Sarath Kumar About Chiranjeevi Help: మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. మెగా ఫ్యాన్స్ అంతా ఆయన పుట్టిన వేడుక సంబరాల్లో మునిగితేలుతున్నారు. మరోవైపు దర్శక-నిర్మాతల ఆయన సినిమాలకు సంబంధించి సాలీడ్ అప్‌డేట్స్ వదిలే బిజీగా ఉన్నారు. ఈసారి మెగా ఫ్యాన్స్‌కి పండగే పండగ అని చెప్పాలి. చిరు సినిమాలకు సంబంధించి రేపు వరుస అప్‌డేట్స్ రానున్నాయి. ఆ హంగామా నేటి సాయంత్రం నుంచి మొదలు కానుంది. విశ్వంభర నుంచి ఇవాళ సాయంత్రం స్పెషల్ టీజర్ రాబోతోంది. ఇక రేపు అనిల్ రావిపూడి, చిరు టైటిల్ రివీల్ కానుంది. అలాగే ఆయన కొత్త సైన్ చేయబోతున్న చిత్రాల ప్రకటనలు రాబోతున్నాయి. ఇలా అభిమానులకు సాలీడ్ అప్‌డేట్స్ ఉండనున్నాయి.
ఎన్నో సేవ కార్యక్రమాలు..
చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఆయన సినిమాలే కాదు.. ఆయన చేసిన సేవ కార్యక్రమాలు, సహాయాలను కూడా ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. గతంలో ఆయన అందించిన సేవలు, కష్టాల్లో ఉన్న నటీనటులను ఆయన ఆదుకున్న సంఘటలను గుర్తు చేస్తూ వీడియోలు రీషేర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో ప్రముఖ నటుడు శరత్ కుమార్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా సాయం చేశారో స్వయంగా ఆయన చెప్పిన పాత వీడియోని ఆయన బర్త్‌డే సందర్భంగా గుర్తు చేసుకుని ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. ఇందులో శరత కుమార్ చిరు చేసిన సాయాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. కష్టాల్లో చిరంజీవి పెద్దన్నగా తనకు అండగా ఉన్నారని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న పాత వీడియో మరోసారి వైరల్ అవుతుంది.
నాకు రెమ్యునరేషన్ ఇస్తావారా?
ఈ వీడియో ఫ్యాన్స్, నెటిజన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో శరత్ కుమార్ మాట్లాడుతూ.. “ఒకానొక టైమ్‌లో నా కెరీర్‌లో డౌన్ ఫాల్ అయ్యాను. అప్పులు కూడా బాగా పెరిగిపోయాయి. ఆ సమయంలో ఒక నిర్మాత నా దగ్గరకు వచ్చి చిరంజీవిగారి డేట్స్ పట్టుకొస్తే.. ఆయనతో సినిమా తీసి వచ్చిన లాభాలతో మీ అప్పులు తీర్చుకునేలా సహాయం చేస్తానని చెప్పారు. అప్పుడు నాకు వేరే దారి లేదు. వెంటనే చిరంజీవిగారికి ఫోన్ చేసి మీతో పర్సనల్‌గా మాట్లాడాలని అన్నాను. వెంటనే ఆయన దగ్గరికి వెళ్లాను. ఆయన సినిమా చేస్తున్న సెట్‌కి వెళ్లాను. అప్పుడు ఓ ఫైట్ షూటింగ్‌లో ఉన్న ఆయన ఆ చిత్ర దర్శకనిర్మాతలను పిలిచి మళ్లీ ఈ షూట్ పెట్టుకుందాం.. శరత్ వచ్చాడు మాట్లాడాలి అని వచ్చేశారు. నాకు ప్రేమగా వడ్డించి, భోజనం చేసిన తర్వాత విషయం ఏమిటో చెప్పమని అడిగారు.
Also Read: Akhanda 2 Postponed: ఆ రూమర్సే నిజమయ్యాయి… అఖండ 2 వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే!
నీ డేట్స్ కావాలని చెప్పి.. ఆ నిర్మాత చెప్పిందంత చిరుకి చెప్పాను. వెంటనే ఆయన ప్రస్తుతం నేను చేస్తున్న సినిమా అవ్వగానే నీకే డేట్స్ ఇస్తాను. అన్ని ఏర్పాట్లు చేసుకోమన్నారు. మరి రెమ్యూనరేషన్ ఎంత ఇవ్వమంటావ్? అని అడిగా. నువ్వు నాకు రెమ్యూనరేషన్ ఇస్తావారా? అని కోపంగా అన్నారు. కష్టాల్లో ఉన్నానని చెప్పావ్‌గా.. నాకు రెమ్యూనరేషన్ వద్దు. నీకు డేట్స్ ఇస్తున్నాను.. అంతే.. అని చెప్పి నన్ను పంపించారు” అని శరత్ కుమార్ చెప్పుకొచ్చారు. ఈ వీడియో శరత్ కుమార్ పక్కన ఆయన భార్య రాధిక కూడా ఉన్నారు. చిరంజీవి చేసిన సాయం గురించి గుర్తు చేసుకుంటున్న సమయంలో శరత్ కుమార్ వెంటన మాటలు కూడా రాలేదు. అంత ఆయన ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్న ఈ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"ఏంట్రా! నువ్వు నాకు డబ్బులు ఇస్తావా?"
మెగాస్టార్ చిరంజీవిగారు చేసిన సాయం గురించి చెప్తూ కంట నీరు పెట్టుకున్నారు శరత్ కుమార్.@KChiruTweets ♥️♥️🎂🎂🎂 pic.twitter.com/2mlTNe7dk0
— Harish R. Menon (@27stories_) August 20, 2025