BigTV English

OTT Movie : కూతురితో పాడు పని… తండ్రి మర్డర్ కు మరొకడితో కలిసి తల్లి మాస్టర్ ప్లాన్… కిర్రాక్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : కూతురితో పాడు పని… తండ్రి మర్డర్ కు మరొకడితో కలిసి తల్లి మాస్టర్ ప్లాన్… కిర్రాక్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : కరీనా కపూర్ నటించిన ఒక థ్రిల్లర్ మూవీ ఓటీటీ మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఆమె ఒక సింగిల్ మదర్ గా, ఒక హత్య కేసును ఎదుర్కునే క్రమంలో ఈ స్టోరీ నడుస్తుంది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అతిపెద్ద ఓపెనింగ్ వీకెండ్ వ్యూస్ రికార్డును బద్దలు కొట్టింది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

ఈ బాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘జానే జాన్’ (Jaane Jaan). 2023 లో వచ్చిన ఈ సినిమాకి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. ఇది జపనీస్ రచయిత కీగో హిగషినో రాసిన 2005 నవల “ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ X” ఆధారంగా రూపొందింది. ఈ సినిమాలో కరీనా కపూర్ , జైదీప్ అహ్లావత్, విజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో 2023 సెప్టెంబర్ 21 విడుదలైంది. ఈ సినిమా 2024 ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డ్స్‌లో 8 నామినేషన్లను సాధించి, బెస్ట్ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ (క్రిటిక్స్), బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్) ఫర్ అహ్లావత్, బెస్ట్ యాక్ట్రెస్ ఫర్ కపూర్ ఖాన్ అవార్డులను గెలుచుకుంది. 2 గంటల 19 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDb లో 7.0/10 రేటింగ్ ఉంది.


.స్టోరీలోకి వెళితే

మాయా డి’సౌజా (కరీనా కపూర్ ఖాన్) కలింపాంగ్‌లో తన 14 ఏళ్ల కుమార్తె తారా (నైషా ఖన్నా)తో కలిసి ఒక చిన్న కేఫ్ “టిఫిన్” నడుపుతూ ఒక సాధారణ జీవితం గడుపుతుంది. ఆమె ఒకప్పుడు సోనియాగా, ఒక దుర్మార్గపు పోలీసు అధికారి అజిత్ మ్హాత్రే (సౌరభ్ సచ్‌దేవ) భార్యగా ఉండేది. ఆమె 14 సంవత్సరాల క్రితం అతని నుండి పారిపోయి, కలింపాంగ్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. మాయా ఒక మాజీ నైట్‌క్లబ్ డాన్సర్. ఆమె గత జీవితంలో ఎన్నో చూసింది. ఇప్పుడు ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉంటుంది. ఆమె పొరుగువాడు నరేన్ వ్యాస్ (జైదీప్ అహ్లావత్) ఒక రిటైర్డ్ గణిత ఉపాధ్యాయుడు. మాయాపై ప్రేమను కలిగి ఉంటాడు. అతను ప్రతిరోజూ ఆమె కేఫ్‌లో భోజనం కొనుగోలు చేస్తూ, ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ అతని మొహమాటం వల్ల ఈ విషయం ఎటూ తేలకుండా ఉంటుంది.

ఒక రోజు అజిత్ అనూహ్యంగా మాయా జీవితంలోకి తిరిగి ప్రవేశిస్తాడు. ఆమె నుండి డబ్బు డిమాండ్ చేస్తూ, ఆమెను, తారాను బెదిరిస్తాడు. ఒక సమయంలో అతనితో గొడవ పడుతూ మాయా, తారా అనుకోకుండా ఒక ఇమ్మర్షన్ హీటర్ కార్డుతో గొంతు పిసికి అజిత్‌ను చంపేస్తారు. ఈ హత్యను కప్పిపుచ్చడానికి, నరేన్ ఒక ప్రణాళికను రూపొందిస్తాడు. అతను మాయా, తారాను సినిమా హాల్ కు పంపి, అతను అజిత్ శవాన్ని దాచిపెడతాడు. ముంబై నుండి ఇన్స్‌పెక్టర్ కరణ్ ఆనంద్ (విజయ్ వర్మ) అనే ఒక చమత్కారమైన పోలీసు అధికారి, అజిత్‌ను కలవడానికి కలింపాంగ్‌కు వస్తాడు. అతను కనిపించకపోవడంతో మాయాను అనుమానిస్తాడు.

కానీ నరేన్ తెలివైన ప్రణాళికలు అతన్ని తప్పుదారి పట్టిస్తాయి. నరేన్ ఒక అనామక వ్యక్తిని హత్య చేసి, అతని శరీరాన్ని అజిత్‌గా చిత్రీకరిస్తూ, దానిని కాల్చి అజిత్ ID బట్టలను దానిపై ఉంచుతాడు. ఆ తరువాత పోలీసులు అది అజిత్ శవమని నమ్ముతారు. మాయా, తారా హత్య జరిగిన రోజు అక్కడ లేనట్లు నరేన్ జాగ్రత్తపడతాడు. అయితే క్లైమాక్స్‌లో కరణ్ మాయాను అరెస్టు చేయడానికి సిద్ధమవుతాడు. కానీ నరేన్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి, అజిత్‌ను తానే చంపినట్లు లొంగిపోతాడు. ఈ షాకింగ్ ట్విస్ట్ తో అందరికీ మైండ్ బ్లాక్ అవుతుంది. చివరికి నరేన్ జైలుకు వెళ్తాడా ? మాయాకి నరేన్ ప్రేమిస్తున్న సంగతి తెలుస్తుందా ? కరణ్ దీనిని ఎలా హ్యాండిల్ చేస్తాడు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : పని మనిషిగా వచ్చి ఇదేం పాడు పని రోబో పాపా… ఏఐ పేరు వింటేనే వణికిపోయే మూవీ

Related News

OTT Movie : హైస్కూల్ అమ్మాయిల వెంటపడే పిశాచి… ఈ మూవీని చూడాలంటే హనుమాన్ చాలీసా పక్కనుండాల్సిందే

OTT Movie : ఎనిమీతోనే బెడ్ షేర్ చేసుకునే అరాచకం… అల్టిమేట్ డేర్… ట్విస్టులతో పిచ్చెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : ఆ రూమ్ లోకి అడుగు పెడితే రెచ్చిపోయే అమ్మాయిలు… ప్రాణాంతకమైన ఉచ్చులోకి లాగే మిస్టరీ… స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : నెక్స్ట్ డోర్ క్రైమ్స్… ప్రతీ మర్డర్ కేసులో ఊహించని టర్నులు, ట్విస్టులు… నరాలు తెగే ఉత్కంఠ

OTT Movie : హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి అరాచకం… ఆ సీన్లే హైలెట్ భయ్యా… దిమాక్ కరాబ్ క్లైమాక్స్

OTT Movie : రియాలిటీ షోలో ఛాన్స్… ఎంత మోసం చేస్తే అంత డబ్బు… ప్రతీ 5 నిమిషాలకు ట్విస్ట్ ఉన్న థ్రిల్లర్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ను మరిపించే డేంజరస్ సర్వైవల్ గేమ్… కాన్సెప్ట్ వేరు గానీ కథ మాత్రం నెక్స్ట్ లెవెల్

OTT Movie : స్కూలుకెళ్లే వయసులో సుద్దపూస పనులు… నెక్స్ట్ ట్విస్ట్ మెంటల్ మాస్ .. క్లైమాక్స్ హైలెట్ మావా

Big Stories

×