Manchu Lakshmi:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బడా ఫ్యామిలీ గా గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మీ (Manchu Lakshmi) దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ తెరపైకి రాబోతోంది. ఒకప్పుడు ‘అగ్ని నక్షత్రం’ అంటూ ప్రకటించిన సినిమాను.. ఇప్పుడు టైటిల్ చేంజ్ చేస్తూ ‘దక్ష: ది డెడ్లీ కాన్స్పిరసీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్న మంచు లక్ష్మీ.. గతంలో తాను ముంబైకి షిఫ్ట్ అయినప్పుడు రామ్ చరణ్ ఇంట్లో ఉన్నాను అంటూ టాప్ సీక్రెట్ ను రివీల్ చేసింది. ఈ మేరకు ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి.. రామ్ చరణ్ ఇంట్లో దాగి ఉన్న విషయాన్ని తెలియజేస్తూనే.. మరొకవైపు రామ్ చరణ్ వ్యక్తిత్వంపై కూడా ఊహించని కామెంట్లు చేసింది.
ఇంటర్వ్యూలో భాగంగా మంచు లక్ష్మీ మాట్లాడుతూ.. “నేను ఇక్కడ ముంబైకి షిఫ్ట్ అయినప్పుడు నాకు ఎవరూ తెలియదు. కనీసం ఇల్లు కూడా లేదు. ఒక ఇంటిని రెంటుకు తీసుకుందామని అడగగా.. అది ఒక షెల్ లాగా ఉండింది. దానిని రిపేర్ చేయడానికి దాదాపు 40 రోజులు పడుతుందని ఇంటి ఓనర్ చెప్పారు. ఇక ఆ సమయంలో ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. అయితే రామ్ చరణ్ కి నా గురించి ఎలా తెలిసిందో తెలియదు కానీ వెంటనే నాకు ఫోన్ చేసి ముంబైలో ఉన్న తన ఇంట్లో ఉండమని చెప్పారు. ఇక్కడ నేను ఆ ఇంట్లో ఉండడానికి ఒప్పుకోలేదు. కానీ రామ్ చరణ్ పట్టుబట్టి.. తన భార్యతో ఫోన్ చేయించి మరీ నన్ను ఆ ఇంట్లో ఉండమని చెప్పారు. పాపని తీసుకొని ఎక్కడికి వెళ్తావు ఈ ఇంట్లోనే ఉండు అని చెప్పి నేను ముంబైలో ల్యాండ్ అవ్వగానే నా చేతికి తన ఇంటి తాళాలు ఇవ్వడమే కాకుండా.. ఒక అసిస్టెంట్ ని కూడా అరేంజ్ చేశారు. అవసరమైతే వాడుకో లేకపోతే లేదు నీకు ఏ అవసరం వచ్చినా క్షణాల్లో ఫోన్ చెయ్యి అని చెప్పారు. అయితే ఎన్ని రోజులు ఉంటావు అని ఏ ఒక్క రోజు కూడా అడగలేదు.
ఇలాంటి గొప్ప వ్యక్తిని జీవితంలో చూసి ఉండరు…
నేను ముంబైలో అపార్ట్మెంట్ తీసుకునే అంతవరకు కూడా రామ్ చరణ్ ఇంట్లోనే ఉన్నాను. నాకు కావలసిన ప్రతిదీ కూడా అడగకుండానే తెచ్చి పెట్టేవాడు. అసలు రామ్ చరణ్ చాలా హంబుల్.. గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అలాగే సిగ్గుపరుడు కూడా. నా జీవితంలోనే కాదు ఎవరి జీవితంలో కూడా ఇలాంటి ఒక గొప్ప వ్యక్తిని చూసి ఉండరు. అంత మంచివాడు రామ్ చరణ్ ” అంటూ రామ్ చరణ్ పై ఊహించని కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది మంచు లక్ష్మి. మొత్తానికి అయితే రామ్ చరణ్ సినిమాలతోనే కాదు వ్యక్తిత్వంతో కూడా వందకి వంద మార్కులు కొట్టేసారని మెగా అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ – ఉపాసన దంపతులు ఎంత గొప్పగా ఉంటారో మంచు లక్ష్మి చెప్పిన మాటలు వింటుంటే అర్థమవుతుందని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
ALSO READ:Poonam Pandey: రామాయణ కీలక పాత్రలో పూనమ్ పాండే.. మండిపడుతున్న హిందూ సంఘాలు