E-Paper
Advertisement

డ్యాన్సర్స్ అసోసియేషన్స్ లో ఉప ఎన్నికల ఫలితాలు.. చిరంజీవి మాటని కూడా లెక్క చేయని వైనం!

డ్యాన్సర్స్ అసోసియేషన్స్ లో ఉప ఎన్నికల ఫలితాలు.. చిరంజీవి మాటని కూడా లెక్క చేయని వైనం!
Advertisement

Dancers association: గత కొంతకాలంగా తెలుగు ఇండస్ట్రీ డ్యాన్సర్ అసోసియేషన్లో నడుస్తున్న వివాదం రోజురోజుకు ముదురుతోంది. ముఖ్యంగా ఫిలిం ఫెడరేషన్, నిర్మాతల మండలి, టాలీవుడ్ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna) బరిలోకి దిగినా సరే.. లెక్కచేయకుండా డ్యాన్సర్ అసోసియేషన్లో ఉప ఎన్నికలు జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇకపోతే తెలుగు ఫిలిం, టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ లో ఉప ఎన్నికలు జరగగా వాటి ఫలితాలు ఇలా ఉన్నాయి.

డ్యాన్సర్స్ అసోసియేషన్లో ఉప ఎన్నికల ఫలితాలు..

మొత్తం 600 మంది సభ్యులు ఉన్న అసోసియేషన్ లో 502 మందికి మాత్రమే ఓటు హక్కు ఉంది.అందులో కేవలం 116 మంది మాత్రమే ఈ ఉప ఎన్నికలలో పాల్గొన్నారు. పైగా 114 ఓట్లు పోల్ అవగా.. వాటిలో రెండు ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. అందులో మొత్తం 10 స్థానాలకు ఈ ఉప ఎన్నికలు జరగగా.. కొన్ని పదవులు ఏకగ్రీవంగా నిర్ణయించబడ్డాయి.

ఉపాధ్యక్షులుగా..

Advertisement

G. శంకర్ (కార్డు నెం. 53), జాయింట్ సెక్రటరీగా P. నాగ మల్లేశ్వర్ రావు (కార్డు నెం. 481), ఆర్గనైజింగ్ సెక్రటరీగా G. రవితేజ (బన్ని) (కార్డు నెం. 481) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

also read:బిగ్ బాస్ 10లోకి మరో జబర్దస్త్ కమెడియన్.. దశావతారంలో ఈ సడన్ ట్విస్ట్ ఏంటి?

కమిటీ సభ్యులుగా..

Advertisement

P. కన్నయ్య (కార్డు నెం. 177), M. రమేష్ (చరణ్) (కార్డు నెం. 500), M. రాములు (కార్డు నెం. 531), B. వెంకన్న (కార్డు నెం. 415) ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.

ప్రధాన కార్యదర్శి పదవికి జరిగిన పోటీలో G. బాలకృష్ణ (బాలు. G) (కార్డు నెం. 426) 68 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థి B. శ్రీనివాస్ గౌడ్ (లడ్డు శ్రీను) (కార్డు నెం. 77) 23 ఓట్లు పొందారు.

కోశాధికారి పదవికి జరిగిన ఎన్నికల్లో P. ఇశ్రాయేలు (తడివేలు) (కార్డు నెం. 212) 79 ఓట్లు సాధించి, 34 ఓట్లు పొందిన G. వీరస్వామిపై 45 ఓట్ల తేడాతో గెలుపొందారు.

మహిళా కమిటీ సభ్యుల విభాగంలో K. నిరంజని (కార్డు నెం. 234) 79 ఓట్లు, CH. సాయి లక్ష్మి (కార్డు నెం. 325) 65 ఓట్లు సాధించి విజేతలుగా నిలిచారు. T. శ్రావణ సంధ్య (కార్డు నెం. 389) 59 ఓట్లు పొందారు.

ఈ ఉప ఎన్నికల ఫలితాలను కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ (పదవీ విరమణ పొందిన), న్యాయ సలహాదారు వి. సామ్రాట్ అశోక్ కుమార్ అధికారికంగా ప్రకటించారు.

ఇండస్ట్రీ పెద్దల మాటలు పెడచెవిన పెట్టారా?

ఇకపోతే ఈ ఉప ఎన్నికలు వద్దు అని మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ, ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ , ఫిలిం ఫెడరేషన్ చెప్పినా.. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత వినలేదు. అయితే వాళ్లు వద్దన్నా సరే సుమలత ఈ ఉప ఎన్నికలు నిర్వహించడంతో శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, భాను మాస్టర్ లు ఈ ఉప ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఇకపోతే ఉప ఎలక్షన్స్ లో సుమారుగా 300 మంది డ్యాన్సర్స్ దూరంగా ఉండటమే కాకుండా ఫెడరేషన్ కౌన్సిల్ కి అసోసియేషన్ డ్యాన్సర్లు ఫిర్యాదు చేయనున్నారు. ఏది ఏమైనా మెగాస్టార్ చిరంజీవి , బాలకృష్ణ లాంటి దిగ్గజాలు కూడా వద్దని చెప్పినా సుమలత ఉప ఎన్నికలు నిర్వహించడం పై సర్వత్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. దీనికి ఆమె ఏ విధంగా సమాధానం చెబుతుందో చూడాలి అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Related News

ఐబొమ్మ రవికి సగం రిలీఫ్.. అసలు ట్విస్ట్ రూ.3 కోట్ల దగ్గరే!

రూ.100 కోట్ల డీల్.. దిల్ రాజు మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడా?

కింగ్ ఖాన్ కి భారీ షాక్.. రూ.2490 కోట్లు గోవిందా!

గణపతి పండగే.. కాని రాత్రి 11కి డీజేలు ఏంటి బాబోయ్! రేణు దేశాయ్ ఫైర్

బాలయ్య భామను చూస్తే చూపు తిప్పుకోలేం.. ఏం అందమో!

నమ్మండి.. సాయం చేశా, ఇదిగో ప్రూఫ్.. పాపం సాయి ధరమ్ తేజ్!

ఆ సినిమా చేసి తప్పు చేసాను.. సదా అవకాశాలు కోల్పోవడానికి అదే కారణమా?

ప్యారడైజ్‌లో కేసీఆర్‌.. చూసి షాకవుతున్న ఆడియన్స్!

Big Stories

Advertisement
×