Daksha Teaser: మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) వారసురాలు మంచు లక్ష్మీ (Manchu Lakshmi) దాదాపు 5 సంవత్సరాల తర్వాత వెండితెరపై కనిపించబోతోంది. ఈ క్రమంలోనే తన తండ్రితో కలిసి తాజాగా ఈమె దక్ష (ది డెడ్లీ కాన్సిఫరిసీ) అనే సినిమాలో నటిస్తోంది. ఈరోజు వినాయక చవితి కావడంతో ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. సుమారు నాలుగేళ్ల క్రితమే ‘అగ్ని నక్షత్రం’ పేరుతో మంచు లక్ష్మి ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ను మారుస్తూ దక్షగా రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ టీజర్ ప్రేక్షకులను మెప్పిస్తోంది.
ఐదేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మంచు లక్ష్మి..
ఇక ఇందులో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అదిరిపోయే లుక్కులో మంచు లక్ష్మీ గెటప్ అందరి దృష్టిని ఆకర్షించింది. యాక్షన్ సీన్స్ లో ఆమె అదరగొట్టిందని చెప్పవచ్చు. సెప్టెంబర్ 19వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై దాదాపు పదేళ్ల తర్వాత ఈ సినిమా విడుదల కాబోతోంది. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు, లక్ష్మీ ప్రసన్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు వంశీకృష్ణ మల్ల యాక్షన్ , క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు . ఇందులో మలయాళ నటుడు సిద్ధిక్, చైత్రా శుక్ల , సముద్రఖని, మోహన్ బాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
దక్ష టీజర్ ఎలా ఉందంటే?
టీజర్ విషయానికి వస్తే.. చాలా విచిత్రంగా చంపేశారు మేడం అనే డైలాగ్ తో ప్రారంభం అవుతుంది. వింత ఆకారంతో ఏలియన్ లా ఉండే ఒక వ్యక్తి ఈ దారుణానికి పాల్పడుతున్నాడు అంటూ టీజర్ లో చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ALSO READ:Film industry: కిడ్నాప్ కేసులో హీరోయిన్.. మరో ముగ్గురు అరెస్ట్!