E-Paper
Advertisement

స్టేజ్ పైనే ప్రముఖ నటికి లిప్ కిస్ ఇచ్చిన అభిమాని.. వీడియో వైరల్!

స్టేజ్ పైనే ప్రముఖ నటికి లిప్ కిస్ ఇచ్చిన అభిమాని.. వీడియో వైరల్!
Advertisement

Actress: సాధారణంగా సెలబ్రిటీలు బయట లేదా ఏదైనా ఈవెంట్లో కనిపించినప్పుడు సెలబ్రెటీలు వారితో ఫోటోలు దిగడానికి కరచాలనం చేయడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక నటి ఇటీవల ఒక ఈవెంట్ కి హాజరవ్వగా.. అందులో రెడ్ కార్పెట్ పై ఫోటోలకు ఫోజులిస్తున్న సమయంలో ఆమెతో ఫోటో దిగడానికి ఒక అభిమాని వచ్చారు. సెల్ఫీ అడగడంతో ఆ నటి కూడా చాలా సౌకర్యంగానే ఫీల్ అయింది. అలా ఫోటోలు తీసుకుంటున్న సమయంలో ఆ అభిమాని ఏకంగా ఆమెకు లిప్ కిస్ ఇవ్వడం సంచలనంగా మారింది. ముఖ్యంగా ఆ నటి సదరు అభిమానిని తోసే ప్రయత్నం చేసినా.. ఆ అభిమాని ఆగకుండా లిప్ కిస్ చేస్తూ రెచ్చిపోయింది. దీంతో ఒక వ్యక్తి వచ్చి ఆ అభిమానిని పక్కకు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

రెడ్ కార్పెట్ పై ప్రముఖ నటికి అభిమాని లిప్ కిస్..

ఆ నటి ఎవరో కాదు నికితా రావల్ (Nikita Rawal).. ఇటీవల రెడ్ కార్పెట్ పై ఫోటోలకు ఫోజులిస్తున్న సమయంలో ఒక మహిళ అభిమాని ఆమె వద్దకు వచ్చి సెల్ఫీ అడిగింది. ఆ సంభాషణ సమయంలో నికితా చాలా సౌకర్యంగానే కనిపించింది. అలాగే ఫోటోగ్రాఫర్లు వీరిద్దరిని ఫోటో తీస్తుండగా.. నికిత కూడా సదరు లేడీ అభిమానితో సౌకర్యంగా ఇష్టపూర్వకంగానే ఫోజులిచ్చింది. అయితే ఆ అభిమాని కాస్త చనువుగా నికిత చెంపపై ముద్దు పెట్టింది. ఆ తర్వాత ఆమె పెదవులపై ముద్దు పెట్టుకోవడానికి దగ్గరకు లాక్కోవడంతో నికిత వెంటనే ఇబ్బంది ఫీలయ్యింది.

Advertisement

ALSO READ:ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న చెన్నై లవ్ స్టోరీ!

ఇబ్బందిగా ఫీలైనా వదలని వైనం..

ముఖ్యంగా ఈ ఆకస్మిక చర్యకు ఆశ్చర్యపోయిన నికిత.. ఆమెను ఆపడానికి ప్రయత్నించినా.. ఆమె మాత్రం వదల్లేదు. పైగా నికిత అక్కడ అసౌకర్యంగా ఫీల్ అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది కూడా. నికిత ఆమెను తోసేసినా సరే ఆమె మళ్ళీ చెంపపై ముద్దు పెట్టింది. ఇంతలోనే ఒక వ్యక్తి వచ్చి ఆ లేడీ అభిమానిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

నికితా రావల్ కెరియర్..

Advertisement

నికితా రావల్ విషయానికొస్తే.. హిందీతో పాటు సౌత్ సినిమాలలో నటించింది. బాలీవుడ్లో బ్లాక్ అండ్ వైట్, గరం మసాలా, ది హీరో -అభిమన్యు, మిస్టర్ హాట్ మిస్టర్ కూల్, అమ్మా కీ బోలీ, క్యూట్ కమీనా వంటి చిత్రాలలో నటించింది. 2012లో తొలిసారి తింపా అనే సినిమాలో విక్రమ్ రాయ్ సరసన ఇచ్ఛాదారి నాగినిగా అలరించింది. ఇక ఈమె అర్షద్ వార్షి , చుంకీ పాండేలతో కలిసి ‘రోటీ కప్డా ఔర్ రొమాన్స్’ అనే సినిమాలో నటిస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది నికితా రావల్.

Related News

ఆస్తులతోపాటు దానధర్మాలు కూడా.. మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామాలివే!

4K లేజర్, డాల్బీ అట్మాస్.. వైజాగ్‌ AAA సినిమాస్ ప్రత్యేకతలు చూస్తే మతిపోవాల్సిందే!

తప్పు ఒప్పుకున్న అజయ్ భూపతి.. జయకృష్ణ విషయంలో అన్యాయం!

ఇండియన్ సినిమా అంటే నేనే కాదు.. యశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

అందరికీ నో చెప్పే నయన్.. యశ్ అడగ్గానే అందుకు ఓకే చెప్పిందట.. ‘టాక్సిక్’ ఈవెంట్‌ లో సర్‌ప్రైజ్!

‘వారణాసి’ బర్త్ డే ట్రీట్ అదుర్స్.. ఏమున్నాడ్రాబాబు మహేష్..

‘వారణాసి’ కథ ఇదేనా.. మహేష్ సినిమా స్టోరీ లీక్?

Big Stories

Advertisement
×