇంట్లో మామిడికాయలను దొంగతనం చేసాము అంటూ ఆ స్టార్ హీరో చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
స్టార్ హీరో ఎవరో కాదు సూర్య (Suriya).. తాజాగా హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్.. మమిత బైజు (Mamitha baiju) హీరోయిన్గా నటిస్తోంది.ఇందులో 40 ఏళ్ల ఒలంపిక్ షూటర్ సంజయ్ విశ్వనాథ్ పాత్రలో సూర్య నటిస్తున్నారు.. వెంకీ అట్లూరి(Venky atluri) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో .. గతంలో ఆయన మాట్లాడిన మాటల తాలూకా వీడియో మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
also read:డ్యాన్సర్స్ అసోసియేషన్స్ లో ఉప ఎన్నికల ఫలితాలు.. చిరంజీవి మాటని కూడా లెక్క చేయని వైనం!
సూర్య నటించిన వీరభద్రుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హోస్ట్గా వ్యవహరించిన యాంకర్ సుమ కనకాల (Suma kanakala) అడిగిన ప్రశ్నకు సూర్య మాట్లాడుతూ.. “మా పక్క ఇంట్లో నూతన ప్రసాద్ గారు ఉండేవారు. వాళ్ల ఇంటి పెరటిలో పెద్ద మామిడి చెట్టు ఉండేది. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్లు మధ్యాహ్నం నిద్రపోతున్న సమయంలో గోడ ఎక్కి వాళ్ళ ఇంటి పెరటిలోకి దూకి.. మామిడికాయలు దొంగతనం చేసేవాళ్లం. అయితే గోడ ఎక్కడానికి నా తమ్ముడు కార్తీ సహాయం చేసేవాడు. అయితే వెళ్లిన ప్రతిసారి కేవలం ఒక మామిడిపండు మాత్రమే మేము దొంగతనం చేసే వాళ్ళం. అయితే ఆ మామిడిపండు కోసం ఇద్దరం కిందపడి దొర్లి మరీ గొడవపడే వాళ్ళం. ఎవరు ఎక్కువ తినాలి అని” అంటూ నాటి రోజులను సరదాగా గుర్తు చేసుకున్నారు హీరో సూర్య. ప్రస్తుతం సూర్య చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. వారి చిన్ననాటి జ్ఞాపకాలు అభిమానుల హృదయాలకు తాకుతున్నాయి.
ఇదిలా ఉండగా సూర్య తాజాగా నటిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ విషయానికి వస్తే..వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యా హీరోగా మమితా బైజు హీరోయిన్ గా కుటుంబ ప్రేమ కథ చిత్రంగా రాబోతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 14వ తేదీన రాబోతున్న ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, నాజర్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ట్రైలర్ విడుదలవగా విశేష స్పందన సొంతం చేసుకుంది. మరి సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.