Maheshbabu:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న మహేష్ బాబు(Mahesh Babu) పుట్టినరోజు నేడు. ఆగస్టు 9న తన పుట్టినరోజును జరుపుకుంటున్న నేపథ్యంలో పలువురు సినీ సెలబ్రిటీలు, మహేష్ బాబు అభిమానులు, ఆయన నటిస్తున్న చిత్ర బృందం ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబుకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆయన సంపాదన, దానధర్మాలతో పాటు ఆయన దత్తత తీసుకున్న గ్రామాల వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.
వరుస సినిమాలతో దూసుకుపోతూ.. మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ.. ఇటు సినిమాలు, అటు బ్రాండ్ అండార్స్మెంట్స్ తో పాటు రియల్ ఎస్టేట్ , మల్టీప్లెక్స్ రంగాలలో పెట్టుబడులు పెడుతూ ఆస్తులను పెంపొందించుకుంటున్న మహేష్ బాబు.. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో సుమారుగా రూ.28 కోట్ల విలువైన ఖరీదైన ఇంటిని సొంతం చేసుకున్నారు. ఈ ఇంట్లో స్విమ్మింగ్ పూల్, జిమ్, ఓపెన్ గార్డెన్, విశాలమైన లివింగ్ ఏరియాలు ఉన్నాయట. మరొకవైపు ప్రైవేటు జెట్ కూడా కలిగి ఉన్నారు. ఇక అంతేకాదు రూ.6.2 కోట్ల విలువైన కారవాన్ కూడా ఈయన సొంతం.
ALSO READ:తప్పు ఒప్పుకున్న అజయ్ భూపతి.. జయకృష్ణ విషయంలో అన్యాయం!
సినిమాలలో నటిస్తూనే తన భార్య నమ్రతా శిరోద్కర్ తో కలసి జీఎంబీ ఎంటర్టైన్మెంట్ ను స్థాపించారు. సినిమా నిర్మాణమే కాకుండా మెన్స్ వేర్ క్లాతింగ్ బ్రాండ్, ఏఎంబి సినిమాస్ అనే మల్టీ ఫ్లెక్స్ వ్యాపారం కూడా ఉంది. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్లను ఆయన సొంతం చేసుకున్నారు. ఒక్కో సినిమాకు రూ.60 నుండి రూ.80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈయన.. తన ఆస్తుల విలువ సుమారుగా రూ.600 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఇకపోతే ప్రస్తుత ఆయన నటిస్తున్న వారణాసి సినిమాకి రెమ్యూనరేషన్ తో పాటు సినిమా లాభాలలో వాటా కూడా తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మహేష్ బాబు తన సంపాదనలో సుమారుగా 30% వరకు దానధర్మాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు, గ్రామాల దత్తత అలాగే ప్రకృతి విపత్తుల సమయంలో భారీ విరాళాలు అందిస్తూ ఎంతోమందికి ప్రాణదానం చేస్తున్నారు. చిన్నారుల ప్రాణాలు రక్షించడం కోసం మహేష్ బాబు ఫౌండేషన్, ఆంధ్ర హాస్పిటల్స్ సహకారంతో పుట్టుకతో గుండె జబ్బులు ఉన్న వేలాది మంది పేద పిల్లలకు ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు. అలాగే హీల్ ఏ చైల్డ్ ఫౌండేషన్తో కలిసి అనేక వైద్య సహాయ కార్యక్రమాలను అందిస్తున్నారు
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లోని బుర్రిపాలెం తో పాటు తెలంగాణలోని మల్లెమడుగు గ్రామాలను మహేష్ బాబు దత్తత తీసుకున్నారు. ఈ గ్రామాలలో డిజిటల్ పాఠశాలలు, మౌలిక వసతులు, తాగునీరు, డ్రైనేజీ రోడ్ల నిర్మాణాలకు నిధులు సమకూర్చడం వంటివి చేస్తూ ఆ గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఇకపోతే తెలుగు రాష్ట్రాలలో వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధికి కోట్లల్లో విరాళాలు అందజేసే మహేష్ బాబు.. కరోనా సమయంలో సినీ కార్మికులకు, నిరుపేదలకు, అత్యవసర సరుకులు ఆర్థిక సహాయం అందించి గొప్ప మనసు చాటుకున్నారు.