E-Paper
Advertisement

హోండా రెబల్ 300 వచ్చేసింది, మెటియోర్ 350కి ఇక చుక్కలే!

హోండా రెబల్ 300 వచ్చేసింది, మెటియోర్ 350కి ఇక చుక్కలే!
Advertisement

Honda Rebel 300 Launch: హోండా నుంచి సరికొత్త రెబల్ 300 క్రూయిజర్ బైక్‌ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. బాబర్ స్టైల్ డిజైన్, 286cc ఇంజిన్, తక్కువ సీట్ ఎత్తు, E-క్లచ్ టెక్నాలజీ లాంటి ప్రత్యేకతలతో ఈ బైక్‌ను తీసుకొచ్చింది. సిటీ ప్రయాణాలతో పాటు వీకెండ్ రైడింగ్‌ ను ఇష్టపడేవారిని దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించారు.

ధర ఎంత అంటే?

హోండారెబల్  300కు సంబంధించి రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ వేరియంట్ ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ.2.22 లక్షలు. E-క్లచ్ వేరియంట్ ధర రూ.2.62 లక్షలు. అంటే E- క్లచ్  కోసం అదనంగా రూ.40,000 చెల్లించాలి. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ.5,000 చెల్లించి బైక్‌ ను బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2026 అక్టోబర్ మధ్య నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బైక్‌ను హోండా బిగ్ వింగ్ డీలర్‌ షిప్‌ల ద్వారా అమ్మనున్నారు.

బాబర్ లుక్‌ లో ఆకట్టుకునే డిజైన్

Advertisement

రెబల్ 300 చూడగానే ఇది సాధారణ క్రూయిజర్ కాదని అర్థమవుతుంది. తక్కువ ఎత్తులో ఉండే బాడీ, టియర్‌ డ్రాప్ లుక్ లోని ఫ్యూయల్ ట్యాంక్, బయటకు కనిపించే ఫ్రేమ్, బ్లాక్ ఫినిష్ మెకానికల్ పార్ట్స్‌ తో  బాబర్ లాంటి లుక్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో LED ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంప్ ఉంటుంది. ఇండియాలో ఈ బైక్ సిల్వర్, బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. దీని సీట్ హైట్ కేవలం 690 మిమీ. దీంతో పొట్టి రైడర్లు కూడా బైక్‌ను సులభంగా హ్యాండిల్ చేయవచ్చు. బైక్ బరువు సుమారు 170 కిలోలు. సిటీ ట్రాఫిక్‌ లోనూ, వీకెండ్ క్రూయిజింగ్‌ లోనూ సౌకర్యవంతంగా ఉండేలా రైడింగ్ పొజిషన్‌ను రూపొందించారు.

286cc ఇంజిన్.. 30 bhp పవర్

హోండా రెబల్ 300లో 286cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 30 bhp పవర్, 27.5 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ ను యాడ్ చేశారు. పూర్తి స్పోర్టీ పెర్ఫార్మెన్స్ కంటే స్మూత్ పవర్ డెలివరీ, రిలాక్స్‌డ్ రైడింగ్‌ కు హోండా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. అందువల్ల రోజువారీ వినియోగానికి కూడా ఈ బైక్ అనుకూలంగా ఉంటుంది.

అసలు హైలైట్ E-క్లచ్

Advertisement

రెబల్-300లో క్రేజీ ఫీచర్ హోండా E- క్లచ్. ఈ టెక్నాలజీ ద్వారా రైడర్ క్లచ్ లివర్‌ను ప్రతిసారీ ఆపరేట్ చేయకుండానే గేర్లు మార్చుకోవచ్చు. ముఖ్యంగా ట్రాఫిక్‌లో పదేపదే క్లచ్ నొక్కాల్సిన అవసరం లేకపోవడం వల్ల రైడింగ్ మరింత సౌకర్యంగా ఉంటుంది. అవసరమైనప్పుడు రైడర్ మాన్యువల్‌గా కూడా క్లచ్‌ను ఉపయోగించవచ్చు.

TFT డిస్‌ప్లే, కనెక్టివిటీ

బైక్‌లో రౌండ్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. దీనికి హోండా రోడ్ సింక్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా LED లైటింగ్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్, డ్యూయల్-ఛానల్ ABS, ముందు వెనుక డిస్క్ బ్రేకులు వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.

మెటియోర్ 350కి పోటీ

భారత్‌ లో హోండా రెబల్ 300 ప్రధానంగా రాయల్ ఎన్ ఫీల్డ్ మెటియోర్  350తో పోటీ పడనుంది. భిన్నమైన బాబర్ డిజైన్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, తక్కువ సీట్ హైట్, E-క్లచ్ లాంటి ఫీచర్లతో మార్కెట్ లో సత్తా చాటాలని హోండా చూస్తోంది. రూ.2.22 లక్షల ప్రారంభ ధరతో రెబల్ 300 ప్రీమియం క్రూయిజర్ సెగ్మెంట్‌ లో కొత్త ఆప్షన్‌గా మారనుంది.

Read Also: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. కొత్త టీవీస్ క్యూబ్ వచ్చేసింది!

Tags

Related News

హోండా రెబెల్ 500 వచ్చేస్తోంది, కొత్త ఫీచర్లు చూస్తే వారెవ్వా అనాల్సిందే!

ఫ్లిప్‌ కార్ట్‌ లోకి రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ.. ఇక ఇంట్లో నుంచే బుక్ చేసుకోవచ్చు!

టీవీఎస్ అపాచీ RTR 310లో కొత్త అప్‌డేట్.. ఫీచర్లు, ఇంజిన్, ధరలు ఎలా ఉన్నాయంటే?

లాంచ్‌కు ముందే లీకైన MG విండ్సర్ EV ఇండల్జ్ ఎడిషన్.. కొత్త ఫీచర్లు ఇవే!

భారత్‌ లో జపాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల జోరు.. 10 వేల యూనిట్లు దాటేసిన అమ్మకాలు!

బ్లాక్ లుక్‌లో టయోటా ఫార్చ్యూనర్.. కొత్త మోడల్ ఏముంది భయ్యా!

ఉద్యోగులకు BMW కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన లేడీ బాస్, అలా చూసి.. చలించిపోయి..

ఈవీలకు పెరుగుతున్న క్రేజ్.. కమర్షియల్ వెహికల్స్ మార్కెట్‌ ఏకంగా 158% జంప్!

Big Stories

Advertisement
×