E-Paper
Advertisement

కొరియన్ కనకరాజు వెనుక వరుణ్ కష్టం.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్!

కొరియన్ కనకరాజు వెనుక వరుణ్ కష్టం.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్!
Advertisement

Nagababu: ప్రముఖ డైరెక్టర్ మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా, ప్రముఖ నటి రితికా నాయక్ (Rithika Naik) హీరోయిన్ గా, ప్రముఖ కమెడియన్ సత్యా (Sathya) కీలక పాత్రల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కొరియన్ కనకరాజు (Korean kanakaraju). గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ కి ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది.

బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న కొరియన్ కనకరాజు..

ప్రస్తుతం ఎక్కడ చూసినా మంచి మౌత్ టాక్ రావడం.. పైగా పాజిటివ్ రివ్యూలు పడడంతో సినిమాకి ఆదరణ మరింత పెరుగుతోంది. అటు బుక్ మై షో లో భారీగా టికెట్లు అమ్ముడుపోతుండగా.. అదనపు థియేటర్లు, అదనపు షోల కారణంగా కలెక్షన్స్ భారీగా పెరిగిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ కలుపుకొని రెండు రోజుల్లోనే రూ.23 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి దూసుకుపోతోంది.

ఐదేళ్ల నిరీక్షణ తర్వాత వరుణ్ కెరియర్ లో తొలి సక్సెస్..

Advertisement

వరుస కలెక్షన్లతో ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న నేపథ్యంలో ఇటీవలే నాగబాబు (Nagababu) కూడా థియేటర్లలో అభిమానులతో సహా ఈ సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా సినిమా అనంతరం ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వరుణ్ పడ్డ కష్టాన్ని అభిమానులతో పంచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ” వరుణ్.. గత ఐదు సంవత్సరాలుగా నిన్ను నేను మౌనంగా గమనిస్తూనే వచ్చాను. నువ్వు ఎదుర్కొన్న నిరాశలు, అనుభవించిన బాధ నాకు తెలుసు.. వరుస ఓటములు పలకరించినా.. పరీక్షించే వైఫల్యాలు ఎన్నో ఎదురైనా.. నీ ప్రయాణాన్ని, ప్రయత్నాన్ని నువ్వు ఎప్పుడూ ఆపలేదు. మనసులోని బాధను బయటకు చెప్పకపోయినా.. అది నిన్ను ఎంతగా గాయపరిచిందో తండ్రిగా నాకు బాగా తెలుసు. మనిద్దరి మధ్య మాటలు లేకపోయినా ఒకరినొకరం ఓదార్చుకునే వాళ్ళం. నీలోని పట్టుదల, ఓర్పును నేను నిరంతరం చూసాను. సుమారుగా 5 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం తర్వాత ఈరోజు తిరుగులేని బ్లాక్ బాస్టర్ విజయం నిన్ను వరించింది.

also read:స్టేజ్ పైనే ప్రముఖ నటికి లిప్ కిస్ ఇచ్చిన అభిమాని.. వీడియో వైరల్!

నీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది – నాగబాబు..

Advertisement

మొత్తం ఈ విజయం క్రెడిట్ పూర్తిగా నీ కష్టానికి దక్కుతుంది. ఓటమి బాధ్యత ఏదైతే పూర్తిగా నీదో.. గెలుపు బాధ్యత కూడా నీదే.. నిన్ను చూస్తుంటే తండ్రిగా చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా ఈ చిత్రాన్ని నమ్మి ఇంతటి ఘన విజయాన్ని అందించిన దర్శకుడు మేర్లపాక గాంధీ , సత్య, రితిక నాయక్, సంగీత దర్శకుడు తమన్, నిర్మాత రాజీవ్ లకు, సాంకేతిక బృందానికి నా హృదయపూర్వక ఆశీస్సులు.. ఇది నీ క్షణం నాన్న.. నువ్వు ఇలాగే మెరుస్తూ ఉండు” అంటూ వరుణ్ పడ్డ కష్టాన్ని ఒక తండ్రిగా చెప్పుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు నాగబాబు. ప్రస్తుతం నాగబాబు షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వరుణ్ తేజ్ ఇంత కష్టపడ్డారా? అంటూ ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తానికి అయితే వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇండో కొరియన్ కామెడీ హారర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కరిని విపరీతంగా అలరిస్తోంది.

Related News

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

నాని కెరీర్‌లోనే బిగ్ రిలీజ్.. ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ లెక్కలు ఇవే!

అబ్బబ్బా.. ఖుషీ కపూర్ ఏంటి ఈ లుక్! ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్

కోమల్ నుదుటిపై సింధూరం.. గోవిందా సీక్రెట్ మ్యారేజ్ నిజమేనా?

నాని ‘ది ప్యారడైజ్’కి చిరంజీవి సపోర్ట్.. మెగా స్టార్ పోస్ట్ వైరల్

అక్కినేని కోడలు క్రేజ్ మాములుగా లేదుగా… ఏకంగా

జానీ మాస్టర్ భార్య పై దాడి..పోలీసులను ఆశ్రయించిన సుమలత!

నాని ‘ప్యారడైజ్’కి తొలిరోజే రూ.100 కోట్లా?ఆశకు హద్దుండాలి గురూ !

Big Stories

Advertisement
×