Sai Pallavi:ఇండియన్ హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆధ్యాత్మిక ఇతిహాస కావ్యం ‘రామాయణ’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అందరి చూపు ఈ సినిమా పైనే. నితీష్ తివారీ (Nitesh Tiwari)!దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో సాయి పల్లవి (Sai Pallavi) సీతాదేవి పాత్ర పోషిస్తోంది. ఈ పాత్రను తాను సాధించుకోలేదని.. ఆ సీతమ్మే తనను ఎంచుకుందని.. ఇటీవల జరిగిన ‘ప్రథమ్ సంకల్ప్’ వేడుకలో కన్నీటి పర్యంతమయ్యింది. ఈ సందర్భంగా రెండు భాగాలుగా వచ్చే ఈ సినిమా కోసం ఆమె ఎంత పారితోషకం తీసుకుంటోంది? అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సాయి పల్లవి.. నేచురల్ హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి పేరు సొంతం చేసుకున్న ఈమె కమర్షియల్ హంగులకు ప్రాధాన్యత ఇవ్వకుండా.. పాత్రలోని లోతును బట్టి ప్రాజెక్టులను పెంచుకుంటూ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకట్టుకుంది . ముఖ్యంగా పాత్ర నచ్చకపోతే ఎదుట ఉన్న వ్యక్తి ఎవరు అని కూడా ఆలోచించకుండా నిర్మొహమాటంగా వదిలేసుకునే గుణం ఆమెది. ఆ గుణమే ఆమెను ఇప్పుడు అగ్రస్థానానికి చేర్చింది అనడంలో సందేహం లేదు. అలాంటి సాయి పల్లవి తొలిసారి హిందీ రామాయణ మూవీ లో నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో రూ.4వేల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) శ్రీరాముడిగా, కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) రావణాసురుడిగా నటిస్తున్నారు.
అలాగే శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ (Kajal Agarwal ) నటిస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం.. ఈ ఏడాది దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఇటీవల న్యూఢిల్లీలో ఎంతో వైభవంగా జరిగిన ‘ప్రథమ్ సంకల్ప్’ వేడుకలో ఈ సినిమా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈనెల 24వ తేదీన అన్ని భాషలలో ట్రైలర్ ని రిలీజ్ చేస్తారని అనుకున్నప్పటికీ.. ఆ విడుదల తేదీని వాయిదా వేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత ప్రకటించారు.
also read:ఆదర్శకుటుంబం.. వెంకీ మామ ఎంట్రీ సీన్ రిలీజ్, ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఇదిలా ఉండగా.. నటనకే తొలిపీఠం వేసే సాయి పల్లవి.. ఇప్పుడు పారితోషకం విషయంలో బాలీవుడ్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. రామాయణ రెండు భాగాల కోసం ఆమె ఏకంగా రూ.20 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. అంటే ఒక్కో భాగానికి ఏకంగా రూ.10 కోట్లు చొప్పున రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది చిత్రసీమలో హీరోయిన్లకు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ లభించడం ఇది అత్యంత అరుదైన విషయం గా చెప్పుకోవచ్చు. ఇకపోతే టాలీవుడ్ లో ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత ఎంసీఏ, లవ్ స్టోరీ , పడి పడి లేచే మనసు, విరాటపర్వం , శ్యాం సింగరాయ్ వంటి చిత్రాలలో నటించింది. చివరిగా తండేల్ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు రామాయణ చిత్రంలో నటిస్తోంది.