Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లో తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఘటాల్ గ్రామ సమీపంలో ట్రాక్టర్‌ను కంటైనర్ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 8మంది మృతి చెందగా, 45మంది గాయపడ్డారు. కాస్గంజ్ జిల్లాలోని 60మంది భక్తులు ట్రాక్టర్‌లో ప్రయాణిస్తుండగా వెనక నుంచి వచ్చిన కంటైనర్ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాదంలో బోల్తా పడిన ట్రాక్టర్‌ను అధికారులు క్రేన్ సహాయంతో తొలగించారు.
ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన కంటైనర్ ట్రక్కు ,బోల్తా పడిన ట్రాక్టర్
ఈ ఘటన అలీగఢ్ సరిహద్దు సమీపంలో రాత్రి 2:15 గంటల సమయంలో జరిగిందని బులంద్‌షహర్ ఎస్ఎస్‌పీ దినేష్ కుమార్ సింగ్ తెలిపారు. వెనుక నుంచి వస్తున్న కంటైనర్ ట్రక్కు ఢీకొట్టడంతో.. ఒక్కసారిగా ట్రాక్టర్ బోల్తా పడింది.ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 60 మంది ఉన్నారు. వారు కాస్గంజ్ జిల్లాలోని రఫత్‌పూర్ గ్రామం నుండి రాజస్థాన్‌లోని జహర్‌పీర్‌కు తీర్థయాత్ర కోసం ప్రయాణిస్తున్నారిని దినెష్ తెలిపారు.
Also Read: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. గణేష్, దుర్గా మండపాలకు ఉచిత విద్యుత్..
8మంది మృతి,45మందికి తీవ్ర గాయాలు
మృతులు ట్రాక్టర్ డ్రైవర్ బాబు(40), రాంబేటి(65), చాందిని(12), ఘనిరామ్(40), శివాంష్(6), యోగేష్(50), వినోద్(45)గా గుర్తించారు.. వీరు అందరూ కాస్గంజ్ జిల్లా నివాసితులుగా తెలిపారు. అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో 45 మంది చికిత్స పొందుతున్నారు.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.