BigTV English

OTT Movie’s: ఘాటీ, మదరాసి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie’s: ఘాటీ, మదరాసి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie’s: సాధారణంగా ఏ సినిమా అయినా సరే థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అటు సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఇదే ఒప్పందం మీద హక్కులను దక్కించుకుంటూ ఉంటాయి. కానీ కొన్ని కొన్ని కారణాలవల్ల అనుకొని సందర్భాలలో థియేటర్లలో విడుదలైన నెలలోపే ఓటీటీ లోకి వచ్చిన చిత్రాలు కూడా ఉన్నాయి.


ఒకే వేదికపై మధురాసి, ఘాటీ

ఇదిలా ఉండగా సెప్టెంబర్ 5వ తేదీన విడుదలైన మదరాసి , ఘాటీ చిత్రాలకు సంబంధించి ఓటీటీ హక్కులను ఒకే ప్లాట్ఫామ్ దక్కించుకుందని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. రెండు బడా చిత్రాల కోసం రెండు వేరువేరు ప్లాట్ఫామ్స్ ను సబ్స్క్రిప్షన్ పొందాల్సిన అవసరం లేకుండా ఓకే వేదికపై రెండు సినిమాలు చూడవచ్చు అని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..మరి ఈ రెండు చిత్రాల ఓటీటీ హక్కులను ఏ ప్లాట్ఫామ్ సొంతం చేసుకుందో ఇప్పుడు చూద్దాం.

అనుష్క ఘాటీ ఓటీటీ..


అనుష్క.. చివరిగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. చాలా రోజుల తర్వాత ఫిమేల్ సెంట్రిక్ మూవీగా ‘ఘాటీ’ అంటూ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి(Krish jagarlamudi) దర్శకత్వంలో క్రైమ్ రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో అనుష్క తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్, అనుష్క యాక్టింగ్ కి ప్రశంసలు కురుస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది అని సమాచారం. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాతనే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక త్వరలోనే డేట్ పై కూడా క్లారిటీ రానుంది అని సమాచారం.

also read:Little hearts: రిలీజ్ అయిన ఒక్క రోజులోనే… రికార్డు క్రియేట్ చేసిన లిటిల్ హార్ట్స్!

శివ కార్తికేయన్ మదరాసి ఓటీటీ..

ఏ.ఆర్.మురగదాస్ (AR Muragadas) దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) హీరోగా నటించిన చిత్రం మదరాసి. ఈ చిత్రం కూడా సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించగా.. బిజూ మీనన్, విద్యుత్ జమ్వాల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మాత్రం శివ కార్తికేయన్ ఇమేజ్ కి తగ్గట్టుగా పడలేదు అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా హక్కులను కూడా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదలైంది. కాబట్టి అక్టోబర్ ఐదు తర్వాత లేదా దసరా సందర్భంగా ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇలా ఈ రెండు చిత్రాలు కూడా ఒకే ఫ్లాట్ ఫామ్ పై స్ట్రీమింగ్ కి సిద్ధం కాబోతున్నాయని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related News

OTT Movie : పిచ్చి అమ్మాయిలను కిరాతకంగా అనుభవించే సైకో డాక్టర్… బ్లాక్ మార్కెట్ లో బాడీ పార్ట్స్… భయంకరమైన రియల్ స్టోరీ సామీ

OTT Movie : ముసలోడే కానీ మహానుభావుడు… ఆడవాళ్లు కన్పిస్తే అదే పని… అవార్డు విన్నింగ్ మలయాళ మూవీ

OTT Movie : పని మనిషితో ఇంటి ఓనర్ రాసలీలలు… క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న హర్రర్ మూవీ

OTT Movie : నల్ల క్యాబ్ లో నరకానికి పంపే దెయ్యం… గర్భిణులను టార్గెట్ చేసి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని మూవీ

OTT Movie : దొంగతనానికి వెళ్లి దిక్కుమాలిన పని… వీడియో తీస్తూ దారుణంగా… విష్ణు ప్రియ ఇలాంటి పాత్రలోనా ?

Big Stories

×