Kingdom OTT Streaming: గణేష్ చతుర్థి సందర్భంగా విజయ్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చింది ప్రముఖ ఓటీటీ సంస్థ. సైలెంట్ గా కింగ్డమ్ మూవీని స్ట్రీమింగ్ కి ఇచ్చేసింది. కాగా విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచానాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది.
సైలెంట్ గా ఓటీటీలోకి..
ఈసారి విజయ్ కి బ్లాక్ బస్టర్ పక్కా అన్నట్టుగా విడుదలైన కింగ్డమ్.. ఆడియన్స్ ని కాస్తా నిరాశ పరిచింది. ఫలితంగా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. కానీ, విజయ్ నటన, పర్ఫామెన్స్, లుక్ పరంగా మాత్రం అభిమాలను మెప్పించింది. థియేటర్లలోలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న కింగ్డమ్ కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది. నిర్మాతలకు ఈ సినిమా నష్టాలనే ఇచ్చింది. ఇక థ్రియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నెల రోజుల ముందే ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ కింగ్డమ్ ఓటీటీ రైట్స్ తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇక్కడే స్ట్రీమింగ్
ఒప్పందం ప్రకారం ఈ సినిమాను ఆగష్టు 27న విడుదల చేస్తున్నట్టు ఇటీవల సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది. చెప్పినట్టుగానే గణేష్ చతుర్థికి విజయ్ ఫ్యాన్స్ కి పండగ కానుక ఇచ్చింది. ఈ పండుగ సందర్భంగా కింగ్డమ్ ని ఓటీటీలో స్ట్రీమింగ్ కి తీసుకువచ్చింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. అర్థరాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఇంకేందుకు ఆలస్యం. థియేటర్లలో మిస్ అయిన వారు.. ఈ గణేష్ చతుర్థికి ఓటీటీ కింగ్డమ్ చూసి ఎంజాయ్ చేయండి.
కథేంటంటే
కాగా స్పై యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో విజయ్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించాడు. ఓ సీక్రెట్ ఆపరేషన్ కోసం అ డు మాఫీయాలో చేరాల్సి వస్తుంది. ఈ క్రమంలో విజయ్ డాన్ గా మారిపోతాడు. అయితే అక్కడ సత్యదేవ్ ని పోలీసులకు పట్టించడమే ఈ సీక్రెట్ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం. అయితే డాన్ గా మారిన విజయ్ కి సత్యదేవ్ తన అన్నయ్య అని తెలుస్తోంది. అది తెలిసి విజయ్ ఏం చేవాడు? అన్నయ్య అంటే అమితమైన ప్రేమ ఉన్న అతడు సత్యదేవ్ పట్టించాడా? లేదా? స్టోరీ. ఈ క్రమంలో విజయ్ పండించిన బ్రదర్ సెంటిమెంట్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇందులో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటించింది. కానీ, ఇందులో ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోవడంతో గ్లామర్ టచ్ కూడా పెద్దగా కనిపించలేదని ఆడియన్స్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు హీరోహీరోయిన్ల మధ్య కూడా కెమిస్ట్రీ పెద్దగా వర్కౌట్ కాలేదని టాక్ కూడా వచ్చింది. ఇదిలా ఉంటే కింగ్డమ్ ను సీతార ఎంటర్టైన్మెంట్స్, ఫ్యార్చ్యూన్ ఫోర్ బ్యానర్ లో సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ చిత్రాన్ని నిర్మించారు.