E-Paper
Advertisement

తప్పు ఒప్పుకున్న అజయ్ భూపతి.. జయకృష్ణ విషయంలో అన్యాయం!

తప్పు ఒప్పుకున్న అజయ్ భూపతి.. జయకృష్ణ విషయంలో అన్యాయం!
Advertisement

Ajay Bhupathi:టాలీవుడ్ దివంగత సూపర్ స్టార్ కృష్ణ (Krishna) మనవడిగా, దివంగత నటుడు రమేష్ బాబు (Ramesh Babu) వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు జయకృష్ణ (Jaya Krishna) . సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ప్రోత్సాహంతో ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో.. జయకృష్ణ తన తొలి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు..’ శ్రీనివాస మంగాపురం’ అంటూ ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో బాలీవుడ్ నటి రవీనా టాండన్ (Raveena Tandon) కుమార్తె రాషా తడానీ (Rasha Thadani) కూడా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది.

విడుదలకు ముందు భారీ హైప్.. కానీ డిజాస్టర్..

పైగా ఈ సినిమా విడుదలకు ముందు టీజర్ , ట్రైలర్, పాటలతో మంచి బజ్ క్రియేట్ చేశారు. అటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఈ కథలో కీలకమవడంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. కానీ ఈ సినిమా విడుదల తర్వాత ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. జయకృష్ణ , రాషా ఇద్దరూ కూడా తమ నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నప్పటికీ. ఆశించిన స్థాయిలో ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. పైగా మోహన్ బాబు(Mohan Babu) లాంటి దిగ్గజ నటీనటులు కూడా ఈ సినిమాను సక్సెస్ దిశగా నడిపించలేకపోయారు అనే కామెంట్లు కూడా వ్యక్తమయ్యాయి. అలా ఈ సినిమా తొలి రోజే మిశ్రమ స్పందన సొంతం చేసుకోవడంతో వసూళ్ల పరంగా ఏమాత్రం రాబట్టుకోలేకపోయింది.

తప్పంతా నాదే అంటున్న అజయ్ భూపతి..

Advertisement

పైగా ఘట్టమనేని వారసుడు ఎంట్రీకి సరైన ఫ్లాట్ ఫామ్ లభించలేదు అనే కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రముఖ డైరెక్టర్ అజయ్ భూపతి (Ajay Bhupathi) తన ఎక్స్ వేదికగా ఒక ఎమోషనల్ నోట్ పంచుకున్నారు. చిత్ర వైఫల్యానికి క్రెడిట్ మొత్తం నాదే అంటూ ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎమోషనల్ పోస్ట్ వైరల్..

అజయ్ భూపతి తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా.. “శ్రీనివాస మంగాపురం చిత్రం నా హృదయానికి ఎంతో దగ్గరగా నిలిచిన చిత్రం. ఈ సినిమా ప్రయాణంలో నాకు ఎన్నో అద్భుతమైన అనుభవాలు, మరిచిపోలేని జ్ఞాపకాలు లభించాయి. డెబ్యూ హీరో జయకృష్ణ , రాషా లతో కలిసి పనిచేస్తున్నప్పుడు వారు కొత్తవారు అనే భావన నాలో కలగలేదు . ఇద్దరు కూడా తమ వంతు శ్రమకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు. వైజయంతి మూవీస్ అశ్వినీ దత్ గారితో కలిసి పనిచేయడం చాలా గర్వంగా ఉంది. అలాగే నిర్మాత జెమినీ కిరణ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.

Advertisement

also read: క్రేజీ లుక్ .. కిర్రాక్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న టాక్సిక్ బ్యూటీ!

శ్రీనివాస మంగాపురం పరాజయానికి బాధ్యత నాదే – అజయ్ భూపతి

ముఖ్యంగా ఈ సినిమా ఫలితానికి సంబంధించిన పూర్తి బాధ్యతను నేను స్వీకరిస్తున్నాను. ఈ పరాజయాన్ని పాఠంగా తీసుకొని త్వరలో మళ్లీ మీ ముందుకు వస్తాను. మీ అందరిని తప్పకుండా మెప్పించే ఒక గొప్ప చిత్రంతో తిరిగి వస్తానని మాట ఇస్తున్నాను. ఈ ప్రయాణంలో నా వెంట నిలిచిన నటీనటులు, నిర్మాతలు, చిత్ర బృందం, సాంకేతిక నిపుణులందరికీ కూడా కృతజ్ఞతలు” అంటూ తెలియజేశారు మొత్తానికైతే తన పరాజయాన్ని ఓపెన్ గా అంగీకరించిన అజయ్ భూపతి .. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మంగళవారం సీక్వెల్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది.

Related News

4K లేజర్, డాల్బీ అట్మాస్.. వైజాగ్‌ AAA సినిమాస్ ప్రత్యేకతలు చూస్తే మతిపోవాల్సిందే!

ఇండియన్ సినిమా అంటే నేనే కాదు.. యశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

అందరికీ నో చెప్పే నయన్.. యశ్ అడగ్గానే అందుకు ఓకే చెప్పిందట.. ‘టాక్సిక్’ ఈవెంట్‌ లో సర్‌ప్రైజ్!

‘వారణాసి’ బర్త్ డే ట్రీట్ అదుర్స్.. ఏమున్నాడ్రాబాబు మహేష్..

‘వారణాసి’ కథ ఇదేనా.. మహేష్ సినిమా స్టోరీ లీక్?

అమ్మతో బాండింగ్‌పై జేసన్ కామెంట్స్…కొడుకు కోసమైనా కలుస్తారా ?

నయన్ పొగడ్తలు.. జనాల సెటైర్లు.. ఏ భాషలో సినిమా చేస్తే ఆ హీరోనే తోపా?

Big Stories

Advertisement
×