E-Paper
Advertisement

హోండా కొత్త ADV160 వచ్చేసింది.. E85 ఫ్యూయల్‌తో పరుగులు!

హోండా కొత్త ADV160 వచ్చేసింది.. E85 ఫ్యూయల్‌తో పరుగులు!
Advertisement

Honda ADV160 Launched: ఇండియన్ టూ వీలర్ మార్కెట్ లో అడ్వెంచర్ స్టైల్ స్కూటర్లకు మంచి ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హోండా తన కొత్త ADV160 స్కూటర్‌ ను భారత మార్కెట్‌ లోకి విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.70 లక్షలుగా నిర్ణయించారు. ఈ స్కూటర్ కోసం బుకింగ్‌ లు కూడా ప్రారంభమయ్యాయి. హోండా వెబ్‌ సైట్‌ తో పాటు రెడ్‌ వింగ్, బిగ్‌ వింగ్ షోరూమ్‌ లలో రూ. 5,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్నాయి.

భారత తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ స్కూటర్

హోండా ADV160లో ప్రధాన ఆకర్షణ ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ. ఇది E85 ఫ్యూయల్ తోనూ నడుస్తుంది. అంటే, పెట్రోల్‌తో పాటు అధిక శాతం ఇథనాల్ కలిసిన ఇంధనాన్ని కూడా ఉపయోగించే సామర్థ్యం ఉంది. నేపథ్యంలో భారత మార్కెట్‌ లో వచ్చిన తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ స్కూటర్‌గా ADV160 ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పర్యావరణానికి అనుకూలమైన ఇంధన వినియోగాన్ని పెంచే దిశగా హోండా తీసుకున్న కీలక అడుగుగా భావించవచ్చు.

160cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్

Advertisement

ADV160లో 156.93cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను అమర్చారు. ఈ స్కూటర్ పవర్, టార్క్‌ కు సంబంధించిన   వివరాలను హోండా ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. అయితే, విదేశీ మార్కెట్లలో అందుబాటులో ఉన్న మోడల్ సుమారు 16.3hp పవర్, 14.9Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.ఈ స్కూటర్‌ ను కేవలం సిటీ ప్రయాణాల కోసమే కాకుండా, అప్పుడప్పుడు లాంగ్ రైడ్‌ లకు కూడా ఉపయోగించుకునేలా రూపొందించారు.

అడ్వెంచర్ లుక్‌ తో ఆకట్టుకునే డిజైన్

ADV160కు సాధారణ స్కూటర్ల కంటే భిన్నమైన అడ్వెంచర్ స్టైల్ డిజైన్ ఇచ్చారు. ముందు భాగంలో ఆకట్టుకునే ఫ్రంట్ ఫేస్, ఎత్తైన విండ్‌స్క్రీన్, దృఢమైన బాడీ డిజైన్ దీనికి ప్రత్యేక లుక్‌ను ఇస్తాయి. సిటీ రైడింగ్‌ తో పాటు కాస్త భిన్నమైన స్టైలింగ్ కోరుకునే యువతను ఈ స్కూటర్ ఆకట్టుకునే అవకాశం ఉంది.  ఈ స్కూటర్‌ లో సీటు కింద 27 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉంది.  రోజువారీ అవసరాల కోసం వస్తువులు తీసుకెళ్లడానికి ఈ స్టోరేజ్ ఉపయోగపడుతుంది. అలాగే మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఛార్జ్ చేసుకోవడానికి USB ఛార్జింగ్ పోర్ట్ కూడా అందించారు.

TFT డిస్‌ ప్లే, ట్రాక్షన్ కంట్రోల్

Advertisement

హోండా ADV160లో 5 అంగుళాల కలర్ TFT డిస్‌ ప్లే ఉంది. ఇందులో హోండా రోడ్‌ సింక్ కనెక్టివిటీ కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో రైడర్‌ కు అవసరమైన సమాచారం మరింత సులభంగా కనిపిస్తుంది. భద్రత పరంగా హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్, సింగిల్ ఛానల్ ABS, డిస్క్ బ్రేకులు లాంటి ఫీచర్లు ఉన్నాయి. భారత మార్కెట్‌ లో ADV160కు హీరో జూమ్ 160, యమహా ఏరోక్స్ 155 వంటి స్కూటర్లు పోటీగా ఉంటాయి. అడ్వెంచర్ లుక్, ఆధునిక ఫీచర్లు, పెద్ద స్టోరేజ్‌తో పాటు కొత్త టెక్నాలజీ కావాలనుకునే వారికి హోండా ADV160 బెస్ట్ ఆప్షన్ కానుంది.

Read Also: హోండా రెబల్ 300 వచ్చేసింది, మెటియోర్ 350కి ఇక చుక్కలే!

Tags

Related News

హోండా రెబెల్ 500 వచ్చేస్తోంది, కొత్త ఫీచర్లు చూస్తే వారెవ్వా అనాల్సిందే!

ఫ్లిప్‌ కార్ట్‌ లోకి రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ.. ఇక ఇంట్లో నుంచే బుక్ చేసుకోవచ్చు!

టీవీఎస్ అపాచీ RTR 310లో కొత్త అప్‌డేట్.. ఫీచర్లు, ఇంజిన్, ధరలు ఎలా ఉన్నాయంటే?

లాంచ్‌కు ముందే లీకైన MG విండ్సర్ EV ఇండల్జ్ ఎడిషన్.. కొత్త ఫీచర్లు ఇవే!

భారత్‌ లో జపాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల జోరు.. 10 వేల యూనిట్లు దాటేసిన అమ్మకాలు!

బ్లాక్ లుక్‌లో టయోటా ఫార్చ్యూనర్.. కొత్త మోడల్ ఏముంది భయ్యా!

ఉద్యోగులకు BMW కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన లేడీ బాస్, అలా చూసి.. చలించిపోయి..

ఈవీలకు పెరుగుతున్న క్రేజ్.. కమర్షియల్ వెహికల్స్ మార్కెట్‌ ఏకంగా 158% జంప్!

Big Stories

Advertisement
×